Mehbooba Trailer | మెహబూబా ట్రైలర్ | Puri Jagannadh | Akash Puri | Neha Shetty - Sakshi

Apr 9 2018 5:36 PM | Updated on Apr 9 2018 6:00 PM

Puri Jagannadh Mehbooba Trailer Out - Sakshi

పైసా వసూల్‌ తర్వాత పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రం మెహబూబా. పూరీ తనయుడు ఆకాశ్‌ హీరోగా తెరకెక్కతున్న ఈ చిత్రం ట్రైలర్‌ వచ్చేసింది. ‘నో వన్‌ లవ్స్‌ ఏ సోల్జర్‌.. అన్‌ టిల్‌ ది ఎనిమీ ఎట్‌ ది గేట్‌’ అంటూ ఇంగ్లీష్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. సరిహద్దులో ప్రేమ కోసం రవి అనే యువ సైనికుడు చేసే పోరాటం.. అవతలి వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన.. ఇలాంటి అంశాలను చూపించేశారు. 

దేశాన్ని ప్రేమించే మనసు ఓ సైనికుడికి మాత్రమే ఉంటుంది. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలూ.. అసలీ సరిహద్దులనేవి లేకుంటే ఎంత బాగుండేది.. అంటూ హీరోయిన్‌ చెప్పే డైలాగులు, మమల్ని చంపేస్తే మళ్లీ పుడతాం, మళ్లీ మళ్లీ పుడతాం.. చివర్లో సల్మాన్‌, షారూఖ్‌, అమీర్‌, అబ్దుల్‌ కలాం, మేరీ మెహబూబా... జిందాబాద్‌ అంటూ ఆకాశ్‌  చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. రవి అనే సైనికుడి పాత్రలో ఆకాశ్‌.. మెహబూబా పాత్రలో నేహా శెట్టి.. వారి మధ్య ప్రణయ గాథగా మెహబూబా చిత్రం తెరెక్కింది.

సందీప్‌ చౌతా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదనిపించింది. యాక్షన్‌ పార్ట్‌ కూడా ఓకే అయినప్పటికీ... యుద్ధ సన్నివేశాల కోసం వాడిన గ్రాఫిక్స్‌ ట్రైలర్‌లో కాస్త నాసిరకంగా అనిపిస్తున్నాయి. మొత్తానికి ఓ టిపికల్‌ సబ్జెక్ట్‌కు తన స్టైల్‌ టేకింగ్‌తో పూరీ సినిమాను తెరకెక్కించినట్లు అర్థమౌతోంది. పూరీ జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ బ్యానర్‌పై పూరీ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్న మెహబూబా మే 11న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement