![Nagarjuna In Puri Jagannath Auto Jhony - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/24/Nagarjuna%20Puri%20Jagannath.jpg.webp?itok=UehfM77P)
మెహబూబా సినిమాతో మరోసారి నిరాశపరిచిన పూరి తన తదుపరి చిత్రాన్ని కూడా ఆకాష్ హీరోగా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప‍్రయత్నాల్లో భాగంగా సీనియర్ హీరో నాగార్జునకు ఓ కథ వినిపించాడట పూరి.
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే తెరకెక్కించాలని భావించారు. పూరి చెప్పిన ఆటోజాని కథతో పూర్తిగా సంతృప్తి చెందని చిరు రీమేక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే కథకు మార్పులు చేసి నాగార్జునకు వినిపించాడట పూరి. మరి నాగ్ ఆటోజానికి ఓకె చెప్తాడా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.
గతంలో పూరి, నాగార్జున కాంబినేషన్‌లతో వచ్చిన సూపర్, శివమణి సినిమా మంచి విజయాలు సాధించాయి. అందుకే మరోసారి పూరితో సినిమా చేసేందుకు నాగ్ ఓకె చెప్పే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment