![Mehbooba Movie Success Meet - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/16/Mehabooba.jpg.webp?itok=45UHKse1)
‘‘అమెరికాలో తెలుగువాళ్లతో కలిసి ‘మెహబూబా’ ప్రీమియర్ చూశాం. అందరికీ బాగా నచ్చింది. హైదరాబాద్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నాలుగోసారి, ఐదోసారి చూసినవాళ్లను కూడా నేను కలిశాను. ఆకాష్ బాగా చేశాడంటూ అభినందిస్తున్నారు’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆకాష్ పూరి, నేహాశెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి కనెక్ట్స్ నిర్మాణంలో రూపొందిన ‘మెహబూబా’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘మెహబూబా’ రెగ్యులర్‌గా నేను తీసే సినిమాల్లా ఉండదు. కమర్షియల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే లవ్‌స్టోరీ.
నా కెరీర్‌లో బాగా మనసుపెట్టి తీసిన సినిమా ఇది. హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘మెహబూబా’ లాంటి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి. సినిమాలోని విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌ని ఎంజాయ్ చెయ్యాలంటే బిగ్ స్క్రీన్‌లోనే సాధ్యమవుతుంది’’ అన్నారు చార్మి. ‘‘మెహబూబా’ చూసినవాళ్లంతా చాలా బాగుందని చెబుతున్నారు. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నాన్నకి థ్యాంక్స్. ఆ పదం చాలా చిన్నదని నా ఒపీనియన్. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు పూరి ఆకాష్. ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమాలు చూడాలనుకునేవారికి ‘మెహబూబా’ తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు నేహాశెట్టి. నటులు విషురెడ్డి, విజయ్, పృథ్వీ, ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ, ఆర్ట్ డైరెక్టర్ జానీ షేక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment