కామెడీ హీరోతో పూరి | Puri Jagannadh Next movie with Sunil | Sakshi
Sakshi News home page

కామెడీ హీరోతో పూరి

Oct 7 2017 11:29 AM | Updated on Oct 7 2017 11:29 AM

Puri Jagannadh Sunil

వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, స్పీడు మాత్రం తగ్గించలేదు. ఇప్పటికే తన తనయుడ్ని రీ లాంచ్ చేస్తూ మెహబూబా సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన పూరి, తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. పైసా వసూల్ సినిమాతో మరోసారి నిరాశపరిచిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం మెహబూబా సినిమా మీద దృష్టి పెట్టాడు.

ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఈ సినిమాను పూరి జగన్నాథ్ స్వయంగా చార్మీతో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి కామెడీ ఎంటర్ టైనర్ గా ఓ సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నారు పూరి.

ఈ సినిమాలో హీరోగా సునీల్ నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సునీల్ కెరీర్ కూడా కష్టాల్లో ఉంది. హీరోగా మారిన తరువాత ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సునీల్ ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి పూరి, సునీల్ ల కాంబినేషన్ లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement