నటి చార్మీ
లైఫ్ చాలా సింపుల్ రిలేషన్‌షిప్స్ ఇంకా సింపుల్ లైఫ్‌లో కిందపడితే ‘భౌభౌ’ అంటారు. అదే పైకి లేస్తే ‘వావ్ వావ్’ అంటారు. మొరిగేవాళ్లే కాంప్లికేటెడ్ ఎప్పుడు ‘భౌభౌ’ అంటారో ఎప్పుడు ‘వావ్ వావ్’ అంటారో తెలియదు. ‘పీసీ’ అంటే పూరీ కనెక్ట్స్ కాదు.. పూరి, చార్మి అంటున్నారని టాక్ అంటే.. మొరిగేవాళ్లను మొరగనివ్వండి అంటున్నారు చార్మి. పీసీ అంటే ‘ప్రొఫెషనల్ కనెక్షన్’ అని కన్ఫార్మ్ చేస్తున్నారు చార్మి.
బేసిక్‌గా మీరు మంచి యాక్ట్రెస్. ఆన్ స్క్రీన్‌కి దూరమై, ఆఫ్ స్క్రీన్ ప్రొడక్షన్ వ్యవహారాలకు స్టిక్ అయిపోయారేంటి?
చార్మి: నేను ఆల్ టైప్ ఆఫ్ జానర్ మూవీస్ చేసేశాను. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం.. ఇలా ఎక్కువ భాషల్లో, అందరి సూపర్ స్టార్స్‌తో సినిమాలు చేశాను. రొమాన్స్, మాస్ మసాలా, దెయ్యాలు, థ్రిల్లర్స్, ఐటమ్ సాంగ్స్... ఏదీ వదిలిపెట్టలేదు. ఇప్పుడూ అలాంటి సినిమాలే అంటే నా మైండ్ ఒప్పుకోవడంలేదు.
ఇంకా ఎన్నాళ్లని అదే చేస్తాం? చేసినన్నాళ్లు చాలా జెన్యూన్‌గా, హానెస్ట్‌గా చేశాను. ఏదో డబ్బు ఇస్తున్నారు కదా అని నా ప్రొఫెషన్‌ని చీట్ చేయలేదు. పదిహేనేళ్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశా. అప్పుడు అది బాగుందనిపించింది. ఇప్పుడు ఇది చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు నా మైండ్, నా సోల్ అన్నీ ఈ కంపెనీ (పూరీ కనెక్ట్స్) మీదే. ప్రొడక్షన్‌ని డీల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఈ స్ట్రెస్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నా.
జనరల్‌గా ఏ కంపెనీ అయినా ఉన్నని రోజులు అంతా బాగానే ఉంటుంది. తర్వాత కలహాలొస్తే అప్పుడు మీ లైఫ్ ఏంటి ?
పూరీగారు ‘నథింగ్ ఈజ్ పర్మినెంట్’ అంటారు. అప్స్ అండ్ డౌన్స్ కామన్. అవి పేరెంట్స్‌తో కూడా రావొచ్చు కదా? వాళ్లు నాతో జీవితాంతం ఉంటారని గ్యారంటీ ఏంటి? రిలేషన్‌షిప్‌లో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావని గ్యారంటీ ఏంటి? మేం లైమ్‌లైట్‌లో ఉన్నాం అని మా కంపెనీ మీద చాలామందికి ప్రత్యేక దృష్టి ఉంటుందేమో.
ఇక్కడ ఎప్పుడూ వర్క్ గురించే. వర్క్ తప్ప ఇక్కడేమీ ఉండదు. 24 గంటలు సినిమా పనులతో బిజీగా ఉంటాం. నాకు మెన్, ఉమెన్ అని వేరు చేయడం ఇష్టం ఉండదు. ఎవరి మైండ్ కరెక్ట్‌గా ఉంటే వాళ్లతో వర్క్ చేయడానికి ఇష్టపడతాను.
పీసీ అంటే ‘పూరీ కనెక్ట్స్’. కానీ చాలామంది పి అంటే పూరి, సి అంటే చార్మి అనుకుంటున్నారు. దాని గురించి?
పూరీగారు ఫేమస్ కాబట్టి, చార్మి ఫేమస్ కాబట్టి అలా అనుకుంటున్నారు. అదే నేను అబ్బాయిని అయితే అలా అనుకోరు కదా. లేదా నేను ఒక హీరోయిన్‌ని కాకుంటే అలా అనుకోరు కదా. ఇప్పుడు నేనేం చెప్పినా పట్టించుకోరు. మాట్లాడుకునేది మాట్లాడుకుంటూనే∙ఉంటారు. అందుకే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం మానేశాను.
నా బిల్స్ సొసైటీ కట్టడంలేదు. పబ్లిక్ కట్టడం లేదు. మీరూ కట్టడంలేదు. నేనే కట్టుకోవాలి. నా జీవితం నేనే బ్రతకాలి. వాళ్లు ఇలా అనుకుంటున్నారు... వీళ్లు ఇలా అనుకుంటున్నారని నా పనులన్నీ ఆపేసి కూర్చోలేను. మీ ఇష్టం అని వదిలేయడమే.
మీ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌పై చాలామందికి క్వొశ్చన్స్ ఉన్నాయి.. వాటికి ఆన్సర్స్ ఆశిస్తారు?
ఇతరుల లైఫ్ గురించి కొన్ని క్వొశ్చన్స్ అనుకుని ఆన్సర్స్ కోసం చూడటం మానుకోవాలి. ఆ ఆరాటాన్ని వదిలించుకుంటే పైకి వస్తారు. వర్క్‌లో ఫోకస్ ఉంచితే ఎక్కడికో వెళ్లిపోతారు. సాయంత్రం అవ్వగానే వాళ్ల గురించి, వీళ్ల గురించి సొల్లు కబుర్లు చెప్పుకునేవాళ్లు లైఫ్‌లో పైకి రారు.
పూరీగారి లవ్‌స్టోరీలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన తీసిన మిగతా లవ్‌స్టోరీలకు ‘మెహబూబా’ ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోంది?
‘మెహబూబా’ ఫుల్ ఇన్‌టెన్స్ లవ్‌స్టోరీ. 1970 టైమ్‌లో జరిగే కథ. బేసిక్‌గా ఇది పునర్జన్మల కథ. 1970లో ఒక కథ, 2018లో మరో కథ జరుగుతుంది. 1970లో జరిగేది ఇండో–పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ కొత్త కాన్సెప్ట్. న్యూ అటెమ్ట్ కూడా. పూరీగారికి వార్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. ఈ వార్ బేస్డ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది.
యాక్ట్రె స్‌గా ఉండటం వల్ల ఎక్కువ సంపాదించారా? లేక ప్రొడక్షన్‌లో ఉండటం వల్లనా?
నేనెప్పుడూ మనీ వైపు అట్రాక్ట్ అవ్వలేదు. ‘ఐ యామ్ అట్రాక్టెడ్ టు వర్క్’. మనకి కావల్సింది ఏంటి? మంచి ఇల్లు, లగ్జరీ కారు, కోరుకున్న ఫుడ్, మంచి డ్రెస్సులు. నాకు విశాలమైన ఇల్లు ఉంది. లగ్జరీ కారు ఉంది. ఫైవ్‌స్టార్ హోటల్స్‌కి వెళ్లే స్తోమత ఉంది. హ్యాంగ్ అవుట్ అవ్వడానికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు.
ఇంకా ఎందుకు డబ్బు కోసం పరిగెత్తడం? అందుకే ఇక డబ్బు గురించి అంత ధ్యాస లేకుండా పోయింది. ఇప్పుడు నాకు మంచి వర్క్ కావాలి. అది ఈ కంపెనీలో దొరుకుతోంది.
ఐ యామ్ హ్యాపీ.
సొసైటీలో ఏం జరుగుతోందో తెలుసుకుంటారా? సొసైటీ మీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటారా?
ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటేనే తెలుసుకుంటా. పట్టించుకోకూడదనుకుంటే పట్టించుకోను. నేను ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను. ‘లివ్, లెట్ లివ్’. నేను ఒకరి జీవితంలోకి తొంగి చూడాలని ఆరాటపడను. సొసైటీ గురించి మాట్లాడుకుంటే... ‘నేను ఆడ, తను మగ’ అనే వ్యత్యాసాన్ని వేరు చేయాలి. ఈ జెండర్ డిస్క్రిమినేషన్‌ని మైండ్‌లో నుంచి తీసేయాలి.
ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి వర్క్ చేస్తే అదేదో కాని పని అన్నట్లు చూడటం మానేయాలి. మా కంపెనీలో ఒక్కటే రూల్. రండి.. వర్క్ చేయండి. మీకేమైనా వేరే ఉద్దేశం ఉంటే వెళ్లిపోండి. అంతే. ఎందుకంటే మా మైండ్‌లో వర్క్ తప్పితే ఇంకేం ఉండదు. మా ఇంట్లో నన్ను మా నాన్నగారు అబ్బాయిలానే చూస్తారు. అందుకే ‘బేటా’ అని పిలుస్తారు. మా ఫ్యామిలీలో నేను ‘బాయ్ టైప్’.
అంటే ‘బేటా’ అనిపించుకోవడంలోను, ‘బాయ్ టైప్’ అనుకోవడంలోనూ ప్రౌడ్‌నెస్ ఉంది అంటారా? ఉమెన్‌గా ఉండటంలో అది లేదా? స్ట్రాంగ్ ఉమన్ అని అనుకోవచ్చు కదా?
ఎగ్జాంపుల్ కోసం ‘బాయ్’ అన్నా. ‘ఐయామ్ ఎ స్ట్రాంగ్ ఉమన్’. అసలు మ్యాన్, ఉమన్ అని ఎందుకీ డిఫరెన్స్? నేనేంటి? ఈరోజు లేవగానే ఏం పని చేయాలి? అని మాత్రమే ఆలోచిద్దాం. ఎవర్నీ హర్ట్ చేయకుండా ఉందాం. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అన్నట్లు ఉంటే అందరూ హ్యాపీగా ఉంటాం.
చేసిన క్యారెక్టర్లే వస్తున్నాయని నటించడంలేదు. కానీ పబ్లిక్ అప్పియరెన్స్‌లు కూడా తగ్గించేశారు.. కారణం?
ఆఫీసులో ఉండి, ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ లొకేషన్‌కి వెళుతున్నాను. కానీ నేను బయట కనిపించాలని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు నాకు పబ్లిక్ అప్పియరెన్స్ ఇష్టం లేదు. బయటకు నా ఫేస్ చూపించడం ఇష్టం లేదు. కెమెరా వెనక ఉండి వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నా.
ఒక ఉమన్ ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. ‘మెహబూబా’ని సింగిల్ హ్యాండెడ్‌గా చేయడం ఎలా అనిపించింది?
సింగిల్ హ్యాండ్ అని చెప్పలేను. మా కంపెనీ (పూరీ కనెక్ట్స్) నుంచి వస్తున్న సినిమా ఇది. పూరీగారు మోస్ట్ ఈజియస్ట్ బిజినెస్ పార్టనర్, ఈజియస్ట్ డైరెక్టర్. ఆయన కింద పని చేసేవాళ్లను అడగండి. పూరీగారంటే మాకు పిచ్చ ఇష్టం అంటారు. వాళ్లందరికీ ఆయన మీద అంత ఇష్టం ఉండటం వల్ల ప్రేమతో వర్క్ చేస్తారు. నాకు వాళ్లందర్నీ హ్యాండిల్ చేయడం పెద్ద కష్టం కాలేదు.
ఒకవేళ పూరీగారి సినిమా కాకుండా వేరే సినిమా అయితే కష్టంగా ఉంటుందా?
అవును. ఇంపాజిబుల్. ఆయన కాబట్టి వర్క్ చాలా ఈజీ అయిపోయింది. పూరీగారు లేకుండా అంటే చాలా కష్టం.
ఎలాగూ ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం వచ్చింది. సోలోగా సినిమాలు ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు. ‘ఫిమేల్ ప్రొడ్యూసర్స్’ తక్కువ ఉన్నారు కదా?
నాకలాంటి ఆలోచనలు లేవు. ఇన్నేళ్లూ సోలో హీరోయిన్ గానే చేశాను కదా. ఇప్పుడు టీమ్ వర్క్‌గా అందరం కలిసి ప్రొడక్షన్ చేద్దామనుకుంటున్నాను. టీమ్ వర్క్ వల్ల చాలాకాలం నిలబడతామని నా నమ్మకం. సాఫ్ట్‌వేర్ కంపెనీలనే తీసుకుందాం. ఇద్దరు ముగ్గురు ఫౌండర్స్ ఉంటారు. వాళ్లెప్పుడూ సోలోగా పేరు ఇవ్వరు. వాళ్ల కంపెనీ పేరునే బయటకు ఇస్తారు. ఎందుకంటే వాళ్లు టీమ్ వర్క్‌ని నమ్ముతారు.
కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ కి ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్ కాంబినేషన్ సెట్ కావడం రేర్..
అలా చూస్తే మీకు రేర్‌గానే అనిపిస్తుంది. కాంబినేషన్స్ ఎందు కు కలవవు. బాపు–రమణగారు జీవితం మొత్తం కలిసే ట్రావెల్ చేశారు. యస్వీ కృష్ణారెడ్డిగారు–అచ్చిరెడ్డిగారు ఉన్నారు. వాళ్లు కలిసే ట్రావెల్ చేస్తారు. ఎవరూ ఏమీ అనరు. ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ‘జెండర్’ వేరయ్యేసరికి టాపిక్ అవుతోంది. ఇలా టాపిక్ అవుతుందని ఇంట్లో కూర్చోలేం కదా.
మీరు తీసుకునే నిర్ణయాలపట్ల చాలా క్లారిటీగా ఉన్నారనిపిస్తోంది. మరి.. ఇంతే క్లారిటీతో పెళ్లి గురించి ఆలోచించారా?
పెళ్లి చేసుకోను. ‘ఐ యామ్ నాట్ మేడ్ ఫర్ మ్యారేజ్’. నేను రిలేషన్‌షిప్‌లో కూడా ఉండలేను. ఎవర్నీ ప్రేమించలేను. ఒక రిలేషన్‌షిప్‌కి కావాల్సినట్టు ఉండలేను. అందుకే పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను. నా అంతట నేను బతకగలను. కావాలంటే పాస్‌పోర్ట్ తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోతా.
ఎవ్వరికీ ఫోన్ కూడా చేయను. ఒకవేళ రిలేషన్‌షిప్‌లో ఉంటే చాలా క్వొశ్చన్స్‌కు ఆన్సర్ చేయాలి. ‘నేను ఓ ఇరవై రోజుల తర్వాత ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్దాం అనుకుంటున్నా’ అని ముందే ప్రిపేర్ చేయాలి. అవన్నీ నా వల్ల కాదు. నాకు నచ్చినట్టు ఉంటాను. నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను.
కానీ ‘ఒక బంధం’లో సెక్యూరిటీ ఉంటుంది కదా?
బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అదే సెక్యూరిటీ. భర్త ఉంటాడు. అతను డబ్బు ఇవ్వకపోతే ఆ భార్య పరిస్థితి ఏంటి? ఇల్లు ఎలా గడుస్తుంది? ఏదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. సమయానికి భర్త ఇంట్లో ఉండడు. హాస్పటల్‌కి వెళితే ఎవరు చూస్తారు? నర్సే కదా. ఆ నర్స్‌కి ఇవ్వడానికి మన దగ్గర డబ్బులుంటే చాలు. సెక్యూర్డ్ పొజిషన్‌లో ఉన్నట్లే.
గతంలో ఓ వ్యక్తితో ఏర్పడిన ‘రిలేషన్‌షిప్’ తాలూకు చేదు అను భవం వల్లే మీ మైండ్ సెట్ ఇలా మారిందా?
ఆ రిలేషన్‌షిప్ గురించి ఎవరికి వాళ్లు ఊహించుకున్నారు. నేనెప్పుడైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని ఒప్పుకున్నానా? క్లియర్‌గా చెబుతున్నాను.. నేనిలా ఆలోచించడానికి ఎవరూ కారణం కాదు. ఎవర్నీ నిందించదలచుకోలేదు.
మీరు హ్యాపీగా ఉన్నారని అర్థం అవుతోంది. మీ డెసిషన్‌తో మీ అమ్మానాన్న కూడా హ్యాపీనా?
ఇక వాళ్లకు ఆప్షన్ లేదు. నన్ను ఫోర్స్ చేయరు. వాళ్లకేం కావాలి? వాళ్ళ అమ్మాయి నవ్వుతూ, ఆనందంగా ఉండాలి. పని చేసుకుని, నవ్వుకుంటూ ఇంటికి వస్తుందా? లేదా అన్నది వాళ్లకు ముఖ్యం. నేను హ్యాపీగా ఉన్నాను. మా నాన్నగారు మా అమ్మతో ‘ఇదిగాని పెళ్లి చేసుకుంటే 6 నెలల్లో డైవర్స్ అయిపోతుంది’ అంటూంటారు.
మీ ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతం ప్రొడక్షన్ చూస్తున్నారు.. డైరెక్షన్ వైపు కూడా వెళతారా?
ఆ ప్లాన్స్ లేవు. నా ఊపిరి ఉన్నంతవరకూ సినిమాల్లోనే ఉండాలి. ఈ పూరీ కనెక్ట్స్ కంపెనీని చాలా పెద్దది చేయాలి. పూరీగారితో మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది.
ఆకాశ్ పూరి గురించి? తన యాక్టింగ్ ఎలా అనిపించింది?
ఆకాశ్ ఈజ్ సూపర్. ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. ‘మెహబూబా’ చేశాడని చెప్పడం లేదు. తను బయట సినిమాలు చేసినా కూడా నేను ఇదే చెబుతాను. చిన్నప్పటి నుంచి తనలో తపన ఉంది. పెద్ద హీరో అవ్వాలనే కసి ఉంది. ఆకాశ్‌ది మంచి పెంపకం. తన బిహేవియర్ చాలా బాగుంటుంది. ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చే విధానం, తను యాక్ట్ చేసే వి«ధానం సూపర్. కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు.
ఒక ప్రొడ్యూసర్‌గా పూరీగారి డైరెక్షన్ గురించి?
నేనెవర్ని ఆయన గురించి చెప్పడానికి. హీ ఈజ్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. ‘మెహబూబా’ ఆన్ లొకేషన్‌లో ఏదైనా సీన్ చూసినా, డబ్బింగ్‌లో ఏదైనా సీన్ చూసినా నేను ఆడియన్‌లాగా చూస్తాను. నేను నిర్మాత.. ఆయన డైరెక్టర్.. అలా ఏమీ ఉండదు. ఆయన బాస్. పూరీగారితో పని చేయడమే నేను గొప్ప అనుకుంటున్నాను. నాకు పనిలో ఇంత రెస్పెక్ట్ ఇవ్వడమే గొప్ప. ‘హీ ఈజ్ పూరి జగన్నాథ్’. బయట చాలామంది పూరీగారితో పని చేయాలని కోరుకుంటారు. నాకా అవకాశం దక్కింది.
మీ కెరీర్‌ని ఎనలైజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంటుంది?
నా కెరీర్‌లో బెస్ట్ ఫేజ్ అంటే ఇదే.
ఎందుకలా? కారణం?
హీరోయిన్‌గా ఉన్నప్పుడు కష్టమైనా ఉదయాన్నే నిద్ర లేవాలి. వర్కవుట్స్ చేయాలి. ఫుడ్ విషయంలో కంట్రోల్‌గా ఉండాలి. ఇప్పుడీ కష్టాలు లేవు. లేటుగా నిద్ర లేవాలనిపిస్తే అలానే చేస్తాను. వర్క్ చేయాలనే మూడ్ లేకపొతే చేయను. యాక్ట్ చేసినప్పుడు ఓన్లీ యాక్టింగ్ మీదే దృష్టి పెట్టాను. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకుంటున్నాను. ఫిల్మ్ ప్రొడక్షన్ ఈజీ కాదు.
సినిమా తీయడం, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేయడం, దాన్ని పబ్లిసిటీ చేసి, సినిమా రిలీజ్ చేయడం.. ఇవన్నీ పెద్ద టాస్క్. ‘మెహబూబా’ సినిమా ద్వారా ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ వచ్చింది. ఇదివరకు సంవత్సరానికి ఆరు సినిమాలు చేశాను కానీ ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ అప్పుడు లేదు. ఇప్పుడు ‘మెహబూబా’ ట్రైలర్ బావుంది, సినిమా రిలీజ్ ఎప్పుడు అని అందరూ అడుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఐ యామ్ ఇన్ హ్యాపీ స్పేస్.
ఫిల్మ్ ప్రొడక్షన్ చూసుకుంటూ హ్యాపీ స్పేస్‌లో ఉన్న మీరు హీరోయిన్‌గా చేసినప్పుడు ‘క్యాస్టింగ్ కౌచ్’ లాంటి వాటితో ఇబ్బందులు పడ్డారా?
నిజం చెప్పాలంటే నేను బ్లెస్డ్. నా పేరెంట్స్ ఎప్పుడూ నాతోనే ఉన్నారు. 13 ఏళ్లకే యాక్టింగ్ స్టార్ట్ చేశాను. 15కి స్టార్ అయిపోయాను. స్టార్ అయ్యాక నా డెసిషన్స్ అన్నీ మా నాన్నగారే తీసుకునేవారు. నా ప్రతి బర్త్‌డేని యూనిట్ సభ్యుల మధ్య లొకేషన్‌లో జరుపుకున్నాను. కేక్ కట్ చేసి మళ్లీ షాట్‌కి వెళ్లిపోయేదాన్ని. హ్యాపీగా గడిచింది. అంతా దేవుడి దయ.
Comments
Please login to add a commentAdd a comment