ఆకాష్ పోరాడబోయేది ఇతనితోనే..! | Gautham Kurup as villain in Mehbooba | Sakshi
Sakshi News home page

ఆకాష్ పోరాడబోయేది ఇతనితోనే..!

Oct 14 2017 11:56 AM | Updated on Oct 14 2017 11:56 AM

Gautham kurup

డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కు వరుసగా ఫ్లాప్ లు వస్తున్నా స్పీడు మాత్రం తగ్గించటం లేదు. ప్రస్తుతం ఆయన తన తనయుడ్ని రీలాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఓ పీరియాడిక్ లవ్ స్టోరితో ఆకాష్ ను హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. మెహబూబా పేరుతో 1971 నాటి భారత్, పాకిస్థాన్ ల యుద్ధ నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గానటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు విలన్ కు ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. తమిళ సూపర్ హిట్ తుపాకీ సినిమాలో కీలక పాత్రలో నటించిన గౌతమ్ కురుప్ మెహబూబాలో విలన్ గా నటించనున్నాడట. గౌతమ్.. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డిక్టేటర్ లోనూ నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement