కండోమ్‌ తెచ్చిన కష్టాలు.. ఆసక్తికరంగా సర్కారు నౌకరి ట్రైలర్‌ | Sarkaaru Noukari Movie Trailer Out, Watch Video Inside Goes Viral - Sakshi
Sakshi News home page

Sarkaaru Noukari: కండోమ్‌ తెచ్చిన కష్టాలు.. ఆసక్తికరంగా సర్కారు నౌకరి ట్రైలర్‌

Published Wed, Dec 20 2023 6:06 PM | Last Updated on Wed, Dec 20 2023 7:56 PM

Sarkaaru Noukari Movie Trailer Out - Sakshi

ప్రముఖ సింగర్‌ సునీత కుమారుడు ఆకాష్‌ హీరోగా పరిచమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. భావన హీరోయిన్ గా నటిస్తోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం  వహిస్తున్న ఈ చిత్రాన్ని  ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు.  న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, శేఖర్‌ కమ్ముల, అనిల్‌ రావిపూడి, సునీతతో పాటు చిత్రం బృందం పాల్గొంది.

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.  గోపాల్‌(ఆకాష్‌)కి ఆరోగ్య శాఖలో ఉద్యోగం వస్తుంది. కొత్తగా పెళ్లైన భార్య (భావన)తో కలిసి తెలంగాణలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్తాడు.  గ్రామాల్లో నిరోధ్‌ వాడకం గురించి అవగాహన కల్పించడం అతని పని. కానీ గోపాల్‌కు ఆ ఊరి ప్రజల నుంచి వ్యతిరేకత  వస్తుంది. నిరోధ్‌ వాడకం గురించి తెలియక వాటిని పిల్లలు ఆడుకునే బుగ్గలుగా చూస్తారు.

అంతేకాదు గోపాల్‌ని బుగ్గలోడు అని హేళన చేస్తారు. గోపాల్‌ చేసే పని కాపురంలో కూడా చిచ్చు పెడుతుంది. ఆ ఉద్యోగం భార్యకు నచ్చదు. దీంతో ఉద్యోగమో నేనో తేల్చుకోమని భార్య అంటుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? ఉద్యోగాన్ని ప్రాణంగా భావించే గోపాల్‌ తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చాడు అనేదే మిగతా కథ. ట్రైలర్‌ కామెడీగా అనిపించినా.. చాలా ఇదొక ఎమోషనల్‌ స్టోరీలా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement