
ఆకాష్,. ప్రియ
‘ఆనందం’ ఫేమ్ ఆకాష్ నటించిన తాజా తెలుగు చిత్రం ‘కొత్తగా ఉన్నాడు’. ప్రియ, సోనియా కథానాయికలు. ఎం.రాధా దర్శకత్వంలో రాజా మీడియా వరల్డ్ సమర్పణలో జై బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై ఎం.కె. రాజా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని, యు.కె.మురళి స్వరపరచిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ– ‘‘లండన్ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆంధ్ర, తెలంగాణ కుర్రాడిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించా. విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’ తరహాలో అందర్నీ అలరిస్తుంది.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే నేనే అందించా’’ అన్నారు. ‘‘ఆకాష్‌గారి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేను. ‘కొత్తగా ఉన్నాడు’లో అన్ని పాటలు బాగున్నాయి’’ అన్నారు యు.కె.మురళి. ‘‘కొత్తగా ఉన్నాడు’ చిత్రంతో తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండటం ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో టాలీవుడ్‌లో నాకు మంచి బోణీ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎం.కె.రాజా. ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్ కొండేటి, ‘వైకుంఠపాళి’ నిర్మాత జైరామ్, నటుడు–నిర్మాత దినేష్ మాడ్నే, దర్శకుడు రవిశర్మ, నిర్మాతలు బాల్‌రెడ్డి, బలవంత్ రెడ్డి, హీరోయిన్స్ ఆర్తీ సురేష్, సుమ, లక్కీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షాన్.
Comments
Please login to add a commentAdd a comment