తెలుగు తెర‌పై మరో కొత్త హీరోయిన్‌ | Bhairavi Makes Her Debut On The Telugu Silver Screen | Sakshi
Sakshi News home page

తెలుగు తెర‌పై మరో కొత్త హీరోయిన్‌

Feb 25 2025 3:11 PM | Updated on Feb 25 2025 3:18 PM

Bhairavi Makes Her Debut On The Telugu Silver Screen

టాలీవుడ్ స్క్రీన్ కు ఓ కొత్త గ్లామర్ యాడ్ కాబోతుంది. అందం, అభినయం కలగలిసిన భైరవి (Bhairavi) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. 'సర్కార్ నౌకరి' ఫేమ్, ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తధాస్తు క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్‌గా భైరవి నటించింది. ఇది ఆమెకు డెబ్యూ మూవీ. 

సెంటిమెంట్, ఎమోషనల్ వంటి సీన్లలో భైరవి యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమా విడుదల తర్వాత భైరవిని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు.శివ ద‌ర్శ‌క‌త్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియ‌ర్ న‌టీన‌టులు రఘుబాబు, పృద్వి, ప్రభావతి త‌దిత‌రులు నటించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ... ''ఈ మూవీ విలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో రూపొందిస్తున్నాం. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ చిత్రం. సర్కార్ నౌకరి ఫేమ్ ఆకాష్ హీరోగా న‌టించే ఈ సినిమా కోసం  హీరోయిన్ గా భైరవి తెలుగు తెర‌కు తొలి ప‌రిచ‌యం చేస్తున్నాం. అచ్చ‌మైన ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో భైరవి స‌రిగ్గా స‌రిపోతుంది. హీరోకి మ‌ర‌ద‌లు పాత్ర చేస్తుంది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్ గా ఉండబోతోంది. ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంద‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ము. ప్ర‌స్తుతం మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న‌ది. త్వ‌ర‌లోనే సినిమా టైటిల్, విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం.'' అని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement