ఒకటే పాత్రతో ఆరు భాషల్లో సినిమా
ఒకటే పాత్రతో ఆరు భాషల్లో సినిమా
Published Thu, Nov 7 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
‘‘ఇప్పటివరకు నేను ఎక్కువ కష్టపడి చేసిన చిత్రం ఇదే. ఆరు భాషల్లో రూపొందించడం వల్ల ఒక్కో సన్నివేశాన్ని ఆరుసార్లు చిత్రీకరించాం’’ అన్నారు ఆకాష్. వారియర్స్ క్లాన్ పిక్చర్స్ పతాకంపై రాహుల్‌సింగ్ ఖగ్‌వాల్ దర్శకత్వంలో ఏక పాత్రతో రూపొందిన చిత్రం ‘నాతో నేను’. ఏకైక పాత్రను ఆకాష్ పోషించగా, నేహా త్యాగి ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరభద్రమ్, ఈశ్వర్‌రెడ్డి, బెక్కెం వేణుగోపాల్, బసిరెడ్డి, గణేష్ దొండి తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏకకాలంలో ఆరు భాషల్లో ఒక చిత్రాన్ని రూపొందించిన ఘనత మాకే దక్కుతుంది. ఒకే లొకేషన్లో ఈ చిత్రాన్ని రూపొందించడం ఓ విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కె. ఎన్.సెబాస్టియన్, మాటలు: సిద్దార్ధ్ ఇంజేటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మయాంక్ గుప్తా.
Advertisement
Advertisement