Natho Nenu Movie Review And Rating In Telugu | Sai Kumar | Srinivas Sai - Sakshi
Sakshi News home page

Natho Nenu Movie Review: 'నాతో నేను' మూవీ రివ్యూ

Published Fri, Jul 21 2023 7:07 PM | Last Updated on Fri, Jul 21 2023 7:34 PM

Natho Nenu Movie Review And Rating Telugu - Sakshi

టైటిల్: నాతో నేను
నటీనటులు: సాయికుమార్‌, ఆదిత్యా ఓం, శ్రీనివాస్‌ సాయి, ఐశ్వర్య తదితరులు
బ్యానర్‌: శ్రీ భవ్నేష్‌ ప్రొడక్షన్స్‌
సమర్పణ: ఎల్లలుబాబు టంగుటూరి
నిర్మాత: ప్రశాంత్‌ టంగుటూరి
సినిమాటోగ్రఫీ: ఎస్‌. మురళీ మోహన్‌రెడ్డి
సంగీతం: సత్య కశ్యప్‌
ఎడిటింగ్‌: నందమూరి హరి
దర్శకత్వం: శాంతి కుమార్‌ తూర్లపాటి

డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌, రాజీవ్‌ కనకాల, ఆదిత్యా ఓం, శ్రీనివాస్‌ సాయి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నాతో నేను'. జబర్దస్త్ కమెడియన్‌, మిమిక్రీ ఆర్టిస్ట్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న శాంతి కుమార్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బుల్లితెరపై కామెడీతో అలరించిన ఈయన.. డైరెక్టర్‌గా వెండితెరపై సత్తా చాటాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం. 

కథేంటి?
ఓ గ్రామంలో కోటీశ్వరరావు(సాయికుమార్‌) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే టైంలో ఓ స్వామిజీ కోటీశ్వరరావు కష్టాన్ని తెలుసుకుని వరమిస్తాడు. మరోవైపు కోటిగాడు(సాయి శ్రీనివాస్‌), దీప (ఐశ్వర్య)తో పరిచయం, ఆపై లవ్ చేసుకుంటారు. పెద్దలు ఒప‍్పుకోకపోయేసరికి సాయికి ఐశ్వర్య హ్యాండ్‌ ఇస్తుంది. మరో స్టోరీలో ఓ మిల్లులో పనిచేసే కోటిగాడు (ఆదిత్య ఓం).. నాగలక్షీ(దీపాలి) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. 60 ఏళ్ల కోటీశ్వరరావు, 40 ఏళ్ల కోటిగాడు, 20 ఏళ్ల కోటీగాడు జీవితంలో ఏం జరిగింది? స్వామిజీ కోటీశ్వరరావుకి ఇచ్చిన వరం ఏంటనేది 'నాతో నేను' స్టోరీ.

(ఇదీ చదవండి: HER: Chapter 1 Movie Review - ‘హర్‌’ మూవీ రివ్యూ)

ఎలా ఉందంటే?
మనిషి అనే దానికంటే మనీ అనే రెండక్షరాల మీదే జీవితం నడుస్తోంది అనే స్టోరీతో తీసిన సినిమా ఇది. 20, 40, 60 ఇలా వయసు దశల వారీగా సాగిన ఈ కథలో సాయికుమార్‌, ఆదిత్యా ఓం, సాయి శ్రీనివాస్‌ పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ పాత్రలకు తగ్గట్లు ఆర్టిస్ట్‌లు నటించారు. ఆ సన్నివేశాలను దర్శకుడు నడిపించిన తీరు బాగుంది. చేసిన మంచి ఎక్కడికీ పోదనే విషయాన్ని చక్కగా చెప్పారు. 

డబ్బు మాత్రమే పరమావధిగా భావించి, దాని వెనకే జీవితం ఉందనుకుంటే చివరికి ఏమీ మిగలదు అనే చక్కని సందేశం ఈ సినిమాతో ఇచ్చారు. సాయికుమార్‌ డైలాగ్‌లు అదిరిపోయేలా ఉన్నాయి. రాజీవ్‌ కనకాల, సీవీఎల్‌ నరసింహరావు ఇతర ఆర్టిస్ట్‌లు పాత్రల మేరకు చక్కగా నటించారు. వాళ్ల పాత్రల నిడివి ఇంకాస్త ఉంటే బాగుండేది. సాయి శ్రీనివాస్‌, ఐశ్వర్య పాత్రలు యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతాయి. ఫస్టాఫ్‌లో కాస్త కత్తెర వేయాల్సింది.

సినిమాలో సెట్లు, లొకేషన్లు ఆకట్టుకున్నాయి. నిర్మాతలు కొత్తవాళ్లే అయినా ఎక్కడా కాంప్రమైజ్‌ అయినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఫైనల్‌గా దర్శకుడికి అనుభవం లేకపోవడం కాస్త మైనస్‌గా అనిపించింది. సంగీతం విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటే బావుండేది. ఓవరాల్‌గా చక్కని సందేశంతోపాటు వినోదాన్ని పంచారు. సందేశం, వినోదం కోసం ఓసారి చూడొచ్చు.

(ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ)

ఎవరెలా చేశారు?
కోటీశ్వరుడిగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాయికుమార్‌ అద్భుతంగా నటించారు. ఓ మిల్లులో పనిచేస్తూ, ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని మోసపోయిన పాత్రలో ఆదిత్య ఓం నటన బాగుంది. బ్రేకప్ అయిన కుర్రాడి పాత్రలో సాయి శ్రీనివాస్‌ బాగా నటించాడు. మొదటిసారి దర్శకత్వం వహించిన శాంతి కుమార్‌ మూడు కీలక పాత్రల నడుమ సాగే కథను బాగానే రాశారు. కానీ దాన్ని తెరపై చూపించడంలో తడబడ్డారు. మాటలు బావున్నాయి. కామెడీ, ఎమోషనల్ సీన్స్ ఆకటుకున్నాయి. రెట్రో సాంగ్‌, ఐటెమ్‌ సాంగ్‌ ఆకట్టుకున్నాయి.  

'మనిషి ఎంత డబ్బు సంపాదించిన మన అని తోడు లేకపోతే జీవితం సంతోషంగా ఉండదు అని  నిదర్శనమే నాతో నేను సినిమా సినిమాతో నిదర్శనం ఇలాంటి సినిమాలు సొసైటీ చాలా అవసరం'

(ఇదీ చదవండి: ‘డిటెక్టివ్ కార్తీక్’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement