Natho nenu
-
Natho Nenu Review: 'నాతో నేను' సినిమా రివ్యూ
టైటిల్: నాతో నేను నటీనటులు: సాయికుమార్, ఆదిత్యా ఓం, శ్రీనివాస్ సాయి, ఐశ్వర్య తదితరులు బ్యానర్: శ్రీ భవ్నేష్ ప్రొడక్షన్స్ సమర్పణ: ఎల్లలుబాబు టంగుటూరి నిర్మాత: ప్రశాంత్ టంగుటూరి సినిమాటోగ్రఫీ: ఎస్. మురళీ మోహన్‌రెడ్డి సంగీతం: సత్య కశ్యప్ ఎడిటింగ్: నందమూరి హరి దర్శకత్వం: శాంతి కుమార్ తూర్లపాటి డైలాగ్ కింగ్ సాయి కుమార్, రాజీవ్ కనకాల, ఆదిత్యా ఓం, శ్రీనివాస్ సాయి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నాతో నేను'. జబర్దస్త్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శాంతి కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బుల్లితెరపై కామెడీతో అలరించిన ఈయన.. డైరెక్టర్‌గా వెండితెరపై సత్తా చాటాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం. కథేంటి? ఓ గ్రామంలో కోటీశ్వరరావు(సాయికుమార్) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే టైంలో ఓ స్వామిజీ కోటీశ్వరరావు కష్టాన్ని తెలుసుకుని వరమిస్తాడు. మరోవైపు కోటిగాడు(సాయి శ్రీనివాస్), దీప (ఐశ్వర్య)తో పరిచయం, ఆపై లవ్ చేసుకుంటారు. పెద్దలు ఒప్పుకోకపోయేసరికి సాయికి ఐశ్వర్య హ్యాండ్ ఇస్తుంది. మరో స్టోరీలో ఓ మిల్లులో పనిచేసే కోటిగాడు (ఆదిత్య ఓం).. నాగలక్షీ(దీపాలి) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. 60 ఏళ్ల కోటీశ్వరరావు, 40 ఏళ్ల కోటిగాడు, 20 ఏళ్ల కోటీగాడు జీవితంలో ఏం జరిగింది? స్వామిజీ కోటీశ్వరరావుకి ఇచ్చిన వరం ఏంటనేది 'నాతో నేను' స్టోరీ. (ఇదీ చదవండి: HER: Chapter 1 Movie Review - ‘హర్’ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే? మనిషి అనే దానికంటే మనీ అనే రెండక్షరాల మీదే జీవితం నడుస్తోంది అనే స్టోరీతో తీసిన సినిమా ఇది. 20, 40, 60 ఇలా వయసు దశల వారీగా సాగిన ఈ కథలో సాయికుమార్, ఆదిత్యా ఓం, సాయి శ్రీనివాస్ పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ పాత్రలకు తగ్గట్లు ఆర్టిస్ట్‌లు నటించారు. ఆ సన్నివేశాలను దర్శకుడు నడిపించిన తీరు బాగుంది. చేసిన మంచి ఎక్కడికీ పోదనే విషయాన్ని చక్కగా చెప్పారు. డబ్బు మాత్రమే పరమావధిగా భావించి, దాని వెనకే జీవితం ఉందనుకుంటే చివరికి ఏమీ మిగలదు అనే చక్కని సందేశం ఈ సినిమాతో ఇచ్చారు. సాయికుమార్ డైలాగ్‌లు అదిరిపోయేలా ఉన్నాయి. రాజీవ్ కనకాల, సీవీఎల్ నరసింహరావు ఇతర ఆర్టిస్ట్‌లు పాత్రల మేరకు చక్కగా నటించారు. వాళ్ల పాత్రల నిడివి ఇంకాస్త ఉంటే బాగుండేది. సాయి శ్రీనివాస్, ఐశ్వర్య పాత్రలు యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్టాఫ్‌లో కాస్త కత్తెర వేయాల్సింది. సినిమాలో సెట్లు, లొకేషన్లు ఆకట్టుకున్నాయి. నిర్మాతలు కొత్తవాళ్లే అయినా ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఫైనల్‌గా దర్శకుడికి అనుభవం లేకపోవడం కాస్త మైనస్‌గా అనిపించింది. సంగీతం విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటే బావుండేది. ఓవరాల్‌గా చక్కని సందేశంతోపాటు వినోదాన్ని పంచారు. సందేశం, వినోదం కోసం ఓసారి చూడొచ్చు. (ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ) ఎవరెలా చేశారు? కోటీశ్వరుడిగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. ఓ మిల్లులో పనిచేస్తూ, ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని మోసపోయిన పాత్రలో ఆదిత్య ఓం నటన బాగుంది. బ్రేకప్ అయిన కుర్రాడి పాత్రలో సాయి శ్రీనివాస్ బాగా నటించాడు. మొదటిసారి దర్శకత్వం వహించిన శాంతి కుమార్ మూడు కీలక పాత్రల నడుమ సాగే కథను బాగానే రాశారు. కానీ దాన్ని తెరపై చూపించడంలో తడబడ్డారు. మాటలు బావున్నాయి. కామెడీ, ఎమోషనల్ సీన్స్ ఆకటుకున్నాయి. రెట్రో సాంగ్, ఐటెమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. 'మనిషి ఎంత డబ్బు సంపాదించిన మన అని తోడు లేకపోతే జీవితం సంతోషంగా ఉండదు అని నిదర్శనమే నాతో నేను సినిమా సినిమాతో నిదర్శనం ఇలాంటి సినిమాలు సొసైటీ చాలా అవసరం' (ఇదీ చదవండి: ‘డిటెక్టివ్ కార్తీక్’ మూవీ రివ్యూ) -
'నాతో నేను' ట్రైలర్ లాంచ్ చేసిన దిల్‌రాజు
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి ('జబర్దస్త్' ఫేమ్) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం 'నాతో నేను'. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు శ్రోతలను అలరిస్తున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. (ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'సలార్' మరో రికార్డ్) ట్రైలర్ రిలీజ్ తర్వాత మాట్లాడిన దిల్‌రాజు.. ''నాతో నేను' ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్లో ట్రయాంగిల్ ఎమోషన్స్ చూపించారు. చాలా బావుంది. సాయికుమార్ నటన గురించి అందరికీ తెలిసిందే. ఆయనతోపాటు ఆర్టిస్టులు అద్భుతంగా నటించారు. టీమ్‌కి ఆల్ ద బెస్ట్' అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ 'జబర్దస్త్ కమెడియన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. ప్రేమ, భావోద్వేగం అన్ని ఉన్న చిత్రమిది' అని అన్నారు. (ఇదీ చదవండి: 'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?) -
‘రాజంపేట రాణి'పాట బాగుంది: శేఖర్ మాస్టర్
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ విడుదల చేసారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. శాంతి స్వరూప్ సాహిత్యం అందించిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్‌గా శాంతి కుమార్ అందిరికీ పరిచయమే. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి సినివుమా దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రంలోని ‘రాజంపేట రాణిని’ అంటూ సాగే మాస్ బీట్ పాటను చూశా. సంగీతం, కొరియోగ్రఫీ చాలా బావుంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. జబర్దస్త్ నుంచి వెళ్లిన వేణు ‘బలగం’ చిత్రంతో పెద్ద పేరు తెచ్చుకున్నాడు శాంతి కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ ‘జబర్దస్త్ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు , పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. శేఖర్ మాస్టర్ ఈ మాస్ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. -
‘నాతో నేను’ టీజర్ బాగుంది: రాజ్ కందుకూరి
సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాతో నేను’. జబర్దస్ట్ ఫేం శాంతి కుమార్ తూర్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ టంగుటూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘టీజర్‌గా సినిమా పాయింట్ నచ్చింది. కొత్తగా అనిపించింది. ఈ మధ్యకాలంలో కొత్త లైన్, కొత్త టీమ్ చేసే ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది. కథలో కొత్తదనం ఉంది, చక్కని కథనం, సస్పెన్స్ క్యారీ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. టీమ్‌కు అభినందనలు అని అన్నారు. ‘జబర్దస్త్ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం’అని శాంతికుమార్ అని అన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’అని నిర్మాత చెప్పారు. -
‘నాతో నేను’ టైటిల్ బాగుంది: విజయేంద్రప్రసాద్
సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్ ఇటీవల ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. ‘టైటిల్ బాగుంది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’ అని అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ ‘మంచి కథతో శాంతికుమార్ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్‌గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’అని అన్నారు. దర్శకుడు శాంతికుమార్ మాట్లాడుతూ ‘ఓ మంచి కథ రాసి మొదటి నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ నచ్చి వెంటనే అంగీకరించారు. నా తొలి ప్రయత్నానికి సాయికుమార్ గారు అండగా ఉన్నారు. చక్కని సలహా సూచనలు అందిస్తున్నారు. మంచి కథ రాశాను.. దానిని చక్కగా తెరపై చూపిస్తానని, ఆ దిశగా కృషి చేస్తానని చెబుతున్నాను’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘దర్శకుడు చెప్పిన కథనచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. బిజీగా ఉండి కూడా మా ఆహ్వానం మేరకు విచ్చేసిన విజయేంద్రప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులకు మంచి సినిమా చూపించబోతున్నాం’ అని అన్నారు. -
ఒకటే పాత్రతో ఆరు భాషల్లో సినిమా
‘‘ఇప్పటివరకు నేను ఎక్కువ కష్టపడి చేసిన చిత్రం ఇదే. ఆరు భాషల్లో రూపొందించడం వల్ల ఒక్కో సన్నివేశాన్ని ఆరుసార్లు చిత్రీకరించాం’’ అన్నారు ఆకాష్. వారియర్స్ క్లాన్ పిక్చర్స్ పతాకంపై రాహుల్‌సింగ్ ఖగ్వాల్ దర్శకత్వంలో ఏక పాత్రతో రూపొందిన చిత్రం ‘నాతో నేను’. ఏకైక పాత్రను ఆకాష్ పోషించగా, నేహా త్యాగి ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరభద్రమ్, ఈశ్వర్‌రెడ్డి, బెక్కెం వేణుగోపాల్, బసిరెడ్డి, గణేష్ దొండి తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏకకాలంలో ఆరు భాషల్లో ఒక చిత్రాన్ని రూపొందించిన ఘనత మాకే దక్కుతుంది. ఒకే లొకేషన్లో ఈ చిత్రాన్ని రూపొందించడం ఓ విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కె. ఎన్.సెబాస్టియన్, మాటలు: సిద్దార్ధ్ ఇంజేటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మయాంక్ గుప్తా.