‘నాతో నేను’ టీజర్‌ బాగుంది: రాజ్‌ కందుకూరి | Natho Nenu Movie Teaser Launched By Raj Kandukuri | Sakshi
Sakshi News home page

‘నాతో నేను’ టీజర్‌ బాగుంది: రాజ్‌ కందుకూరి

Published Fri, Jun 16 2023 3:07 PM | Last Updated on Fri, Jun 16 2023 3:07 PM

Natho Nenu Movie Teaser Launched By Raj Kandukuri - Sakshi

సాయికుమార్‌, శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్‌, ఐశ్వర్య రాజీవ్‌ కనకాల కీలక పాత్రధారులుగా  నటిస్తున్న తాజా చిత్రం ‘నాతో నేను’. జబర్దస్ట్‌ ఫేం శాంతి కుమార్‌ తూర్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ టంగుటూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..‘టీజర్‌గా సినిమా పాయింట్‌ నచ్చింది. కొత్తగా అనిపించింది. ఈ మధ్యకాలంలో కొత్త లైన్‌, కొత్త టీమ్‌ చేసే ప్రతి సినిమా సక్సెస్‌ అవుతుంది. కథలో కొత్తదనం ఉంది, చక్కని కథనం, సస్పెన్స్‌ క్యారీ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. టీమ్‌కు అభినందనలు అని అన్నారు. 

‘జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం’అని శాంతికుమార్‌  అని అన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’అని నిర్మాత చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement