Producer Dil Raju Released the Trailer of Natho Nenu Movie - Sakshi
Sakshi News home page

Natho Nenu Trailer: ఆసక్తికరంగా 'నాతో నేను' ట్రైలర్

Published Mon, Jul 17 2023 7:58 PM | Last Updated on Mon, Jul 17 2023 8:24 PM

Natho Nenu Movie Trailer Telugu - Sakshi

సాయికుమార్‌, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ సాయి, దీపాలి రాజపుత్‌ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి ('జబర్దస్త్' ఫేమ్) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం 'నాతో నేను'. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు శ్రోతలను అలరిస్తున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర నిర్మాత దిల్‌ రాజు విడుదల చేశారు. 

(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'సలార్' మరో రికార్డ్)

ట్రైలర్ రిలీజ్ తర్వాత మాట్లాడిన దిల్‌రాజు.. ''నాతో నేను' ట్రైలర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్‌లో ట్రయాంగిల్‌ ఎమోషన్స్‌ చూపించారు. చాలా బావుంది. సాయికుమార్‌ నటన గురించి అందరికీ తెలిసిందే. ఆయనతోపాటు ఆర్టిస్టులు అద్భుతంగా నటించారు. టీమ్‌కి ఆల్‌ ద బెస్ట్‌' అని అన్నారు. 

శాంతికుమార్‌ మాట్లాడుతూ 'జబర్దస్త్‌ కమెడియన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు, పాటలు  నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. ప్రేమ, భావోద్వేగం అన్ని ఉన్న చిత్రమిది' అని అన్నారు. 

(ఇదీ చదవండి: 'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement