వెండితెరపై పర్వీన్ జీవితం? | Parveen life on the silver screen? | Sakshi
Sakshi News home page

వెండితెరపై పర్వీన్ జీవితం?

Published Sat, Apr 12 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

వెండితెరపై  పర్వీన్ జీవితం?

వెండితెరపై పర్వీన్ జీవితం?

సినిమా తారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా వెండితెరపై ఓ స్థాయిలో విజృంభించిన పర్వీన్ బాబీ లాంటి తారల గురించి తెలుసుకోవాలను కుంటున్నారు.

నటిగా మంచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్న పర్వీన్ నిజజీవితంలో మాత్రం చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆ సంఘటనల సమాహారంగా హిందీ, బెంగాలీ భాషల్లో ఓ సినిమా రూపొందించనున్నారు దర్శకుడు అగ్నిదేవ్ చటర్జీ.
 
 ఈ సినిమాకి ‘డిస్టర్బ్‌డ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీ రూపంలో ప్రియాంక చోప్రాను నాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. బెంగాలీ చిత్రానికి ఇంకా నాయికను ఖరారు చేయలేదని సమాచారం. వచ్చే నెలలో కానీ, కుదరకపోతే జూన్‌లో కానీ ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.ఇందులో తనతనయుడు ఆకాశ్‌ని హీరోగా నటింపజేయాలనుకుంటు న్నారట దర్శకుడు అగ్నిదేవ్ చటర్జీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement