Disturbed
-
వైరల్ వీడియో: రోడ్డుపై వెళ్తున్న అందర్నీ పలకరిస్తున్న పిల్లి
-
నాగాలకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: అమాయక కూలీలపై ఆర్మీ కాల్పులతో రగిలిపోతున్న నాగాలాండ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గురువారం షాకిచ్చింది. సైనిక బలగాలకు విస్తృత అధికారాలు, శిక్ష భీతిని లేకుండా చేస్తున్న ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) నాగాలాండ్‌లో మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. నాగాలాండ్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తూ... అక్కడ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలిచేందుకు సాయుధ బలగాల మొహరింపు తప్పనిసరని తెలిపింది. అందువల్ల ఏఎఫ్ఎస్పీఏ–1958 సెక్షన్ 3 కింద నాగాలాండ్ రాష్ట్రం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి ఆరునెలల పాటు ఏఎఫ్ఎస్పీఏ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. చొరబాటుదారులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 3వ తేదీన ఆర్మీ నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామ పరిసరాల్లో నిఘా పెట్టింది. పనులు ముగించుకొని ఒక ఓపెన్ జీపులో వస్తున్న బొగ్గుగని కార్మికులపైకి వారెవరనేది ధ్రువీకరించుకోకుండానే సైనికులు కాల్పు లు జరపడంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సైనికులపై దాడి చేయగా.. ఒక జవాను మరణించారు. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో ఆర్మీ మళ్లీ కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సైన్యానికి విస్తృత అధికారాలు కట్టబెడుతున్న ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రిఫియూతో పాటు నాగాలాండ్‌లోని అన్ని రాజకీయపక్షాలూ, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటులో ఈ ఘటనను లేవనెత్తిన విపక్షాలు ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని గట్టిగా కోరాయి. కమిటీ వేసి... అంతలోనే 1958లో ఏఎఫ్ఎస్పీఏను తెచ్చారు. అప్పటినుంచీ నాగాలాండ్‌లో ఇది అమలవుతోంది. ఆరునెలలకు ఒకసారి పొడిగిస్తూ పోతున్నారు. ఓటింగ్ ఘటన తర్వాత నాగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీన్ని గమనించిన నాగాలాండ్ ప్రభుత్వం డిసెంబరు 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి... ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలనే తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏఎఫ్ఎస్పీఏ ఉపసంహరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం నాలుగురోజులు తిరగకముందే... దీన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఆమోదయోగ్యం కాదు: కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని నాగా గిరిజన సంఘాలు తేల్చిచెప్పాయి. కొన్నితరాల పాటు నాగాలను అణచివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర సర్కారు ఏఎఫ్ఎస్సీఏను పొడిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశా యి. ‘నాగా ప్రజల ఆకాంక్షలను కేంద్రం పట్టించుకోలేదు. చట్టం ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఎంతదూరమైనా వెళతాం’ అని నాగా హోహో సంస్థ ప్రధాన కార్యదర్శి కె. ఎలు ఎన్ డాంగ్ స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయంపై చర్చించడానికి జనవరి 7న సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఈఎన్‌పీవో అధ్యక్షుడు ఆర్.టి.సంగ్టామ్ తెలిపారు. -
అఖిలేష్ వ్యాఖ్యలు సరైనవి కావు
-
గాడి తప్పిన ఇంటర్ విద్య
అధ్యాపకుల కొరత రెన్యూవల్‌కు నోచుకోని కాంట్రాక్ట్ లెక్చరర్లు అతిథి అధ్యాపకులను తీసుకోనేందుకు ప్రభుత్వం ససేమిరా అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ విద్య గాడి తప్పుతోంది. అనేక కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. వారి స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెల్లవుతున్నా వారి పోస్టులను రెన్యూవల్ చేయలేదు. మరోవైపు అతిథి అధ్యాపకులను తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. పోస్టులు 652.. పని చేస్తోంది 156 మంది జిల్లాలో 39 జనరల్, రెండు ఒకేషనల్ కలిపి మొత్తం 41 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 26,710 మంది విద్యార్థులు మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మొత్తం 652 అధ్యాపక పోస్టులున్నాయి. వీటిల్లో కేవలం 156 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. ఉదాహరణకు శింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈ విద్యా సంవత్సరం కొత్తగా సైన్స్ గ్రూపులు మంజూరయ్యాయి. ఎంపీసీలో 10 మంది, బైపీసీలో 18 మంది విద్యార్థులు చేరారు. అయితే బోధించే అధ్యాపకులు లేరు. గణితం, ఫిజిక్స్, బొటనీ, కెమిస్ట్రీ, జువాలజీ అన్ని సబ్జెక్టులకు గాను ఒక్క పోస్టూ మంజూరు చేయలేదు. ఏదో ప్రిన్సిపల్ చొరవతో వీలున్నప్పుడు ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు (గెస్ట్ ఫ్యాకల్టీ) వచ్చి బోధిస్తున్నారు. అతిథి అధ్యాపకులుగా తమను తీసుకుంటారనే నమ్మకంతో అప్పుడప్పుడు వచ్చి చెబుతున్నారు. అనంతపురం నగరంలోని పాతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితం అధ్యాపకుడి పోస్టు ఖాళీగా ఉంది. -
జరిమానా విధించారని ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం
బలపాల(కురవి) : పంచాయతీ నిర్వహించిన పెద్దమనుషులు జరిమానా విధించారని మనస్తాపానికి గురైన ఓ ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని బలపాల గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితుడి భార్య నర్మద కథనం ప్రకారం.. బలపాలలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఇరిగాల రాంమూర్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న అదే గ్రామానికి చెందిన కుక్కల వెంకన్న మానుకోటలో సిమెంట్ బస్తాలు కొనుగోలు చేసి రాంమూర్తి ఆటోలో వేసుకొని బయల్దేరాడు. బలపాలకు వస్తున్న క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో వెంకన్న కాలు విరిగింది. వెంటనే రాంమూర్తి హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించాడు. చికిత్స కోసం రూ.3 వేలు ఖర్చు చేశాడు. అయితే ఆస్పత్రి ఖర్చులు ఎక్కువ కావడంతో వెంకన్న పెద్ద మనుషులను ఆశ్రయించాడు. దీంతో పెద్దమనుషులు మంగళవారం గ్రామంలో కూర్చొని పంచాయతీ నిర్వహించారు. రూ.లక్ష పూచికత్తు పెట్టి పంచాయతీ చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే అంత మొత్తం డబ్బు లేకపోవడంతో రాంమూర్తి డిపాజిట్ పెట్టలేదు. డిపాజిట్ లేకుండా పంచాయతీ చేసిన పెద్దలు రాంమూర్తికి రూ.40 వేల జరిమానా విధించారు. ఇందులో ముందుగా రూ.10వేలు చెల్లించాలని నిర్ణయించారు. దీంతో ఇంట్లోకి వెళ్లిన రాంమూర్తి పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఇటీవల టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరకపోవడంతోనే కక్ష గట్టిన పెద్దలు భారీ మెుత్తంలో జరిమానా విధించారని బాధితుడి భార్య నర్మద రోదిస్తూ తెలిపారు. -
వెండితెరపై పర్వీన్ జీవితం?
సినిమా తారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా వెండితెరపై ఓ స్థాయిలో విజృంభించిన పర్వీన్ బాబీ లాంటి తారల గురించి తెలుసుకోవాలను కుంటున్నారు. నటిగా మంచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్న పర్వీన్ నిజజీవితంలో మాత్రం చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆ సంఘటనల సమాహారంగా హిందీ, బెంగాలీ భాషల్లో ఓ సినిమా రూపొందించనున్నారు దర్శకుడు అగ్నిదేవ్ చటర్జీ. ఈ సినిమాకి ‘డిస్టర్బ్డ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీ రూపంలో ప్రియాంక చోప్రాను నాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. బెంగాలీ చిత్రానికి ఇంకా నాయికను ఖరారు చేయలేదని సమాచారం. వచ్చే నెలలో కానీ, కుదరకపోతే జూన్‌లో కానీ ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.ఇందులో తనతనయుడు ఆకాశ్‌ని హీరోగా నటింపజేయాలనుకుంటు న్నారట దర్శకుడు అగ్నిదేవ్ చటర్జీ.