ప్రముఖ దేశీయ ఎడ్‌టెక్ అన్ అకాడమీలో ఉద్యోగుల తొలగింపు దశల వారీగా కొనసాగుతుంది. ఇప్పటికే పలు దశల్లో వందల మంది ఉద్యోగులు బయటకు పంపించగా.. తాజాగా పేలవ ప్రదర్శనపై గుర్రుగా ఉన్న అన్ అకాడమీ యాజమాన్యం మరో 150మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది.
అన్ అకాడమీ దేశంలో బైజూస్ తర్వాత సెకెండ్ మోస్ట్ వ్యాల్యూడ్ ఎడ్ టెక్ కంపెనీగా అవతరించింది. ముఖ్యంగా కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణతో ఎడ్‌టెక్ రంగంలో అత్యద్భుత ప్రదర్శనను కనబరిచింది. దీంతో ఆ సంస్థలో సాఫ్ట్ బ్యాంక్‌తో పాటు ఫేస్‌బుక్, టైగర్ గ్లోబల్, టెమాసెక్ హోల్డింగ్స్, సాఫ్ట్‌బ్యాంక్, బ్లూమ్ వెంచర్స్, సీక్వోయా, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్, ఎలివేషన్ క్యాపిటల్‌లు 800 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ పెట్టుబడులతో అన్ అకాడమీని వృద్ది చేయడంతో పాటు ఇతర స్టార్టప్ కొనుగోళ్లుపై ఆ సంస్థ ప్రతినిధులు దృష్టి సారించారు. ఈ తరుణంలో 2020 జులై నెలలో 50 మిలియన్ డాలర్లకు మరో ఎడ్యుకేషన్ సంస్థ ప్రాప్ లీడర్‌ను సొంతం చేసుకుంది.
ప్రాప్ లీడర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలన్నీ అన్ అకాడమీ నిర్వహించేది.అయితే కోవిడ్ తెచ్చిన ఎడ్యుకేషన్ సంక్షోభంతో ఆఫ్‌లైన్ క్లాసులు కనుమరుగయ్యాయి. ఆన్ లైన్ క్లాసులకు డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్‌లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అన్ అకాడమీకి గట్టి పోటీ ఇచ్చాయి.
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు
పోటీని తట్టుకుంటూ మార్కెట్‌లో కాంపిటీటర్‌లకు చెక్ పెట్టేందుకు అన్‌అకాడమీ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో విపరీతమైన నిధుల కొరత ఏర్పడించింది. 2020లో అన్ అకడామీ కంపెనీ నిర్వహణ కోసం రూ.452కోట్లు ఖర్చు చేయగా రూ.464 కోట్లు లాభాల్ని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2021లో మాత్రం భారీగా నష్టపోయింది. 6 రెట్లు పెరిగి రూ.1537కోట్లు నష్టపోయింది. ఖర్చులు సైతం రూ.2వేల కోట్లగా పెరిగాయి.
దీంతో ఖర్చు తగ్గించేందుకు పలు దశల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇలా ఏప్రిల్ నెలలో 1000మందిని, మేలో 150 మందిని, జూన్‌లో తాజాగా ప్రాప్ లీడర్‌లో అడ్వటైజింగ్, మార్కెటింగ్ కాస్ట్ తగ్గించుకునేందుకు 150మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్ పెట్టింది.ఆ మెయిల్స్‌పై అన్ అకాడమీ యాజమాన్యం స్పందించింది. పనితీరును బట‍్టి ఉద్యోగులుపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇది ఏ సంస్థలోనైనా సర్వ సాధారణమని సంస్థపై వస్తున్న ఆరోపణల్ని కొట్టి పారేసే ప్రయత్నం చేసింది.
చదవండి👉చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్‌అకాడమీ!
Comments
Please login to add a commentAdd a comment