Unacademy
-
'అన్అకాడమీ'లో అసలేం జరుగుతోంది?
బెంగళూరు: సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న ఎడ్టెక్ సంస్థ 'అన్అకాడమీ'లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సుబ్రమణియన్ రామచంద్రన్ తన పదవికి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం అన్అకాడమీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) వివేక సిన్హా సంస్థ నుంచి వైదొలిగారు. తాజాగా, రామచంద్రన్ సైతం కంపెనీని విడిచి పెట్టి వెళ్లడం ఎడ్టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. అయితే, సీఎఫ్‌వో ఎందుకు రాజీనామా చేశారు? రెండు నెలల క్రితం అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ చేసిన వ్యాఖ్యలకు.. వరుస రిజిగ్నేషన్లకు ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో అన్‌అకాడమీని బ్యాన్చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై క్లాస్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పేరు మార్పు వల్ల ఒరిగేదేమీ లేదని.. ఉన్న చట్టాలను పేర్లు మార్చి తీసుకురావడం వల్ల ఉపయెగం లేదన్నాడు కరణ్. పైగా ‘ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఓటు వేసేటప్పుడు, చదువుకున్న అభ్యర్థిని ఎన్నుకోండి.. అప్పుడు మీరు జీవితంలో మళ్లీ ఇలాంటి బాధలు పడకుండా ఉంటారు.. పేర్లు మార్చడం మాత్రమే తెలిసిన వారికి ఓటు వేయకండి,’ అని చెప్పడం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది We are an education platform that is deeply committed to imparting quality education. To do this we have in place a strict Code of Conduct for all our educators with the intention of ensuring that our learners have access to unbiased knowledge. Our learners are at the centre of… — Roman Saini (@RomanSaini) August 17, 2023 దీనికి కారణమైన కరణ్‌ను అన్అకాడమీ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ విధుల నుంచి తొలగించారు. ‘క్లాసు రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక కాదని.. టీచర్(కరణ్) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని’ పోస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాతే అన్అకాడమీ నుంచి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)సుబ్రమణియన్ రామచంద్రన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) వివేక సిన్హాలు బయటకు వచ్చారు. చదవండి👉 చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్అకాడమీ! -
చదువురానివారు నాయకులైతే దేశం బాగుపడదు.. అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అనకాడమీ సంస్థకు చెందిన ఒక లెక్చరర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన విద్యార్థులతో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికి ఓటు వేయమని అభ్యర్ధించాడు. దీంతో ఆ సంస్థ క్లాస్రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే వేదిక కాదని చెబుతూ అతడిపై వేటు వేసింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ లెక్చరర్ చెప్పిన దాంట్లో తప్పేముందన్నారు. కరణ్ సంగ్వాన్ అనకాడమీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ ద్వారా ఆయన తన విద్యార్థులకు ఎన్నికల్లో విద్యావంతులైన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని ఓ వీడియోలో కోరారు. దీంతో ఆగ్రహించిన ఆ సంస్థ సహ యజమాని రోమన్ సైనీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటిస్తూ X వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై సంగ్వాన్ స్పందిస్తూ.. గత కొద్ది రోజులుగా నాకు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదంగా మారింది. నా తోపాటు జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధపడుతున్న నా విద్యార్థులు కూడా ఆ వీడియో వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న దానిపై వివరణ ఇస్తానని వెల్లడించారు. సంస్థ సహ యజమాని రోమా సైనీ X వేదికగా ఏమని రాశారంటే.. మా సంస్థకు చాలా కచ్చితమైన నియమ నిబంధనలున్నాయి. విద్యార్ధులకు నిశ్పాక్షిక జ్ఞానాన్ని అందించడమే మా కర్తవ్యం. క్లాస్రూమ్ అనేది వ్యక్తిగత అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే వేదిక కాదు. అవి విద్యార్ధులపై తప్పుడు ప్రభావం చూపుతాయి. సంస్థ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారం సంగ్వాన్ ను విధుల నుండి తొలగించామని తెలియజేశారు. ఈ ఉదంతంపై సాక్షాత్తు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ.. చదువుకున్న వ్యక్తికి ఓటు వేయమని అడగడం కూడా తప్పేనా? ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదు. ఇసి సైన్స్ అండ్ టెక్నాలజీ దూసుకెళ్తోన్న తరం. చదువురాని వారి ఆధునిక భారత దేశాన్ని నిర్మించలేరని అన్నారు. क्या पढ़े लिखे लोगों को वोट देने की अपील करना अपराध है? यदि कोई अनपढ़ है, व्यक्तिगत तौर पर मैं उसका सम्मान करता हूँ। लेकिन जनप्रतिनिधि अनपढ़ नहीं हो सकते। ये साइंस और टेक्नोलॉजी का ज़माना है। 21वीं सदी के आधुनिक भारत का निर्माण अनपढ़ जनप्रतिनिधि कभी नहीं कर सकते। https://t.co/YPX4OCoRoZ — Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2023 ఇది కూడా చదవండి: నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ -
డాక్టర్ కాబోయి అసిస్టెంట్ కలెక్టర్.. అదీ తొలి ప్రయత్నంలోనే!
కష్టపడి చదివి ఒక ఉన్నతమైన ఉద్యోగం చేయాలన్నది చాలామంది కల. ఐఏఎస్ చదవాలనుకున్న వారు దాన్ని సాధించి అక్కడితో ఆగిపోతారు. ఒక డాక్టర్ కావాలనుకున్న వారు డాక్టర్ అయితే చాలని అనుకుంటారు. అయితే ఈ కథనంలో మనం చెప్పుకోబోయే వ్యక్తి ఐఏఎస్తోనో.. డాక్టర్తోనో ఆగిపోలేదు. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతడు ఏమి సాధించాడు. ఎలా సాధించాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తొలి ప్రయత్నంలోనే.. మనం చెప్పుకోబోయే వ్యక్తి జైపూర్ ప్రాంతానికి చెందిన 'రోమన్ సైనీ' (Roman Saini). నిజానికి ఇతని కుటుంబంలో 12 మంది డాక్టర్లు ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని చిన్నప్పటి నుంచే తానూ డాక్టర్ అవ్వాలని భారతదేశంలో అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మొదటి ప్రయత్నంలోనే అర్హత సాధించించాడు. అప్పటికి అతని వయసు కేవలం 16 సంవత్సరాలు కావడం గమనార్హం. దీంతో భారతదేశంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణుడైన అతి చిన్న వయస్కుడిగా రికార్డ్ సాధించాడు. ఐఏఎస్.. అయితే సమాజ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఐఏఎస్ చదవాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యంగా ఇందులోనూ మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించేశాడు. యుపిఎస్‌సిలో శిక్షణ పూర్తయిన తరువాత మధ్యప్రదేశ్ క్యాడర్లో జబల్పూర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. విధి నిర్వహణలో భాగంగానే ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ.. సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా యువత ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసాడు. మధ్యప్రదేశ్ ప్రాంతంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఎందుకంటే అక్కడి వారికి ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన తక్కువ, అంతే కాకుండా వారికి సరైన మార్గ నిర్దేశం చేసేవారు లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా భావించాడు. కోచింగ్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న చాలా మందిని చూసి చలించి పోయాడు. అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా.. మధ్యప్రదేశ్ ప్రాంతంలోని యువతను చూసి చలించిపోయిన రోమన్ సైనీ మెరుగైన విద్య అందించాలని, ఉద్యోగావకాశాల కోసం సరైన మార్గ నిర్దేశం చేయాలనీ భావించి తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. యువతను సరైన మార్గంలో పయనించేలా చేయడానికి ఆన్లైన్ కోచింగ్ సరైన మార్గం అని భావించి.. తన స్నేహితులు గౌరవ్ ముంజల్, హేమేష్ సింగ్‌తో కలిసి 'అన్అకాడమీ' (Unacademy) పేరుతో ఆన్లైన్ ట్యుటోరియల్ ప్రారంభించాడు. అన్అకాడమీ ప్రారంభం.. సైనీ ప్రారంభించిన ఈ అన్అకాడమీ ప్రచారానికి యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను ఉపయోగించుకున్నాడు. ఇందులో సివిల్స్, స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC), ఐబీపీఎస్ (IBPS) ఉద్యోగ నియామకాలకు కావాల్సిన అన్ని మెటీరియల్స్, టీచింగ్ వంటివి మొత్తం అందించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ అకాడమీ ద్వారా సుమారు మూడు లక్షల మందికి పైగా కోచింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం అన్అకాడమీ అనేది 20 వేల మందికి పైగా బోధనా సిబ్బందిని కలిగి ఉంది. తక్కువ ఖర్చుతో అనుకున్నది సాధించాలనుకునే వారికి ఈ అకాడమీ ఒక వరం అనే చెప్పాలి. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి యువతకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్న రోమన్ సైనికి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఫిదా అయిపోయారు. ఈ అకాడమీ ద్వారా గొప్ప స్థాయికి చేరుకున్న వారు కూడా స్వచ్చందంగా సేవలందిస్తున్నారు. రోమన్ సైనీ ఒక గిటార్ ప్లేయర్ కూడా. ఇతడు పాటలు కూడా పాడతాడు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) నిజానికి రోమన్ సైనీ అనుకుని ఉండే ఇంకా గొప్ప స్థాయికి చేరుకుని ఉండేవాడు. కానీ సమాజం బాగుండాలంటే ఒక వ్యక్తి మాత్రమే అభివృద్ధి చెందితే సరిపోదు.. తన చుట్టూ ఉన్నవారు కూడా తప్పకుండా ఎదగాలి అనే ఆలోచనతో ఐఏఎస్ సైతం వదులుకున్నాడంటే అతని సేవాదృక్పధం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఈ రోజు అన్అకాడమీ అనేది రూ. 2,600 కోట్ల సంస్థగా అవతరించింది. ఈ ఘనత మొత్తం మాజీ ఐఏఎస్ అధికారి రోమన్ సైనీకే చెందుతుంది. -
ఫ్రెండ్ యూట్యూబ్ ఛానెల్‌ని రూ. 26వేల కోట్ల కంపెనీగా మార్చాడు, షాకింగ్ శాలరీ!
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎడ్-టెక్ కంపెనీలలో ఒకటి అన్‌ఎకాడెమీ. స్థాపించిన అయిదేళ్లలోనే అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా అన్‌ఎకాడెమీ సక్సెస్‌లో కోఫౌండర్‌గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా హేమేష్ సింగ్ పాత్ర చాలా కీలకం. ఆ వివరాలేంటో చూద్దాం..! ఇంజనీర్‌గా ఉండి వ్యాపారవేత్తగా మారిన గౌరవ్ ముంజాల్ యూట్యూబ్ చానల్లే తరువాతి కాలంలో అన్ఎకాడెమీగా ఆవిర్భవించింది. 26 వేల కోట్ల రూపాయల కంపెనీగా ఈ యూట్యూబ్ చానల్లే పునాది వేసింది. ముఖ్యంగా ముంజాల్, స్నేహితుడు రోమన్ సైనీ, హేమేష్ సింగ్ త్రయం కలిసి అన్కాడెమీని విజయవంతమైన వ్యాపార సంస్థగా తీర్చిదిద్దారు. (అదరగొట్టిన టీసీఎస్: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిట్కాలివిగో!) గౌరవ్ ముంజాల్ ప్రేరణతో ఇంజనీర్ అయిన హేమేష్ సింగ్ కూడా ముంజాల్ యూట్యూబ్‌లో చానల్లో చేరారు. అనంతరం అన్‌ఎకాడెమీ సహ వ్యవస్థాపకుడుగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కంపెనీ ముందుకునడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అన్ఎకాడెమీలో చేరడానికి ముందు ఫ్లాట్చాట్ సీటీవోగా పనిచేశారు. 2015లో ఫ్లాట్చాట్ను విడిచి పెట్టిన తర్వాత, హేమేష్ సింగ్ ,రమణ్ సైనీ, గౌరవ్ ముంజాల్‌తో కలిసి అన్ఎకాడెమీని స్థాపించారు. ఇక అంతే అప్పటినుంచి కంపెనీ శరవేగంగా డెవలప్ అయింది. 🎉 1/ You asked, and we delivered!@CohesiveAI pricing is finally here. Our focus is to help you choose the perfect plan that suits all your needs.✨ pic.twitter.com/ygxNrHdEYz — hemesh singh (@hemezh) April 18, 2023 అదిరిపోయే వేతనం 2022లో గౌరవ్ ముంజాల్ రూ. అన్‌ఎకాడెమీ సీఈఓగా రూ. 1.58 కోట్లు తీసుకోగా, హేమేష్ సింగ్ రూ. 1.19 కోట్లు, రోమన్ సైనీ రూ. 88 లక్షలు వార్షిక వేతనం అందుకున్నారు. అన్‌ఎకాడెమీ 2020లో యునికార్న్ క్లబ్లో చేరింది, ప్రస్తుతం దీని విలువ 3.4 బిలియన్లు డాలర్లు. కాగా హేమేష్ సింగ్ మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో నివసిస్తున్నారు. (యానివర్సరీ సేల్, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు) కాగా యూట్యూబ్ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌గా గౌరవ్ ముంజాల్ 2010లో అన్ఎకాడెమీని స్టార్ట్ చేశారు. ఆ తరువాత హేమేష్, రమణ కోఫౌండర్స్గా 2015లో అధికారికంగా కంపెనీ లాంచ్ అయింది. యూట్యూబ్ ద్వారా యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే వేలాది ఏఐఎస్ అభ్యర్థులకు అన్‌ఎకాడెమీ కోచింగ్ ఇస్తుంది. విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు చేయనవసరం లేని యుపిఎస్సి కోచింగ్‌కు వేదికను అందించాలనే లక్క్ష్యంతోనే ఆవిర్భవించింది అన్‌ఎకాడెమీ. కేవలం ఆరేళ్లలో, అన్ఎకాడెమీలో టీచర్స్ సంఖ్య 18వేలకు చేరింది. (ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్?) (ఒకపుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్: కండోమ్ బిజినెస్‌తో రూ. 43వేల కోట్లు!) -
అన్ఎకాడమీ ఫౌండర్స్ సంచలన నిర్ణయం
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల దగ్గర్నించి, దిగ్గజ కంపెనీలుగా దాకా ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతకు నిర్ణయిస్తున్నాయి. ఇందులో ఎడ్యుటెక్ యూనికార్న్ అన్‌ఎకాడెమీ కూడా మినహాయింపేమీ కాదు. అయితే తాజాగా అన్‌ఎకాడెమీ ఫౌండర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ వరకూ తమ వేతానల్లో కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో గౌరవ్ ముంజాల్ ప్రకటించారు. తొలగింపులను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. (మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్) వ్యవస్థాపకులతో సహా టాప్ లీడర్షిప్ జీతాల్లో ఈ కోత ఉండనుంది. తాల్లో కోత 25 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఈ తగ్గింపు వారి ప్రస్తుత జీతం, పరిధి , పనితీరుపై ఆధారపడి ఉంటుందని, తిరిగి ఏప్రిల్ 2024లో మాత్రమే సవరిస్తామని కంపెనీ వెల్లడించింది. కాగా వరుసగా నాలుగోసారి 12 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. (IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు) కాగా గత ఏడాది కాలంగా దాదాపు 1400 మందిఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 2022లో పలు రౌండ్ల తొలగింపుల ద్వారా సిబ్బంది సంఖ్యను 1,350 తగ్గించకుంది. 2020-21ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టాలు రూ. 1,537 కోట్ల నుండి సంవత్సరానికి (YoY) 85 శాతం పెరిగి రూ.2,848 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం రూ.719 కోట్లుగా ఉంది. -
మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్
సాక్షి,ముంబై: ఆన్లైన్ కోచింగ్ ప్లాట్‌ఫారమ్ అన్ఎకాడమీ మరోసారి ఉద్యోగుల తీసివేతకు నిర్ణయంచింది. లాభదాయకత కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో మరో రౌండ్ లేఫ్స్లను ప్రకటించింది. సిబ్బందిలో 12 శాతం లేదా 380 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రధాన వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి సరైన దిశలో ప్రతీ అడుగు వేశాం. కానీ సరిపోలేదు.. ఈక్రమంలో దురదృష్టవశాత్తు మరో కష్టమైన నిర్ణయం తీసుకునేలా చేసిందని ఎడ్టెక్ స్టార్టప్ అన్ఎకాడమీ వ్యవస్థాపకుడు గౌరవ్ ముంజాల్ ప్రకటించారు. (ఇదీ చదవండి: ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది!150 కి.మీ. రేంజ్లో) గత 12 నెలల్లో ఇది నాలుగో రౌండ్ తొలగింపులు. 2022 ఏప్రిల్ లో 600 మందిని, గత ఏడాది నవంబర్‌లో 350 మంది ఉద్యోగులను తొలగించింది. కరోనా సమయంలో భారీ లాభాలనార్జించిన కంపెనీ తాజాగా తీవ్ర నష్టాలతో ఇబ్బందు లెదుర్కోంటోంది. కాగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు, బిజినెస్ దెబ్బతినడంతో ఖర్చు తగ్గించే చర్యల్లో భారతీయ స్టార్టప్‌లు ముఖ్యంగా ఫ్రంట్‌రో, బైజూస్, వేదాంతలాంటి ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. (నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!) -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..మాట మార్చిన సీఈఓ!
కరోనా మహ్మమారి రాకతో చాలా రంగాలు డీలా పడిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ తగ్గుమఖం పట్టాక పరిస్థితులు తిరిగి యధావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని పరిణామాల దృష్ట్యా పలు రంగాల పూర్తిగా కోలుకోవాల్సి ఉంది. ఇటీవల జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఐటీ రంగంలో ఏం జరుగుతుందనేది అర్థం కావడం లేదు. ప్రముఖ దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఎడ్యుటెక్ సేవల సంస్థ అనకాడమి మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇదివరకే 600 మంది సిబ్బందికి ఉద్వాసన పలకగా.. తాజాగా మరో 350 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీ ఖర్చులను తగ్గించి లాభాలను ఆర్జించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఇది మూడవ రౌండ్లో జరుగుతున్న తొలగింపులు. దీనికి సంబంధించి కంపెనీ సీఈవో గౌరవ్ ముంజల్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో.. కంపెనీ ఖర్చులను తగ్గించే క్రమంలో (కాస్ట్ కటింట్) క్రమంలో మా అత్యంత ప్రతిభావంతులైన కొంతమంది అనాకాడెమీ ఉద్యోగులకు వీడ్కోలు చెప్పాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పంచుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ప్రస్తుతం తొలగింపుకు సంబంధించి ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నాను. గతంలో లేఆఫ్స్ చేపట్టకూడదని తాము నిర్ణయించాం. అయితే మార్కెట్ సవాళ్లు వల్ల మా నిర్ణయాలను పునఃపరిశీలించవలసి వచ్చింది. పైగా ఇటీవల పెద్ద మొత్తంలో సంస్థ కోర్ వ్యాపారాలన్ని కూడా ఆఫ్‌లైన్‌కి మారిపోయాయని ముంజల్ తెలిపారు. జూలైలో గౌరవ్ ముంజాల్ అన్‌అకాడమీలో లేఆఫ్స్ ఉండవని ఉద్యోగులకు తెలిపారు. కానీ ఈ విషయంలో ఆయన మాట తప్పడంతో క్షమాపణలు కూడా చెప్పారు. చదవండి: ఆ ఐఫోన్‌ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’! -
ఆఫీసులో ఉచిత మీల్స్, స్నాక్స్ కట్..
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ అన్ఎకాడమీ ఇకపై అనవసర వ్యయాలను గణనీయంగా తగ్గించుకుని, లాభదాయకతపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మేనేజ్మెంట్ జీతాల్లో కోత విధించడంతో పాటు గ్లోబల్ టెస్ట్ ప్రెప్ వంటి కొన్ని వ్యాపారాలను కూడా మూసివేయనుంది. సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజల్ ఈ విషయాలు తెలిపారు. ఆఫీసులో కాంప్లిమెంటరీగా ఇచ్చే మీల్స్, స్నాక్స్ కూడా ఇకపై ఉండబోవని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాపకులు, టాప్ మేనేజ్మెంట్తో పాటు ఎవరికీ కూడా బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణాల్లాంటి ప్రయోజనాలు లభించనవి ముంజల్ తెలిపారు. అంతే కాకుండా టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం ప్రత్యేకంగా నియమించిన డ్రైవర్లను కూడా తొలగిస్తున్నామని చెప్పారు. కంపెనీ ఖాతాల్లో పుష్కలంగా రూ. 2,800 కోట్ల మేర నిధులు ఉన్నప్పటికీ .. వచ్చే రెండేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో లాభదాయకతను పెంచుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ముంజల్ వివరించారు. పనితీరు బాగాలేదంటూ ఇటీవలే 10 శాతం మంది సిబ్బందిని (దాదాపు 600 మంది) తొలగించిన అన్ఎకాడమీ తాజాగా మరిన్ని వ్యయ నియంత్రణ చర్యలు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ దేశీయ ఎడ్టెక్ అన్ అకాడమీలో ఉద్యోగుల తొలగింపు దశల వారీగా కొనసాగుతుంది. ఇప్పటికే పలు దశల్లో వందల మంది ఉద్యోగులు బయటకు పంపించగా.. తాజాగా పేలవ ప్రదర్శనపై గుర్రుగా ఉన్న అన్ అకాడమీ యాజమాన్యం మరో 150మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. అన్ అకాడమీ దేశంలో బైజూస్ తర్వాత సెకెండ్ మోస్ట్ వ్యాల్యూడ్ ఎడ్ టెక్ కంపెనీగా అవతరించింది. ముఖ్యంగా కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసుల నిర్వహణతో ఎడ్టెక్ రంగంలో అత్యద్భుత ప్రదర్శనను కనబరిచింది. దీంతో ఆ సంస్థలో సాఫ్ట్ బ్యాంక్‌తో పాటు ఫేస్బుక్, టైగర్ గ్లోబల్, టెమాసెక్ హోల్డింగ్స్, సాఫ్ట్‌బ్యాంక్, బ్లూమ్ వెంచర్స్, సీక్వోయా, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్, ఎలివేషన్ క్యాపిటల్‌లు 800 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ పెట్టుబడులతో అన్ అకాడమీని వృద్ది చేయడంతో పాటు ఇతర స్టార్టప్ కొనుగోళ్లుపై ఆ సంస్థ ప్రతినిధులు దృష్టి సారించారు. ఈ తరుణంలో 2020 జులై నెలలో 50 మిలియన్ డాలర్లకు మరో ఎడ్యుకేషన్ సంస్థ ప్రాప్ లీడర్‌ను సొంతం చేసుకుంది. ప్రాప్ లీడర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలన్నీ అన్ అకాడమీ నిర్వహించేది.అయితే కోవిడ్ తెచ్చిన ఎడ్యుకేషన్ సంక్షోభంతో ఆఫ్‌లైన్ క్లాసులు కనుమరుగయ్యాయి. ఆన్ లైన్ క్లాసులకు డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అన్ అకాడమీకి గట్టి పోటీ ఇచ్చాయి. ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు పోటీని తట్టుకుంటూ మార్కెట్లో కాంపిటీటర్లకు చెక్ పెట్టేందుకు అన్అకాడమీ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో విపరీతమైన నిధుల కొరత ఏర్పడించింది. 2020లో అన్ అకడామీ కంపెనీ నిర్వహణ కోసం రూ.452కోట్లు ఖర్చు చేయగా రూ.464 కోట్లు లాభాల్ని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2021లో మాత్రం భారీగా నష్టపోయింది. 6 రెట్లు పెరిగి రూ.1537కోట్లు నష్టపోయింది. ఖర్చులు సైతం రూ.2వేల కోట్లగా పెరిగాయి. దీంతో ఖర్చు తగ్గించేందుకు పలు దశల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇలా ఏప్రిల్ నెలలో 1000మందిని, మేలో 150 మందిని, జూన్‌లో తాజాగా ప్రాప్ లీడర్లో అడ్వటైజింగ్, మార్కెటింగ్ కాస్ట్ తగ్గించుకునేందుకు 150మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్ పెట్టింది.ఆ మెయిల్స్‌పై అన్ అకాడమీ యాజమాన్యం స్పందించింది. పనితీరును బట్టి ఉద్యోగులుపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇది ఏ సంస్థలోనైనా సర్వ సాధారణమని సంస్థపై వస్తున్న ఆరోపణల్ని కొట్టి పారేసే ప్రయత్నం చేసింది. చదవండి👉చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్అకాడమీ! -
దీపికా పదుకొణె మమ్మల్ని ఆదుకోవా ప్లీజ్!
అవును. నిజమే. తాము ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతుంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఏం చేస్తుందంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. నిర్ధాక్షణ్యంగా విధుల నుంచి తొలగిస్తే తమ కుటుంబ సభ్యుల బాగోగులు ఎవరు చూసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. 2015లో బెంగళూరు కేంద్రంగా గౌరవ్ ముంజాల్, హిమేష్ సింగ్, రోమన్ సైనా, సచిన్ గుప్త'లు ఎడ్యుకేషన్ స్టార్టప్ అన్ అకాడమీని స్థాపించగా..అందులో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆ సంస్థ సేవలు నిర్విరామంగా కొనసాగాయి. మరో ప్రత్యర్ధి సంస్థ బైజూస్‌కు గట్టి పోటీ కూడా ఇచ్చింది. కానీ వరుస నష్టాలు ఆసంస్థను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు గతనెలలో అన్ అకాడమీ కాస్ట్ కటింగ్ పేరుతో 1000మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించేసింది. దీంతో పనిగంటల పేరుతో యాజమాన్యం తమ(ఉద్యోగుల) తో వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఉద్యోగులు ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతుండగానే..ఆ సంస్థ మరోసారి 150 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్ చేసింది. మూడు రోజుల్లో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 450 నుండి 100కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. "మే 27న చాలా మంది ఉద్యోగులకు మెయిల్స్ వచ్చాయి. ఆ మెయిల్స్‌లో మీ సేవలు మాకు అవసరం లేదని వివరిస్తూ పేర్కొన్నట్లు" పేరు చెప్పేందుకు ఇష్టపడని ఉద్యోగి తెలిపాడు". "మాకు వచ్చిన మెయిల్స్ చూసిన మా సహచర ఉద్యోగులు సైతం రిజైన్ చేశారు. ఎందుకంటే సాధారణంగా చాలా స్టార్టప్‌లు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అంతెందుకు అన్ అకాడమీలో మే 27న 450 మంది ఉద్యోగులు ఉండగా వారి సంఖ్య 100కి చేరిందని”మరో ఉద్యోగి తెలిపాడు. కాగా, తమని తొలగిస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, కనీసం నోటిస్ సర్వ్ చేయమని అడగలేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా,తమని విధుల నుంచి తొలగిస్తున్న సంస్థ ఏంజెల్ ఇన్వెస్టరైన దీపికా పదుకొణే సైలెంట్‌గా ఎందుకు ఉన్నారో చెప్పాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.సంస్థ కోసం కష్టపడి పని చేసిన ఉద్యోగుల్ని ఇలా అర్దాంతరంగా తొలగించడం ఎంతవరకు సమంజసమని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తుండగా..ఇప్పటికైనా తొలగించిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చదవండి👉 చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్అకాడమీ! -
చేస్తే చేయండి..లేదంటే పోండి, ఉద్యోగులకు భారీ షాక్..వెయ్యి మంది తొలగింపు!
ప్రముఖ ఎడ్యుకేషన్ స్టార్టప్ 'అన్అకాడమీ' తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. అందులో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయలేదని కారణంతో ఫైర్ చేసినట్లు ఉద్యోగులు వాపోతుండగా..గత రెండు నెలలుగా కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్అకాడమీ సంస్థ.. ఉద్యోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎడ్యుకేషన్ స్టార్టప్ అన్‌అకాడమీలో ప్రస్తుతం పర్మినెంట్, కాంట్రాక్ట్ మొత్తం కలిపి 6వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1000మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. వారిలో 300మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తొలగింపుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల (ఉద్యోగులు) పట్ల అన్ అకాడమీ మేనేజ్మెంట్ దారుణంగా వ్యవహరిస్తుందని వాపోయారు. రోజుకి 12 నుంచి 14 గంటల పనిచేయాలని, లేదంటే వెళ్లిపోవాలని హెచ్ఆర్ విభాగం తెలిపినట్లు చెప్పారు. కానీ ఇలా తమని అర్ధాంతరంగా తొలగించడంపై సమాచారం ఇవ్వలేదన్నారు. ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారని హెచ్ఆర్ విభాగం ప్రతినిధుల్ని అడగ్గా.. పొంతనలేని సమాచారం ఇచ్చినట్లు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్అకాడమీ యాజమాన్యం వెర్షన్ ఇలా ఉంది న్యూ ఎడ్యుకేషన్ కేటగిరి, ప్రొడక్ట్ విభాగాల్లో విస్తరించాలని ఈ ఎడ్యుకేషన్ స్టార్టప్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా పర్ఫామెన్స్ చూపించని ఉద్యోగుల్ని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని సెలక్ట్ చేసుకుంటుంది. ఇప్పటికే తొలగింపు నిర్ణయం అంశంపై ఉద్యోగులకు సమాచారం అందించామని తెలిపారు. ఒకవేళ ఉద్యోగుల పనితీరు బాగలేదంటే..మెరుగు పరుచునేందుకు కొంత సమయం ఇచ్చినట్లు, అప్పటికీ వారి ఫర్మామెన్స్ అలాగే ఉంటే తొలగిస్తున్నట్లు అన్అకాడమీ ప్రతినిధులు తెలిపారు. బైజూస్‌కు పోటీగా 2015లో బెంగళూరు కేంద్రంగా గౌరవ్ ముంజాల్, హిమేష్ సింగ్, రోమన్ సైనా, సచిన్ గుప్త'లు ఎడ్యుకేషన్ స్టార్టప్ అన్‌అకాడమీని స్థాపించారు. సంస్థ ప్రారంభంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్ధులు ఎగ్జామ్స్‌కు ప్రిపరేషన్‌తో పాటు ఇతర కాంపిటిటీవ్ ఎగ్జామ్స్ కోసం ఉచిత ఆన్లైన్ క్లాసుల్ని విద్యార్ధులకు అందించింది. దీంతో ఎడ్యుకేషన్ మార్కెట్లో అన్అకాడమీ మంచి పేరు సంపాదించింది. అలా 2019లో సబ్ స్క్రిప్షన్, ఆన్లైన్ క్లాసులు నిర్వహించే సర్వీసుల్ని ప్రారంభించి..కాంపిటీటరైన మరో ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్‌కు గట్టిపోటీ ఇచ్చింది. ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది బైజూస్‌కు పోటీగా ఎడ్యుకేషన్ మార్కెట్లో సత్తా చాటడంతో అన్‌అకాడమీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఫేస్బుక్, టైగర్ గ్లోబల్, టెమాసెక్ హోల్డింగ్స్, సాఫ్ట్‌బ్యాంక్, బ్లూమ్ వెంచర్స్, సీక్వోయా, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్, ఎలివేషన్ క్యాపిటల్ పెట్టుబడిదారులతో ఇప్పటి వరకు దాదాపు $800 మిలియన్ల నిధులను సేకరించింది. ప్రస్తుతం ఈ స్టార్టప్ విలువ 3.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అన్అకాడమీ ప్రధాన ప్రత్యర్థి బైజూస్‌తో పోటీపడుతుండగా..ప్రస్తుతం, బైజూస్ మార్చి 2022లో ఇటీవలి ఫండింగ్ రౌండ్లో $22 బిలియన్లతో భారతదేశంలో అత్యంత విలువైన ఎడ్యుకేషన్ స్టార్టప్‌గా నిలిచింది. 11సంస్థల్ని సొంతం చేసుకుంది పేరుతో పాటు ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడంతో అన్అకాడమీ ఇతర సంస్థల్ని పూర్తిగా కొనుగోలు చేయడం లేదా పెద్దమొత్తంలో వాటాను చేజిక్కించుకునే ప్రయత్నాలు కూడా చేసింది. అలా ఇప్పటి వరకు 11 సంస్థల్ని సొంతం చేసుకోగా..వాటిలో ట్యాప్‌చీఫ్,మాస్ట్రీ,ప్రిప్లాడర్,'హండా కా ఫండా'లు ఉన్నాయి. వీటిలో ప్రిప్లాడర్ PrepLadderలో జూలై 2020లో $50 మిలియన్లు అత్యధికంగా చెల్లించి దక్కించుకుంది. చదవండి: జూమ్ కాల్లో 800 మంది ఉద్యోగుల తొలగింపు! మరి ఇంత దుర్మార్గమా..ప్రధాని ఆగ్రహం! -
ఉద్యోగులే బాస్.. అన్ అకాడమీ నుంచి ఈఎస్ఓపీ
తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు ఎడ్యుటెక్ సంస్థ అన్ అకాడమీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంస్థలో పని చేసే ఉద్యోగులతో పాటు అధ్యాపకులకు మొత్తంగా 10.5 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ కింది ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్అకాడమీ సంస్థ సహా వ్యవస్థాపకుడు రోమన్ షైనీ ట్వీట్ చేశారు. విద్యను అందరికి అందివ్వాలనే లక్ష్యంతో మేము చేసిన ప్రయత్నాలకు సహాకరించిన అందరికీ ధన్యవాదాలు, మా సంస్థ తరఫున ఉద్యోగులకు ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ) వర్తింప చేయడం ఇది నాలుగో సారి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. 300ల మందికి బెంగళూరు వేదికగా ప్రారంభమైన అన్అకాడమీ స్టార్టప్ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం ఈఎస్‌ఓపీకి అర్హులుగా 300ల మంది వరకు అధ్యాపకులు, టీచర్లు అర్హత సాధించినట్టు అన్ అకాడమీ తెలిపింది. గత నాలుగైదేళ్లుగా వీరంతా అన్ అకాడమీ సంస్థ అభివృద్ది కోసం పాటు పడ్డారని, అందుకే సంస్థలో వాళ్లకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు అన్అకాడమీ తెలిపింది. ఎడ్యుటెక్‌గా స్కూలు పిల్లలకు ట్యూషన్లు చెప్పడం దగ్గర నుంచి మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీస్ పరీక్షల వరకు అనేక రకాలుగా అన్అకాడమీ ఎడ్యుటెక్ సంస్థగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం అన్ అకాడమీ సంస్థ మార్కెట్ వ్యాల్యూ 3.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. Happy to announce Unacademy's largest ESOPs buyback till date worth $10.5M for our team members and educators. This is our third buyback till date. Extremely thankful to all our team members and educators for believing in our vision of democratising education. Let’s crack it! — Roman Saini (@RomanSaini) September 4, 2021 చదవండి : భారీగా పుట్టుకొస్తున్న సాస్ స్టార్టప్‌లు, ఐపీఓకి జోష్ -
అన్‌అకాడమీలో సచిన్ పెట్టుబడులు
సాక్షి,బెంగళూరు: భారత మాజీ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ బెంగళూరుకు చెందిన ఎడ్యుకేషన్ టెక్ స్టార్టప్ అన్‌అకాడమీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్నికుదుర్చుకున్నారు.ఎడ్యుకేషన్ టెక్ స్టార్టప్ అన్‌అకాడమీలో ఆయన బారీ పెట్టుబుడులు పెట్టారు. దీంతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు. అలాగే లైవ్ క్లాసుల ద్వారా విద్యార్థులకు బోధిస్తారు. సచిన్ తన జీవిత పాఠాలనూ పంచుకుంటారు. అన్అకాడమీ ప్లాట్‌ఫాంలో యూజర్లకు ఈ తరగతులు ఉచితమని కంపెనీ తెలిపింది. స్పోర్ట్స్ లెర్నింగ్ విభాగంలో సచిన్‌తో కలిసి లోతైన కంటెంట్-నేతృత్వంలోని భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని, పూర్తి వివరాలు రాబోయే నెలల్లో ఆవిష్కరించనున్నామని అకాడమీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ గౌరవ్ ముంజాల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా."ఆటలో తన అనుభవాలను పాఠాలుగా యువతతో పంచుకోవడంపాటు, వారికి ఉత్సాహాన్నివ్వాలనేదే తన ప్రయత్నమని టెండూల్కర్ చెప్పారు. -
ఐఏఎస్ కు రాజీనామాచేసి ట్యూటర్ గా..
21వ ఏట తొలిప్రయత్నంలోనే సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించి సంచనం సృష్టించిన రోమన్ షైనీ మరో అనూహ్యనిర్ణయం తీసుకున్నారు. గడిచిన మూడేళ్లుగా జబల్ పూర్ అసిస్టెండ్ కలెక్టర్ గా పనిచేస్తోన్నఆయన ఉన్నతోద్యోగానికి రాజీనామాచేసి, పూర్తికాలం ఉచిత విద్యాబోధనకు పునరంకితం కానున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. 'ఉన్నత ఉద్యోగాలు చేయాలనుకునే పేద అభ్యర్థులు అకాడమీలకు వెళ్లి లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేరు. అలాంటివాళ్లకోసం ప్రారంభమైందే అన్అకాడమీ. ప్రస్తుతం ఇండియాలో లార్జెస్ట్ యూట్యూబ్ ఇదే. లక్షలాది మంది విద్యార్థులు కోటికి పైగా పాఠాలను అన్ అకాడమీద్వారా ఉచితంగా నేర్చుకున్నారు. దీని వ్యవస్థాపకుడు గౌరవ్ ముఝాల్ నా ఆప్తమిత్రుడు. రెండేళ్ల నుంచి నేను కూడా అన్ అకాడమీలో పాఠాలు చెబుతూనే ఉన్నా. అయితే అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందిప్పుడు. ఐఏఎస్ అధికారిగా కంటే ఉచితంగా పాఠాలు చెప్పే ట్యూటర్ గా ఉండాలనే నిర్ణయించుకున్నా' అంటూ తన మనోగతాన్ని వెల్లడించాడు రోమన్ షైనీ. సెప్టెంబర్ లోనే షైనీ రాజీనామా చేశాడని, ఈ నెలలో డీవోపీటీ శాఖ నిర్ణయం వెలువడుతుందని జబల్ పూర్ కలెక్టర్ ఎస్ ఎన్ రూప్లా చెప్పారు.