బెంగళూరు: సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న ఎడ్‌టెక్ సంస్థ 'అన్‌అకాడమీ'లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సుబ్రమణియన్ రామచంద్రన్ తన పదవికి రాజీనామా చేశారు.
రెండు నెలల క్రితం అన్‌అకాడమీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) వివేక సిన్హా సంస్థ నుంచి వైదొలిగారు. తాజాగా, రామచంద్రన్ సైతం కంపెనీని విడిచి పెట్టి వెళ్లడం ఎడ్‌టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. అయితే, సీఎఫ్‌వో ఎందుకు రాజీనామా చేశారు? రెండు నెలల క్రితం అన్‌అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ చేసిన వ్యాఖ్యలకు.. వరుస రిజిగ్నేషన్‌లకు ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది ఆగస్ట్‌లో అన్‌అకాడమీని బ్యాన్‌చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో అన్‌అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై క్లాస్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పేరు మార్పు వల్ల ఒరిగేదేమీ లేదని.. ఉన్న చట్టాలను పేర్లు మార్చి తీసుకురావడం వల్ల ఉపయెగం లేదన్నాడు కరణ్. పైగా ‘ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఓటు వేసేటప్పుడు, చదువుకున్న అభ్యర్థిని ఎన్నుకోండి.. అప్పుడు మీరు జీవితంలో మళ్లీ ఇలాంటి బాధలు పడకుండా ఉంటారు.. పేర్లు మార్చడం మాత్రమే తెలిసిన వారికి ఓటు వేయకండి,’ అని చెప్పడం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది
We are an education platform that is deeply committed to imparting quality education. To do this we have in place a strict Code of Conduct for all our educators with the intention of ensuring that our learners have access to unbiased knowledge.
— Roman Saini (@RomanSaini) August 17, 2023
Our learners are at the centre of…
దీనికి కారణమైన కరణ్‌ను అన్‌అకాడమీ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ విధుల నుంచి తొలగించారు. ‘క్లాసు రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక కాదని.. టీచర్(కరణ్) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని’ పోస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాతే అన్‌అకాడమీ నుంచి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)సుబ్రమణియన్ రామచంద్రన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) వివేక సిన్హాలు బయటకు వచ్చారు.
చదవండి👉 చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్‌అకాడమీ!
Comments
Please login to add a commentAdd a comment