Roman Saini
-
'అన్అకాడమీ'లో అసలేం జరుగుతోంది?
బెంగళూరు: సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న ఎడ్టెక్ సంస్థ 'అన్అకాడమీ'లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సుబ్రమణియన్ రామచంద్రన్ తన పదవికి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం అన్అకాడమీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) వివేక సిన్హా సంస్థ నుంచి వైదొలిగారు. తాజాగా, రామచంద్రన్ సైతం కంపెనీని విడిచి పెట్టి వెళ్లడం ఎడ్టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. అయితే, సీఎఫ్‌వో ఎందుకు రాజీనామా చేశారు? రెండు నెలల క్రితం అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ చేసిన వ్యాఖ్యలకు.. వరుస రిజిగ్నేషన్లకు ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో అన్‌అకాడమీని బ్యాన్చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై క్లాస్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పేరు మార్పు వల్ల ఒరిగేదేమీ లేదని.. ఉన్న చట్టాలను పేర్లు మార్చి తీసుకురావడం వల్ల ఉపయెగం లేదన్నాడు కరణ్. పైగా ‘ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఓటు వేసేటప్పుడు, చదువుకున్న అభ్యర్థిని ఎన్నుకోండి.. అప్పుడు మీరు జీవితంలో మళ్లీ ఇలాంటి బాధలు పడకుండా ఉంటారు.. పేర్లు మార్చడం మాత్రమే తెలిసిన వారికి ఓటు వేయకండి,’ అని చెప్పడం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది We are an education platform that is deeply committed to imparting quality education. To do this we have in place a strict Code of Conduct for all our educators with the intention of ensuring that our learners have access to unbiased knowledge. Our learners are at the centre of… — Roman Saini (@RomanSaini) August 17, 2023 దీనికి కారణమైన కరణ్‌ను అన్అకాడమీ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ విధుల నుంచి తొలగించారు. ‘క్లాసు రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక కాదని.. టీచర్(కరణ్) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని’ పోస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాతే అన్అకాడమీ నుంచి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)సుబ్రమణియన్ రామచంద్రన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) వివేక సిన్హాలు బయటకు వచ్చారు. చదవండి👉 చేస్తే చేయండి..లేదంటే పోండి, వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించిన అన్అకాడమీ! -
డాక్టర్ కాబోయి అసిస్టెంట్ కలెక్టర్.. అదీ తొలి ప్రయత్నంలోనే!
కష్టపడి చదివి ఒక ఉన్నతమైన ఉద్యోగం చేయాలన్నది చాలామంది కల. ఐఏఎస్ చదవాలనుకున్న వారు దాన్ని సాధించి అక్కడితో ఆగిపోతారు. ఒక డాక్టర్ కావాలనుకున్న వారు డాక్టర్ అయితే చాలని అనుకుంటారు. అయితే ఈ కథనంలో మనం చెప్పుకోబోయే వ్యక్తి ఐఏఎస్తోనో.. డాక్టర్తోనో ఆగిపోలేదు. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతడు ఏమి సాధించాడు. ఎలా సాధించాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తొలి ప్రయత్నంలోనే.. మనం చెప్పుకోబోయే వ్యక్తి జైపూర్ ప్రాంతానికి చెందిన 'రోమన్ సైనీ' (Roman Saini). నిజానికి ఇతని కుటుంబంలో 12 మంది డాక్టర్లు ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని చిన్నప్పటి నుంచే తానూ డాక్టర్ అవ్వాలని భారతదేశంలో అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మొదటి ప్రయత్నంలోనే అర్హత సాధించించాడు. అప్పటికి అతని వయసు కేవలం 16 సంవత్సరాలు కావడం గమనార్హం. దీంతో భారతదేశంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణుడైన అతి చిన్న వయస్కుడిగా రికార్డ్ సాధించాడు. ఐఏఎస్.. అయితే సమాజ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఐఏఎస్ చదవాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యంగా ఇందులోనూ మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించేశాడు. యుపిఎస్‌సిలో శిక్షణ పూర్తయిన తరువాత మధ్యప్రదేశ్ క్యాడర్లో జబల్పూర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. విధి నిర్వహణలో భాగంగానే ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ.. సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా యువత ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసాడు. మధ్యప్రదేశ్ ప్రాంతంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఎందుకంటే అక్కడి వారికి ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన తక్కువ, అంతే కాకుండా వారికి సరైన మార్గ నిర్దేశం చేసేవారు లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా భావించాడు. కోచింగ్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్న చాలా మందిని చూసి చలించి పోయాడు. అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా.. మధ్యప్రదేశ్ ప్రాంతంలోని యువతను చూసి చలించిపోయిన రోమన్ సైనీ మెరుగైన విద్య అందించాలని, ఉద్యోగావకాశాల కోసం సరైన మార్గ నిర్దేశం చేయాలనీ భావించి తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. యువతను సరైన మార్గంలో పయనించేలా చేయడానికి ఆన్లైన్ కోచింగ్ సరైన మార్గం అని భావించి.. తన స్నేహితులు గౌరవ్ ముంజల్, హేమేష్ సింగ్‌తో కలిసి 'అన్అకాడమీ' (Unacademy) పేరుతో ఆన్లైన్ ట్యుటోరియల్ ప్రారంభించాడు. అన్అకాడమీ ప్రారంభం.. సైనీ ప్రారంభించిన ఈ అన్అకాడమీ ప్రచారానికి యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను ఉపయోగించుకున్నాడు. ఇందులో సివిల్స్, స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC), ఐబీపీఎస్ (IBPS) ఉద్యోగ నియామకాలకు కావాల్సిన అన్ని మెటీరియల్స్, టీచింగ్ వంటివి మొత్తం అందించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ అకాడమీ ద్వారా సుమారు మూడు లక్షల మందికి పైగా కోచింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం అన్అకాడమీ అనేది 20 వేల మందికి పైగా బోధనా సిబ్బందిని కలిగి ఉంది. తక్కువ ఖర్చుతో అనుకున్నది సాధించాలనుకునే వారికి ఈ అకాడమీ ఒక వరం అనే చెప్పాలి. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి యువతకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్న రోమన్ సైనికి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఫిదా అయిపోయారు. ఈ అకాడమీ ద్వారా గొప్ప స్థాయికి చేరుకున్న వారు కూడా స్వచ్చందంగా సేవలందిస్తున్నారు. రోమన్ సైనీ ఒక గిటార్ ప్లేయర్ కూడా. ఇతడు పాటలు కూడా పాడతాడు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) నిజానికి రోమన్ సైనీ అనుకుని ఉండే ఇంకా గొప్ప స్థాయికి చేరుకుని ఉండేవాడు. కానీ సమాజం బాగుండాలంటే ఒక వ్యక్తి మాత్రమే అభివృద్ధి చెందితే సరిపోదు.. తన చుట్టూ ఉన్నవారు కూడా తప్పకుండా ఎదగాలి అనే ఆలోచనతో ఐఏఎస్ సైతం వదులుకున్నాడంటే అతని సేవాదృక్పధం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఈ రోజు అన్అకాడమీ అనేది రూ. 2,600 కోట్ల సంస్థగా అవతరించింది. ఈ ఘనత మొత్తం మాజీ ఐఏఎస్ అధికారి రోమన్ సైనీకే చెందుతుంది. -
ఫ్రెండ్ యూట్యూబ్ ఛానెల్‌ని రూ. 26వేల కోట్ల కంపెనీగా మార్చాడు, షాకింగ్ శాలరీ!
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎడ్-టెక్ కంపెనీలలో ఒకటి అన్‌ఎకాడెమీ. స్థాపించిన అయిదేళ్లలోనే అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా అన్‌ఎకాడెమీ సక్సెస్‌లో కోఫౌండర్‌గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా హేమేష్ సింగ్ పాత్ర చాలా కీలకం. ఆ వివరాలేంటో చూద్దాం..! ఇంజనీర్‌గా ఉండి వ్యాపారవేత్తగా మారిన గౌరవ్ ముంజాల్ యూట్యూబ్ చానల్లే తరువాతి కాలంలో అన్ఎకాడెమీగా ఆవిర్భవించింది. 26 వేల కోట్ల రూపాయల కంపెనీగా ఈ యూట్యూబ్ చానల్లే పునాది వేసింది. ముఖ్యంగా ముంజాల్, స్నేహితుడు రోమన్ సైనీ, హేమేష్ సింగ్ త్రయం కలిసి అన్కాడెమీని విజయవంతమైన వ్యాపార సంస్థగా తీర్చిదిద్దారు. (అదరగొట్టిన టీసీఎస్: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిట్కాలివిగో!) గౌరవ్ ముంజాల్ ప్రేరణతో ఇంజనీర్ అయిన హేమేష్ సింగ్ కూడా ముంజాల్ యూట్యూబ్‌లో చానల్లో చేరారు. అనంతరం అన్‌ఎకాడెమీ సహ వ్యవస్థాపకుడుగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కంపెనీ ముందుకునడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అన్ఎకాడెమీలో చేరడానికి ముందు ఫ్లాట్చాట్ సీటీవోగా పనిచేశారు. 2015లో ఫ్లాట్చాట్ను విడిచి పెట్టిన తర్వాత, హేమేష్ సింగ్ ,రమణ్ సైనీ, గౌరవ్ ముంజాల్‌తో కలిసి అన్ఎకాడెమీని స్థాపించారు. ఇక అంతే అప్పటినుంచి కంపెనీ శరవేగంగా డెవలప్ అయింది. 🎉 1/ You asked, and we delivered!@CohesiveAI pricing is finally here. Our focus is to help you choose the perfect plan that suits all your needs.✨ pic.twitter.com/ygxNrHdEYz — hemesh singh (@hemezh) April 18, 2023 అదిరిపోయే వేతనం 2022లో గౌరవ్ ముంజాల్ రూ. అన్‌ఎకాడెమీ సీఈఓగా రూ. 1.58 కోట్లు తీసుకోగా, హేమేష్ సింగ్ రూ. 1.19 కోట్లు, రోమన్ సైనీ రూ. 88 లక్షలు వార్షిక వేతనం అందుకున్నారు. అన్‌ఎకాడెమీ 2020లో యునికార్న్ క్లబ్లో చేరింది, ప్రస్తుతం దీని విలువ 3.4 బిలియన్లు డాలర్లు. కాగా హేమేష్ సింగ్ మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో నివసిస్తున్నారు. (యానివర్సరీ సేల్, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు) కాగా యూట్యూబ్ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌గా గౌరవ్ ముంజాల్ 2010లో అన్ఎకాడెమీని స్టార్ట్ చేశారు. ఆ తరువాత హేమేష్, రమణ కోఫౌండర్స్గా 2015లో అధికారికంగా కంపెనీ లాంచ్ అయింది. యూట్యూబ్ ద్వారా యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే వేలాది ఏఐఎస్ అభ్యర్థులకు అన్‌ఎకాడెమీ కోచింగ్ ఇస్తుంది. విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు చేయనవసరం లేని యుపిఎస్సి కోచింగ్‌కు వేదికను అందించాలనే లక్క్ష్యంతోనే ఆవిర్భవించింది అన్‌ఎకాడెమీ. కేవలం ఆరేళ్లలో, అన్ఎకాడెమీలో టీచర్స్ సంఖ్య 18వేలకు చేరింది. (ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్?) (ఒకపుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్: కండోమ్ బిజినెస్‌తో రూ. 43వేల కోట్లు!)