దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎడ్-టెక్ కంపెనీలలో ఒకటి అన్‌ఎకాడెమీ. స్థాపించిన అయిదేళ్లలోనే అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా అన్‌ఎకాడెమీ సక్సెస్‌లో కోఫౌండర్‌గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా హేమేష్ సింగ్ పాత్ర చాలా కీలకం. ఆ వివరాలేంటో చూద్దాం..!
ఇంజనీర్‌గా ఉండి వ్యాపారవేత్తగా మారిన గౌరవ్ ముంజాల్ యూట్యూబ్ చానల్‌లే తరువాతి కాలంలో అన్‌ఎకాడెమీగా ఆవిర్భవించింది. 26 వేల కోట్ల రూపాయల కంపెనీగా ఈ యూట్యూబ్ చానల్‌లే పునాది వేసింది. ముఖ్యంగా ముంజాల్, స్నేహితుడు రోమన్ సైనీ, హేమేష్ సింగ్ త్రయం కలిసి అన్‌కాడెమీని విజయవంతమైన వ్యాపార సంస్థగా తీర్చిదిద్దారు. (అదరగొట్టిన టీసీఎస్: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిట్కాలివిగో!)
గౌరవ్ ముంజాల్ ప్రేరణతో ఇంజనీర్ అయిన హేమేష్ సింగ్ కూడా ముంజాల్ యూట్యూబ్‌లో చానల్‌లో చేరారు. అనంతరం అన్‌ఎకాడెమీ సహ వ్యవస్థాపకుడుగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కంపెనీ ముందుకునడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అన్‌ఎకాడెమీలో చేరడానికి ముందు ఫ్లాట్‌చాట్ సీటీవోగా పనిచేశారు. 2015లో ఫ్లాట్‌చాట్‌ను విడిచి పెట్టిన తర్వాత, హేమేష్ సింగ్ ,రమణ్ సైనీ, గౌరవ్ ముంజాల్‌తో కలిసి అన్‌ఎకాడెమీని స్థాపించారు. ఇక అంతే అప్పటినుంచి కంపెనీ శరవేగంగా డెవలప్ అయింది.
🎉 1/ You asked, and we delivered!@CohesiveAI pricing is finally here.
— hemesh singh (@hemezh) April 18, 2023
Our focus is to help you choose the perfect plan that suits all your needs.✨ pic.twitter.com/ygxNrHdEYz
అదిరిపోయే వేతనం
2022లో గౌరవ్ ముంజాల్ రూ. అన్‌ఎకాడెమీ సీఈఓగా రూ. 1.58 కోట్లు తీసుకోగా, హేమేష్ సింగ్ రూ. 1.19 కోట్లు, రోమన్ సైనీ రూ. 88 లక్షలు వార్షిక వేతనం అందుకున్నారు. అన్‌ఎకాడెమీ 2020లో యునికార్న్ క్లబ్‌లో చేరింది, ప్రస్తుతం దీని విలువ 3.4 బిలియన్లు డాలర్లు. కాగా హేమేష్ సింగ్ మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో నివసిస్తున్నారు. (యానివర్సరీ సేల్, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు)
కాగా యూట్యూబ్ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌గా గౌరవ్ ముంజాల్ 2010లో అన్‌ఎకాడెమీని స్టార్ట్ చేశారు. ఆ తరువాత హేమేష్, రమణ కోఫౌండర్స్‌గా 2015లో అధికారికంగా కంపెనీ లాంచ్ అయింది. యూట్యూబ్ ద్వారా యూపీఎస్‌సీ పరీక్షలకు సిద్ధమయ్యే వేలాది ఏఐఎస్ అభ్యర్థులకు అన్‌ఎకాడెమీ కోచింగ్ ఇస్తుంది. విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు చేయనవసరం లేని యుపిఎస్‌సి కోచింగ్‌కు వేదికను అందించాలనే లక్క్ష్యంతోనే ఆవిర్భవించింది అన్‌ఎకాడెమీ. కేవలం ఆరేళ్లలో, అన్‌ఎకాడెమీలో టీచర్స్ సంఖ్య 18వేలకు చేరింది. (ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్?)
(ఒకపుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్: కండోమ్ బిజినెస్‌తో రూ. 43వేల కోట్లు!)
Comments
Please login to add a commentAdd a comment