ప్రస్తుత రోజుల్లో కోచింగ్ అంటే ఎంత డబ్బు వెచ్చించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఐఏఎస్‌లాంటి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలకు కొచింగ్‌కి అయ్యే ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో తెలియంది కాదు. కానీ అలాంటి కఠినతరమైన ఐఏఎస్ పోటీ పరీక్షకి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాడు. సన్యాసం తీసుకున్న వ్యక్తి. ఇక్కడ విశేషం ఏంటంటే మౌనంగానే కోచింగ్ ఇస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక్క మాట మాట్లాడకుండా కోచింగ్ ఇస్తాడు. అందరికీ ఉన్నతోద్యోగాలు చేసే అవకాశం దక్కాలని ఇలా ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాడట. ఇంతకీ ఎవరా ఆ వింత వ్యక్తి..
ఆ వ్యక్తి పేరు దినేశ్ స్వరూప్ బ్రహ్మచారి. ఎప్పుడూ కాషాయ దుస్తులు ధరించి, పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించే ఈయనను అంతా చాయ్‌వాలే బాబా (Chai Wale Baba)గా పిలుస్తారు. తన జీవితాన్ని ఐఏఎస్(IAS) కోచింగ్‌కి అంకితం చేశారు. ఆయన అందరూ ఉన్నతోద్యోగాలు పొందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వారికైనా ఉచితంగానే ఐఏఎస్ కోచింగ్ ఇస్తారు చాయ్‌వాలే బాబా .
ప్రత్యేకత ఏంటంటే..
కోచింగ్ ఇవ్వాలంటే నోరు విప్పాల్సిందే. స్టూడెంట్స్‌కి అర్థమయ్యేలా విపులంగా విడమర్చి గట్టిగా చెప్పక తప్పదు. అలాంటిది ఈయన నోరు తెరవకుండానే భోధిస్తారు. మౌనవ్రతం పాటిస్తూనే..సైగలతో అభ్యర్థులను గైడ్ చేస్తుంటారు. వాట్సప్ ద్వారా నోట్స్ ఇస్తారు. ఇతరత్రా ఆదేశాలు, మెసేజ్‌లు కూడా వాట్సప్ ద్వారానే. అయినప్పటికీ.. వేలాది మంది ఆయన దగ్గర మెంటార్‌షిప్ తీసుకుంటున్నారు. ఏ డౌట్ ఉన్నా సరే, ఆయనకు వాట్సప్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆన్సర్ రిప్లై వస్తుంది.
కేవలం 'టీ' మాత్రమే
ఈ చాయ్‌వాలా బాబాకు సంబంధించిన మరొక విశేషమేమిటంటే..ఆయన అస్సలు ఎలాంటి ఘనాహారం తినరు. కేవలం రోజుకి పది కప్పుల టీ(చాయ్) మాత్రమే తాగుతారు. అందువల్లే ఆయన్ని చాయ్‌వాలే బాబాగా పిలుస్తారు. గత 40 ఏళ్లుగా ఆయన జీవనశైలి ఇదేనట.
ఏ డౌట్ ఉన్నా వెంటనే గైడ్ చేస్తారు..
ఆయన శిఘ్యులు తమ గురువు బాబా ఎప్పుడు ఏ సాయం కావాలన్నా..తక్షణమే తమకు గైడెన్స్ ఇస్తారని అంటున్నారు. ఎప్పుడూ మౌనంగా ఉండే ఆయన సైగలు, సంకేతాలు, వాట్సప్ మెసేజ్‌ల ద్వారానే గైడ్ చేస్తారని చెప్పారు. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేస్తే చాలు, తక్షణమే రిప్లై ఇస్తారని చెబుతున్నారు. ఆఖరికి నోట్స్ కూడా వాట్సప్ ద్వారానే పంపుతారని ఓ శిఘ్యుడు చెబుతున్నాడు.
(చదవండి: సన్యాసిలా జీవించిన ఆమె ఇవాళ ఐఏఎస్ అధికారిణి..ఏకంగా మాజీ సీఎం..!)
Comments
Please login to add a commentAdd a comment