గురుకులాల్లో ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్
రామగుండం:
గురుకుల విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అంశాలపైనా కోచింగ్ ఇస్తున్నట్లు గురుకుల సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. స్థానిక గురుకుల బాలికల పాఠశాలను ఆయన ఆదివారం సందర్శించారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ‘ఇంప్యాక్’్ట’ పేరుతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 గురుకుల కేంద్రాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా కలిసి గురుకుల విద్యాలయాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను చదివించాలని సూచించారు. విద్యార్థులు కంప్యూటర్‌తో పాటు పరభాషపై పట్టు సాధించాలని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ అపర్ణ పాల్గొన్నారు. ప్రవీణ్‌కుమార్‌కు ఏఎస్పీ ఫకీరప్పా, సీఐ నారాయణనాయక్, ఎస్సై ప్రదీప్‌కుమార్ స్వాగతం పలికారు. న్యూయార్క్‌కు చెందిన పీజీ విద్యార్థిని అలైసా రూపో విద్యార్థులతో ముచ్చటించారు. స్వతహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా విద్యార్థినులు ఎదగాలని సూచించారు. ఆంగ్లంపై పట్టు సాధించాలని పేర్కొన్నారు. ‘ ఫర్ గర్ల్స్’అనే సంస్థ సీనియర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిలుగురి విశ్వనీ సంధానకర్తగా వ్యవహరించారు.ఖని ఎస్సీ బాలికల వసతిగృహాన్ని కూడా ప్రవీణ్‌కుమార్ సందర్శించారు.