రాజస్థాన్(Rajasthan)కి చెందిన బిష్ణోయ్ తెగ(Bishnoi community) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంతా పర్యావరణ యోధులు. వారి జీవన విధానమే పచ్చదనంతో మమేకమై ఉంటుంది. వన్యప్రాణులకు హాని కలిగించిన జీవన విధానం వారి సొంతం. అలాంటి కమ్యూనిలో తొలి ఐఎస్ అధికారిణిగా ఓ మహిళ నిలిచింది. తొలుత సన్యాసిలా జీవించిన అమ్మాయి కాస్త అందరికి పెద్ద షాకిచ్చేలా ఘనంగా పెళ్లి చేసుకుంది. ఎవరామె..? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..
రాజస్థాన్‌లోని అజ్మీర్‌కి చెందిన పరి విష్ణోయ్ బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన తొలి ఐఏస్ అధికారిణిగా నిలిచింది. కేవలం 23 ఏళ్ల వయసుల్లోనే ఈ ఘనత సాధించింది. అయితే ఆమె విజయ తీరాలను అంత సులభంగా చేరుకోలేదు. ఫిబ్రవరి 26, 1996న బికనీర్‌లోని కక్రా గ్రామంలో జన్మించిన పరి బిష్ణోయ్ సంప్రదాయంలోనే పెరిగారు. ఆమె తండ్రి మణిరామ్ బిష్ణోయ్ న్యాయవాది కాగా, తల్లి సుశీలా బిష్ణోయ్ పోలీసు అధికారి. ఆమె ఇంటర్ నుంచి ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది.
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించింది. దీంతోపాటు అజ్మీర్‌లోని ఎండీఎస్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుండేది. అలా ఆ ఒక్క యూపీఎస్సీ తోపాటు సంబంధిత పోటీ పరీక్షలన్నీ రాసింది. అలా పరి యూజీసీ నెట్ జెఆర్‌ఎఫ్ పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించింది.
అయితే సివిల్స్ ఎగ్జామ్ తొలి రెండు ప్రయత్నాలలో పరి ఘోరంగా విఫలమైంది. మూడో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకుంది. ఇక పరి తన జీవన శైలి అచ్చం సన్యాసిని పోలి ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అంతేగాదు ఆమె చూడటానికి కూడా చాలా వైరాగ్యంగా ఉన్నట్లుగా ఆహార్యం ఉండేది. అయితే అందరికీ షాక్ ఇస్తూ..2023లో పరి విష్ణోయ్ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకున్నారు.
ఇక ఆమె భర్త భవ్య హర్యానాలోని అడంపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. భవ్య బిష్ణోయ్ తండ్రి, కుల్దీప్ బిష్ణోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇరువురు తమ కెరీర్‌లలో ఉన్నత శిఖరాలను చేరుకునేలా శ్రమిస్తున్నారు. తొలుత 2022లో సహజవాయువు మంత్రిత్వశాఖ(Ministry of Natural Gas)లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసింది. ఆ తర్వాత గ్యాంగ్‌టక్(Gangtok)లో ఎస్‌డీఎంగా పనిచేసింది. ప్రస్తుతం హార్యానాలో సేవలందిస్తోంది.
(చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!)
Comments
Please login to add a commentAdd a comment