బైజు రవీంద్రన్, దివ్య గోకుల్‌నాథ్ ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ సహ వ్యవస్థాపకులు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత బైజూస్ సంస్థను స్థాపించారు. ఇప్పుడా కంపెనీ విలువ 23 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 1.9 లక్షల కోట్లు. రవీంద్రన్ తన భార్య గురించి సీక్రెట్ బయటపెట్టారు.
ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే..
తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్ సెషన్‌లో బైజు రవీంద్రన్.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న దివ్య తన స్టూడెంటేనని వెల్లడించారు. ఆమెతో తాను ఎలా ప్రేమలో పడిందీ వివరించారు. ఆమె తరచూ ప్రశ్నలు అడిగేదని, అలా తనను ఆకర్షిందని చెప్పారు. అది ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియదని, తాము భార్యాభర్తలు అయిపోయామని పేర్కొన్నారు. బైజు రవీంద్రన్, దివ్య గోకుల్‌నాథ్‌ల వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఐఫోన్!
2012లో స్థాపించిన ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇప్పుడు అత్యంత విజయవంతమైన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం బైజూస్ మార్కెట్ విలువ 23 బిలియన్ డాలర్లు. బైజూస్ సీఈవోగా రవీంద్రన్ వ్యవహరిస్తుండగా, దివ్య గోకుల్‌నాథ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment