భారతీయ అమెరికన్‌కు యూఎస్‌ బ్యాన్‌కార్ప్‌ పగ్గాలు  | Gunjan Kedia becomes US Bancorp First Indian American CEO | Sakshi
Sakshi News home page

భారతీయ అమెరికన్‌కు యూఎస్‌ బ్యాన్‌కార్ప్‌ పగ్గాలు 

Jan 31 2025 6:06 AM | Updated on Jan 31 2025 8:24 AM

Gunjan Kedia becomes US Bancorp First Indian American CEO

సీఈవోగా గుంజన్‌ కేడియా 

హ్యూస్టన్‌: ఫైనాన్షియల్‌ సర్విసుల్లో ఉన్న యూఎస్‌కు చెందిన యూఎస్‌ బ్యాన్‌కార్ప్‌ తదుపరి సీఈవోగా గుంజన్‌ కేడియా నియమితులయ్యారు. తద్వారా కంపెనీకి నాయకత్వం వహించనున్న మొదటి భారతీయ అమెరికన్‌గా నిలిచారు. యూఎస్‌లోని అతిపెద్ద ఆర్థిక సంస్థలలో యూఎస్‌ బ్యాన్‌కార్ప్‌ ఒకటి. ఏప్రిల్‌ 15న జరిగే వార్షిక వాటాదారుల సమావేశం తర్వాత ఆమె కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే డైరెక్టర్ల బోర్డులో కూడా చేరనున్నారు. 

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా పదవి స్వీకరించనున్న ఆండీ సెసిరీ స్థానాన్ని 54 ఏళ్ల కేడియా భర్తీ చేస్తారు. ఢిల్లీకి చెందిన గుంజన్‌ 2016 నుండి యూఎస్‌ బ్యాన్‌కార్ప్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. స్టేట్‌ స్ట్రీట్‌ ఫైనాన్షియల్, బీఎన్‌వై మెలన్, మెకిన్సీ అండ్‌ కంపెనీ, పీడబ్ల్యూసీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ బాధ్యతలను నిర్వహించారు. న్యూ యార్క్‌కు చెందిన మ్యాగజీన్‌ అమెరికన్‌ బ్యాంకర్‌ ప్రకటించిన బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జా బితాలో ఏడుసార్లు చోటు సంపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement