Gunjan
-
నటుడితో జాన్వీ స్టెప్పులు.. అనిల్ కపూర్‌కు అంకితం
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్ని అందిపుచ్చుకున్నారు. నటనతోపాటు జాన్వీ కపూర్ మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే. పలుసార్లు ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె నటించిన గుంజన్ సక్సేనా చిత్రంలో జాన్వీకి సోదరుడిగా నటించిన అంగద్ బేడీతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ వీడియోను అంగద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం షేర్ చేశారు. ‘‘ఎవరూ చూడని డ్యాన్స్. అనిల్ కపూర్ సర్.. ఈ పాట మీకు అంకితం. మా చిత్రం గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ నుంచి రిహార్సల్ దృశ్యం’ అంటూ పోస్టు చేసిన ఈ వీడియోలో వీరిద్దరూ అనిల్ కపూర్ సూపర్ హిట్ పాట 2మై నేమ్ ఈజ్ లఖన్’ అనే పాటకు డ్యాన్స్ చేశారు. (మా పిల్లలు ప్రతిభావంతులు) కాగా ‘గుంజన్ సక్సేనా’ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. ప్రస్తుతం జాన్వీ ‘తఖ్త్’ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్లో విజయవంతమైన నిర్మాతగా పేరుపొందిన కరణ్ జోహర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణ్వీర్ సింగ్, అలియా భట్, కరీనా కపూర్, అనిల్ కపూర్, భూమి పడ్నేకర్, జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2021 డిసెంబర్లో క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. మొగలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. (పర్ఫెక్ట్ స్టెప్పులతో ఇరగదీసిన జాన్వీ) View this post on Instagram Dance like nobody’s watching.. @anilskapoor sir this is a tribute to you. Rehearsal scene from our film #gunjansaxenathekargilgirl when gunjan expresses”dada main pilot ban na chahti hoon”. #dhinakdhindha #rampampam my #mondaymotivation 🥳😉 #dance A post shared by ANGAD BEDI (@angadbedi) on Sep 20, 2020 at 11:42pm PDT -
‘లోలోపల భయంగా ఉన్నా.. పైకి నవ్వేదాన్ని’
‘‘గాల్లో వేలాడే హైడ్రాలిక్ నిచ్చెనకు జత చేసి ఉన్న ఓ చిన్న బాస్కెట్లో కూర్చుని దాదాపు ఏడెనిమిది అంతస్తుల పైనుంచి కిందకు వేలాడాలి. నిజానికి నాకు ఎత్తు నుంచి కిందకు చూస్తే చాలా భయం. అయితే అంతా బాగానే ఉందని చెప్పేందుకు, భయాన్ని దాచి ఉంచేందుకు పైకి నవ్వుతూ కనిపించేదాన్ని. చేయలేనని తప్పించుకోవడం సరైన పద్ధతి కాదు. అందుకే ముందుగా దేవుడిని ప్రార్థించి, నా పనిని పూర్తి చేసేదాన్ని. మహిళలపై శక్తి సామర్థ్యాలపై ఎవరూ వేలెత్తిచూపకుండా , ఎలాంటి బాధ్యతలు అప్పగించినా మేం సమర్థవంతంగా నెరవేరుస్తామని నిరూపించేందుకు ఇలా నా వంతు కృషి చేసేదాన్ని. అంతేకాదు టాస్క్ మొదలయ్యే సమయాని కంటే ఐదూ, పది నిమిషాల ముందే అక్కడికి చేరుకునేదాన్ని. నిజానికి ఆలస్యం చేసింది అనుపమ అయినా.. ఎవరూ నా పేరెత్తకుండా ఓ మహిళా అధికారి వల్లే ఇంత జాప్యం అంటారు కదా. ఆ మాట రాకుండా చూసుకునేదాన్ని’’ అంటూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ వింగ్ కమాండర్ అనుపమా జోషి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.(స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?) భారత వైమానిక దళంలో 1994లో శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి మహిళా బ్యాచ్‌లో ఆమె కూడా ఒకరు. ‘డర్టీ 12’(తమ బ్యాచ్‌కు వాళ్లు పెట్టుకున్న పేరు)గా పేరొందిన పన్నెండు మంది మహిళా అధికారుల్లో ఆమె ఫైర్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. అనేక సవాళ్లను ఎదుర్కొని తన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఓ జాతీయ మీడియాతో తన అనుభవాలు పంచుకున్న అనుపమ మాటల్ని బట్టి.. గుంజన్ సక్సేనా బయెపిక్‌లో చూపించినట్లుగా ఐఏఎఫ్‌లో లింగ వివక్ష ఉందన్న విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కార్గిల్ గర్ల్‌గా గుర్తింపు పొందిన గుంజన్ సక్సేనా బయోపిక్‌లోని కొన్ని సన్నివేశాల పట్ల ఐఏఎఫ్తో పాటు, కార్గిల్ వార్‌లో పాల్గొన్న పైలట్ శ్రీ విద్యారాజన్ కూడా ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు పంచుకున్న శ్రీవిద్య.. తొలిసారి తాము విధుల్లో చేరినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనని.. అయితే మొదట్లో తమ శక్తిసామర్థ్యాలపై సందేహాలు వ్యక్తం చేసిన పురుష ఉద్యోగులే.. ఆ తర్వాత తమను అంగీకరించారని తెలిపారు. అంతేకాక ప్రారంభంలో తమకు ప్రత్యేక సదుపాయాలేమీ లేవని, అంతేగాక శిక్షణలో చేసిన తప్పులను ప్రత్యేకంగా ఎత్తిచూపేవారని గుర్తు చేసుకున్నారు. కానీ కానీ సినిమాలో చూపించినట్లుగా తమను అవమానించడం.. సామార్థ్యాన్ని కించపర్చడం లాంటివి చేసేవారు కాదని స్పష్టం చేశారు. అదే విధంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళా పైలెట్ తానేనని.. కానీ సినిమాలో మాత్రం కేవలం గుంజన్కే మొదటి పోస్టింగ్ ఇచ్చినట్లు చూపించడం సరికాదని అభిప్రాయపడ్డారు. (మొదటి కార్గిల్ గర్ల్ నేనే: శ్రీవిద్య రాజన్) అంతేగాక సినిమాలో ఐఏఎఫ్‌ను తక్కువ చేసి చూపించడం పట్ల ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఏదేమైనా గుంజన్ జీవితం యువతకు స్పూర్తిదాయకమని, ఒకసారి సినిమా చూసి, మార్పులు చేసిన తర్వాత విడుదలకు అంగీకరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీంతో మూవీ క్రియేటర్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లుతున్నాయి. స్ఫూర్తిమంతమైన ఒక మహిళా అధికారి జీవిత చరిత్రలోని అంశాలకు కల్పనలు జోడించి ఐఏఎఫ్ ప్రతిష్టను మసకబార్చడం ఎంతమాత్రం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, సినిమాను ఓటీటీలో విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు ఐఏఎఫ్ లేఖ రాయడం చర్చకు దారి తీసింది. స్పూర్తిని నింపాల్సిన చిత్రానికి సంబంధించిన ట్రైలర్లో ఐఏఎఫ్‌ను చెడుగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ఎన్నడూ లింగ వివక్ష చూపలేదని, ఆడ, మగ అందరికి సమాన అవకాశాలు కల్పించిందని స్పష్టం చేసింది. దీంతో ఐఏఎఫ్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న నిర్మాత కరణ్ జోహార్.. లింగ వివక్షను ప్రతిబింబించేలా ఉన్న సీన్లను తొలగిస్తామని మాట ఇచ్చారని, అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఆఫీసర్ వెల్లడించగా.. తోటి మహిళా ఉద్యోగుల పట్ల తాము ఎన్నడూ వివక్ష చూపనప్పటికీ తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సినిమాలో చూపించడం సరికాదని మరో ఆఫీసర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గుంజన్ మాత్రం సినిమా విషయంలో రచయితలు వాస్తవ ఘటనలకు కాస్త సృజనాత్మకత జోడించి స్వేచ్చను తీసుకున్నందు వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా వాస్తవాలు చూపిస్తూనే, మరింత ఇన్సిపిరేషనల్గా సినిమాను తెరకెక్కించి ఉండాల్సిందని మెజారిటి సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాకు ముందు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చిన జాన్వీ, దర్శకుడు శరణ్ శర్మ ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉండటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కాగా ఆగష్టు 12న గుంజన్ సక్సేనా సినిమా ఓటీటీలో విడుదలైంది. -
మొదటి కార్గిల్ గర్ల్ నేనే: శ్రీవిద్య రాజన్
కార్గిల్ గర్ల్‌గా పేరు సంపాదించుకున్న గుంజన్ సక్సెనా బయోపిక్‌పై విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. సినిమాలోని కొన్ని సన్నివేశాల పట్ల ఐఏఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజగా గుంజన్ సక్సెనా సహోద్యోగి శ్రీవిద్య రాజన్ కూడా చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె కూడా 1999 కార్గిల్ యుద్ధ సమయంలో గుంజన్‌తో కలిసి ఐఏఎఫ్‌లో హెలికాప్టర్ పైలట్‌గా పని చేశారు. తాజాగా శ్రీవిద్య ఫేస్బుక్ వేదికగా గుంజన్ సక్సెనా చిత్రంపై తన అభ్యంతరాలను తెలిపారు. అప్పటివరకు కేవలం పురుషులే ఉన్న రంగంలో తొలిసారి తాము చేరినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అన్నారు. సహచర మగ ఉద్యోగులు కొందరు తాము అసలు ఈ రంగంలో ఎలా ఉంటామా అని అనుమానంగా చూశారని.. కానీ చాలా కొద్ది సమయంలోనే వారు తమను అంగీకరించారని శ్రీవిద్య తెలిపారు. అంతేకాక ప్రారంభంలో తమకు ప్రత్యేకంగా టాయిలెట్స్ కానీ, డ్రెస్ మార్చుకునే రూములు కానీ లేవని వెల్లడించారు. అలానే శిక్షణలో తాము చేసే కొన్ని తప్పులను ప్రత్యేకంగా ఎత్తి చూపేవారని.. సరిదిద్దుకునే వరకూ ఊరుకోకపోయేవారన్నారు శ్రీవిద్య. ఇవే తప్పులు మగ ఉద్యోగులు చేస్తే పెద్దగా పట్టించుకునే వారు కాదన్నారు. అలానే 1996లో తనకు, గుంజన్‌కు ఇద్దరికి ఉధంపూర్‌లో పొస్టింగ్ ఇచ్చారని.. కానీ సినిమాలో మాత్రం గుంజన్‌ను మాత్రమే ఉధంపూర్ పంపించినట్లు తప్పుగా చూపించారని తెలిపారు. అంతేకాక సినిమాలో చూపించినట్లు చిన్న చిన్న సిల్లీ రీజన్ల వల్ల తమ బాధ్యతలు ఎప్పుడు పోస్ట్‌పోన్ కాలేదన్నారు. ఎంతో అనుభవం, నైపుణ్యం కల స్క్వాడ్రన్ కమాండర్లు తమకు శిక్షణ ఇచ్చేవారని తెలిపారు. ఆడ, మగ ఎవరూ తప్పు చేసినా ఒకేలాంటి శిక్ష విధించేవారన్నారు. అంతేకానీ సినిమాలో చూపించినట్లు అవమానించడం.. సామార్థ్యాన్ని కించపర్చడం లాంటివి చేసేవారు కాదన్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళా పైలెట్ తానే అన్నారు శ్రీ విద్య. కార్గిల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు తొలుత తాను ఉధంపూర్ వెళ్లానని.. తరువాత గుంజన్ తన టీంతో కలిసి శ్రీనగర్ వెళ్లిందన్నారు శ్రీవిద్య. అప్పుడు తాము అన్ని విభాగాల్లో విధులు నిర్వహించామని తెలిపారు శ్రీ విద్య. (ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ) సినిమా క్లైమాక్స్‌లో వచ్చిన సీన్లు పూర్తిగా అబద్దం అన్నారు శ్రీవిద్య. అలాంటి సినిమాటిక్ సీన్లు కేవలం మూవీస్‌లో మాత్రమే ఉంటాయని.. వాస్తవంగా ఎన్నటికి జరగవన్నారు. గుంజన్ సక్సెనా తన కెరీర్లో ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తే.. యువతకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. కానీ సినిమాలో కొన్ని చోట్ల మహిళలని కించపర్చడం.. ఐఏఎఫ్‌ను తక్కువ చేసి చూపడం తనకు నచ్చలేదన్నారు. మహిళా పైలెట్లుగా తమను ఎంతో గౌరవ మర్యాదలతో చూశారని తెలిపారు. గుంజన్ ఒకసారి వీటన్నింటి పరిశీలించి.. మార్పులు చేసిన తర్వాత సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుండేదన్నారు శ్రీవిద్య. కార్గిల్ యుద్ధంలో మగ ఆఫీసర్లు తమకంటే ఎక్కువే కష్టపడ్డారని.. కానీ వారు ఎలాంటి గుర్తింపు కోరుకోవడం లేదన్నారు శ్రీవిద్య. తమకు లభించిన ఈ గుర్తింపు కూడా కేవలం జండర్ ఆధారంగానే లభించిందన్నారు. అయితే భద్రతాదళాల్లో సేవ చేసినప్పుడు ఆడ, మగ అనే తేడా ఉండదన్నారు. యూనిఫామ్ వేసుకుంటే ప్రతి ఒక్కరూ ఆఫీసర్ మాత్రమే అని తెలిపారు శ్రీవిద్య. (స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?) శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, గుంజన్ సక్సెనా పాత్రలో నటించిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహంచారు. థియేటర్లో విడుదల చేయాల్సి ఉన్నప్పటికి లాక్డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయిన సంగతి తెలిసిందే. -
స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?
దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. స్త్రీకి స్వాతంత్య్రం వచ్చిందా? కలలు కనడానికి. కెరీర్‌ను నిర్మించుకోవడానికి. పంజరాలను బద్దలు కొట్టడానికి. స్వేచ్ఛాభావనలు వికసించడానికి. నిరోధాల బెదురు లేకుండా జీవించడానికి. వీటన్నింటి కోసం మగాళ్ల అనుమతికి ఎదురుచూస్తూ ఉండాలా? మగాళ్ల పర్మిషన్ కావాలా? అక్కర్లేదు అని చెప్పే స్ఫూర్తిదాతలు చాలామంది ఉన్నారు. గుంజన్ సక్సెనా అలాంటి స్ఫూర్తిదాత. ఆమెపై వచ్చిన సినిమా ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్త్రీలకు అందిన కానుక. ‘అన్నయ్యా... పెద్దయ్యాక నేను పైలెట్ అవుతా’ ‘పైలెట్ అవుతావా? ఇదిగో ఈ గిన్నె పట్టుకో. నువ్వు చేయాల్సిన పని కూర వడ్డించమంటారా? పప్పు వడ్డించమంటారా అని అడగడమే. ముందు అది నేర్చుకో’ చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో మగపిల్లల బుర్రల్లో ఎక్కించే భావజాలం ఇది. పెద్దయ్యాక ఇది మగభావజాలం అవుతుంది. సమాజ భావజాలం అవుతుంది. చివరకు దేశభావజాలంగా మారి స్త్రీలపై పెత్తనం చలాయిస్తుంది. ఆడపిల్లలు విమానం ఎగరేయకూడదా? రైట్‌బ్రదర్స్ విమానాన్ని పూర్తిస్థాయిలో కనిపెట్టినప్పుడు దాని యోక్ (కంట్రోల్ వీల్) కేవలం పురుషులను ఉద్దేశించే తయారు చేసి ఉంటారా? పదేళ్ల బాలికగా గుంజన్ సక్సెనా పెద్దయ్యి పైలెట్ అవ్వాలి అనుకున్నప్పుడు సోదరుడు ప్రదర్శించిన హేళనను తండ్రి ఖండిస్తాడు. ‘విమానాన్ని స్త్రీ ఎగరేసినా పురుషుడు ఎగరేసినా ఎగరేసేవారిని పైలెట్ అనే అంటారు. విమానానికి ఈ వ్యత్యాసం లేనప్పుడు మనమెందుకు వ్యత్యాసం పాటించడం?’ అంటాడు. నిజజీవితంలో గుంజన్ సక్సెనా కథకు, సినిమాలో గుంజన్ సక్సెనా కథకు ఇక్కడి నుంచే మొదలు. నిజం కథ గుంజన్ సక్సెనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా విశేష సేవలందించిన తొలి మహిళా పైలెట్లలో ఒకరు. లక్నోకు చెందిన గుంజన్ ఢిల్లీలో చదువుకుంది. 1994లో తొలిసారి మహిళా ట్రైనీస్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రవేశం కల్పించినప్పుడు 25 మంది బ్యాచ్‌లో ఒకరిగా ఎంపికైంది. ట్రయినింగ్ పూర్తయ్యాక ఉధమ్‌పూర్ (జమ్ము–కాశ్మీర్) ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తదుపరి శిక్షణకు వస్తుంది. అక్కడ ఆమెకు అంతవరకూ అలవాటై ఉన్న పురుషావరణ ధోరణిలో అడ్జెస్ట్ అవడానికి టైమ్ పడుతుంది. నిజం చెప్పాలంటే అంతవరకూ అక్కడకు రాని మహిళలను ఎలా అర్థం చేసుకోవాలో వారితో ఎలా వ్యవహరించాలో పురుష ఆఫీసర్లకు తెలియదు. చివరకు గుంజన్ సక్సెనా విశేష ప్రతిభ కనబరిచి ఫ్లయింగ్ ఆఫీసర్ అవుతుంది. 1999లో వచ్చిన కార్గిల్ వార్ ఆమె సామర్థ్యానికి ఒక సవాల్. యుద్ధంలో గాయపడిన, మృతి చెందిన సైనికులను హెలికాప్టర్ ద్వారా తెచ్చే బాధ్యత గుంజన్ది. ఇది ప్రమాదకరం. ముష్కరులు హెలికాప్టర్‌ను పేల్చేయొచ్చు కూడా. కాని కార్గిల్‌వార్ జరిగిన 2 నెలల 3 వారాల్లో గుంజన్ లెక్కకు మించిన ఆపరేషన్స్‌లో పాల్గొని దాదాపు 900 మందికి పైగా సైనికులను తిరిగి బేస్‌కు చేర్చింది. అందుకే ఆమె ‘కార్గిల్ గర్ల్’ అయ్యింది. కార్గిల్ వార్‌లో పని చేసిన ఏకైక మహిళ ఆమె. 2004లో పదవీవిరమణ చేసింది. సినిమా కథ గుంజన్ సక్సెనా జీవితం ఆధారంగా తీసిన సినిమా కొత్త ఆలోచనలు చేసే స్త్రీలకు పురుష కేంద్రక సమాజంలో ఎదురయ్యే అవరోధాలను గాఢంగా చర్చించింది. స్త్రీలను పురుష సమాజం రెండు విధాలుగా అడ్డుకుంటుంది. ఒకటి ప్రొటెక్టివ్ కన్సర్న్తో. రెండు చులకనభావంతో. ఈ సినిమాలో గుంజన్ సోదరుడు ‘నీకేమైనా అయితే? నీకెందుకు ఇదంతా? నువ్వు డేంజర్లో పడతావ్?’ లాంటి ‘ప్రేమకట్టడి’తో నిరోధించడానికి చూస్తాడు. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ‘నువ్వు బలహీనురాలివి. ఇక్కడ దుర్బలులకు చోటు లేదు. అసలిది స్త్రీలు చేయాల్సిన పని కాదు’ అని చులకన భావంతో నిరోధిస్తారు. అయితే మగవాళ్లలో కూడా మంచి మగవాళ్లు ఉంటారు. గుంజన్ సక్సెనాకు తండ్రి మద్దతు చాలా ఉంటుంది. ఆమెకు అతడు ప్రతిక్షణం సపోర్ట్ చేస్తాడు. ‘కష్టాన్ని నమ్ముకున్నవారికి విజయం ద్రోహం చేయదు’ అంటాడతను. ఎయిర్‌ఫోర్స్‌ను అర్ధంతరంగా వదిలిపెట్టి ‘పెళ్లి చేసుకొని సెటిలవుతాను’ అని గుంజన్ అన్నప్పుడు ‘సమాజమంతా స్త్రీని వంటగదికి సెటిల్ చేయాలని చూస్తోంది. నువ్వు కూడా వారిలో చేరతావా?’ అని కర్తవ్యాన్ని ప్రేరేపిస్తాడు. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో కూడా ఒక సీనియర్ ఆఫీసర్ ఆమెకు మద్దతుగా నిలుస్తాడు. ఆమెకు తర్ఫీదు ఇస్తాడు. ఎగిరే చిరుతలా తీర్చిదిద్దుతాడు. నకిలీ మగతనం స్త్రీని గౌరవించడం, స్త్రీని పై అధికారిగా స్వీకరించడం, స్త్రీకి సెల్యూట్ చేయడం వల్ల మగవారి తలపాగలు ఊడి కిందపడవు... దాని వల్ల వారి మగతనానికి ఏమీ ఢోకా రాదు అని ఈ సినిమా స్టేట్మెంట్ ఇస్తుంది. ‘నన్ను మీరంతా ఎందుకు నిరోధిస్తున్నారో నాకు తెలుసు. నేను ఆఫీసర్ అయితే సెల్యూట్ చేయాల్సి వస్తుందని మీ భయం. చేస్తే ఏమవుతుంది? అలా చేస్తే పోయే మగతనం నకిలీ మగతనం’ అని గుంజన్ ఒకచోట అంటుంది. బండి మీద ఒంటరిగా వెళ్లే యువతులను చున్నీ లాగి కిందపడేసే ఈ రోజుల్లో కూడా స్త్రీలను గౌరవించడం, స్త్రీ ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని చెప్పడం పదే పదే చేయాల్సి వస్తుంది. అందుకు గుంజన్ సక్సెనా కూడా ఒక సమర్థమైన సినిమా రూపం. గుంజన్‌గా జాన్హీ్వ కపూర్ ప్రశంసాత్మకంగా చేసింది. స్త్రీలకు ఎవరూ స్వాతంత్య్రం ఇవ్వాల్సిన పని లేరు. అది వారి హక్కు. అందరిలాగే వారు తమ స్వేచ్ఛా స్వాంతత్య్రాలను పొందగలరు. నిభాయించుకోగలరు. పురుషులు చేయాల్సింది అందుకు నిరోధంగా నిలబడకపోవడం. జెండా వందనానికి అందరం తల ఎత్తుతాం. స్త్రీలు కూడా స్వేచ్ఛగా తల ఎత్తే సకల సాంఘిక, సామాజిక, కౌటుంబిక ఆవరణాలలోకి ఈ దేశం పయనించాలని ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆశిద్దాం. ‘గుంజన్ సక్సెనా’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. – సాక్షి ఫ్యామిలీ -
స్ఫూర్తి నింపుతున్న జాన్వీ సినిమా ట్రైలర్
కార్గిల్ యుద్ధంలో విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎంత బాగుందో, ఎంత మందిలో స్ఫూర్తి నింపుతుందో అనడానికి ఈ ట్రైలర్లో ఉండే ఒక్క డైలాగ్ చాలు. ‘నేను దీన్ని చేయగలను’ అని చెప్పడం ద్వారా మీరు గౌరవం సంపాదించరు, మీరు మీ తలని కిందికి ఉంచి, చేయడం ద్వారా సంపాదించగలరు’. ఈ సినిమాలో జాన్వీ కపూర్ గుంజన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ చాలా ప్రొఫెషనల్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో విమానం నడపాలి అనే ఆసక్తి ఉన్న అమ్మాయిని సమాజం ఎలా నిరుత్సాహాపరుస్తుంది. వాటిని అధిగమించి ఆమె ఎలా తన కలని నెరవేర్చుకుంటుంది అనేది చాలా అద్భుతంగా చూపించారు. అదేవిధంగా భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధం కార్గిల్ వార్‌లో విమానం నడిపిన మొదటి మహిళగా గుంజన్ రికార్డు సంపాదించారు. తన పనితో అమ్మాయిలు బలహీనులు కఠినమైన పనులు చేయలేరు అని చెప్పిన వారికి తన సత్తా చూపించారు. పనిచేసే చోట మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ సినిమాలో చూపించినట్లు అర్థం అవుతుంది. పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో జాన్వి తండ్రిగా నటించారు. కూతురును వెన్నుతట్టి ప్రోత్సహించే తండ్రిగా ఆయన ఈ సినిమాలోనటించారు. ‘ ఒక స్త్రీ లేదా పురుషుడు విమానం నడుపుతుంటే వారిని పైలెట్ అనే పిలుస్తారు’ అని ఆయన చెప్పే డైలాగ్ భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టులో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంగద్ బేడి, వినీత్ కుమార్, మానవ్ విజ్ , అయేషా రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రం గురించి పంకజ్ మాట్లాడుతూ, “నాకు ఈ పాత్ర చాలా నచ్చింది. ఈ చిత్రం షూటింగ్లో నేను చాలా ఆనందించాను. జాన్వీ చాలా నిజాయితీ గల నటి. ఆమె నన్ను చాలా గౌరవిస్తుంది, నాకు కూడా ఆమె పని పట్ల చిత్తశుద్ధి ,నిబద్ధత కలిగి వుండటం చూసి చాలా గౌరవం పెరిగింది. శరణ్ చాలా ప్రతిభావంతుడైన దర్శకుడు’ అని పేర్కొన్నారు. చదవండి: ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ -
ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ
బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తున్నారు. సక్సేనా తొలి మహిళా భారతీయ వైమానిక దళ పైలట్. ఈ పాత్ర కోసం ఆమె కొంత సమయాన్ని గుంజన్ సక్సేనాతో గడిపారు. ఆ పాత్ర గురించి తెలుసుకుంటూ తాను నేర్చుకున్న కొన్ని విషయాలను జాన్వీ కపూర్ మీడియాతో వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ వైమానిక దళ పైలట్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం నేను సక్సేనాతో చాలా సమయం ఉన్నాను. మనం కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించవచ్చు. గుంజన్ చాలా సింపుల్‌గా ఉన్నారు. కష్టపడి పనిచేస్తే ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది. నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలుసు. నాకు ఆ విషయంలో గిల్టీగా ఉంది. నేను చేయగలిగింది ఒక్కటే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసి నా స్థానాన్ని సంపాదించుకోవాలి’ అని జాన్వీ కపూర్ తెలిపారు. చదవండి: అడవిలో హీరోయిన్ జీవిత పాఠాలు అంతే కాకుండా సమాజంలో ఉన్న లింగ వివక్షను ఎదిరించి సక్సేనా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారని, ఆమె ఎంతోమందికి ఆదర్శమని జాన్వీ కపూర్ అన్నారు. ఇక జాన్వీతో పాటు సక్సేనా కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, తాను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులను పంచుకున్నారు. ‘వాష్‌రూమ్స్, డ్రస్సింగ్ రూమ్స్ వంటివి లేకపోవడం ఒక సమస్య అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే మనుషుల ఆలోచనలను అధిగమించడం, నన్ను ఒక ప్రొఫెషనల్‌గా చూసేలా చూడటం. ఒక మహిళా అధికారిణిలా కాకుండా నన్ను ఒక అధికారిలా చూసేలా చేయడం అన్నింటి కంటే ముఖ్యం, అది చాలా కష్టమైన పని కూడా’ అని అన్నారు. ఇక ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఆగస్టు 12న విడుదల అవుతుంది. చదవండి: ఆ కథనంపై చలించిన సోనూసూద్ -
భార్య కంటే కత్తి మంచిది
‘ఏడుచేపల కథ’ చిత్రంలో టెంప్ట్ రవిగా క్రేజ్ సంపాదించుకున్న అభిషేక్ రెడ్డి, గుంజన్ జంటగా నటించిన చిత్రం ‘వైఫ్,ఐ’. ‘నైఫ్ బెటర్ దెన్ వైఫ్’(భార్య కంటే కత్తి మంచిది) అన్నది ఉపశీర్షిక. ‘అంతం’ ఫేమ్ జి.ఎస్.ఎస్.పి.కల్యాణ్ దర్శకత్వంలో లక్ష్మి చరిత ఆర్ట్స్– జిఎస్ఎస్పికె స్టూడియోస్ పతాకాలపై జి.చరితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. జి.ఎస్.ఎస్.పి కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నా గత చిత్రం ‘అంతం’ కమర్షియల్‌గా చాలా మంచి విజయాన్ని సాధించింది. మంచి కథ కోసమే ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. సమాజంలో జరుగుతున్న ఒక మంచి పాయింట్‌ని ‘వైఫ్, ఐ’ చిత్రంలో చాలా వినోదాత్మకంగా చూపించాం. భార్యాభర్తల మధ్య ఉండే అన్ని బంధాలు ఇందులో ఉంటాయి. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన మా చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలువుతాయి’’ అన్నారు. జి.చరితా రెడ్డి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ చెప్పిన కథ విన్నవెంటనే ఓకే చేశాను. ఎందుకంటే.. ఇలాంటి కథలు ఈ జెనరేషన్లోనే రావాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ పోయి అసూయ పెరుగుతోంది.. వైవాహిక జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వీటికి కారణం ఏంటని తెలుసుకోలేకపోతున్నారు. మా చిత్రంలో ఆ విషయాన్నే ప్రస్తావించాం. ప్రతి మనిషీ తప్పులు చేస్తారు.. ఆ తప్పు ఏంటో తెలుసుకున్న నాడు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని చూపిస్తున్నాం’’ అన్నారు. కావ్య, సునీల్ నగరం, సూర్య ఆకోండి, మహేష్ విట్ట, అపర్ణ నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య. -
ఏ ‘డీ’తో జోడీ
‘ధడక్’తో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులతో మంచి మార్కులే వేయించుకున్నారు జాన్వీ కపూర్. ఆ సినిమాతో జాన్వీని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శక–నిర్మాత కరణ్ జోహార్, జాన్వీ రెండో చిత్రాన్నీ కూడా నిర్మిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గుంజన్ సక్సెన్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో గుంజన్ సక్సెన్ పాత్రను పోషించనున్నారు జాన్వీ కపూర్. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు యాక్ట్ చేస్తారన్నది ఈ మధ్య బాలీవుడ్లో హాట్‌టాపిక్. ఇందులో హీరోగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేదా మలయాళీ యువ హీరో దుల్కర్ సల్మాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ బాలీవుడ్లో ఎంట్రీæ(కార్వాన్) ఇచ్చి, సెకండ్ మూవీ (జోయా ఫ్యాక్టర్)లో నటిస్తున్నారు దుల్కర్. ఈ హీరోతో కరణ్ ప్రొడక్షన్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఓ సినిమా చేయనున్నట్లు టాక్. మరోవైపు టాలీవుడ్ హీరోలలో విజయ్ నటనకు ఫ్యాన్ అయ్యానని కరణ్ జోహార్ షోలో పేర్కొన్నారు జాన్వీ. కరణ్ కూడా విజయ్ను బాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు బాలీవుడ్ టాక్. మరి దేవరకొండ, దుల్కర్ ఈ ఇద్దరిలో ఏ డీ (డి ఫర్ దేవరకొండ, దుల్కర్)తో జాన్వీ కపూర్ తన తదుపరి చిత్రంలో జోడీ కడతారో వేచి చూడాలి. వీళ్లిద్దరూ కాకుండా వేరే హీరో సీన్లోకి వస్తారేమో వెయిట్ అండ్ సీ. -
ఒక్కచోట ఇద్దరు... ఒకలా మాత్రం ఉండరు!
ఇద్దరమ్మాయిలు. ఒకరు మహా ఫాస్టు. ఇంకొకరు మరీ మృదువు. ఒకామె పులిపిల్లలా విరుచుకుపడుతుంది. ఇంకొకామె కుక్కపిల్లను చూసినా భయంతో పరుగు పెడుతుంది. ఒకామె జలపాతంలా హుషారుగా ఉంటుంది. ఇంకొకామె మలయ పవనంలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి విభిన్నమైన మనస్తత్వాలు కల రచన, గుంజన్ అనే ఇద్దరమ్మాయిలను ఒక్కచోట చేర్చి తీసిందే ‘సప్నే సుహానే లడక్పన్ కే’. జీ టీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్‌ని అద్భుతమైన సీరియల్ అనడానికి లేదు. అలాగని చెత్తా అనలేం. పాత్రల చిత్రణ బాగుంటుంది. కథ మాత్రం కాస్త కాస్త విసిగిస్తూ ఉంటుంది. అయినా రెండేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతుండటం విశేషమే!