బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తున్నారు. సక్సేనా తొలి మహిళా భారతీయ వైమానిక దళ పైలట్. ఈ పాత్ర కోసం ఆమె కొంత సమయాన్ని గుంజన్ సక్సేనాతో గడిపారు. ఆ పాత్ర గురించి తెలుసుకుంటూ తాను నేర్చుకున్న కొన్ని విషయాలను జాన్వీ కపూర్ మీడియాతో వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ వైమానిక దళ పైలట్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం నేను సక్సేనాతో చాలా సమయం ఉన్నాను. మనం కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించవచ్చు. గుంజన్ చాలా సింపుల్‌గా ఉన్నారు. కష్టపడి పనిచేస్తే ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది. నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలుసు. నాకు ఆ విషయంలో గిల్టీగా ఉంది. నేను చేయగలిగింది ఒక్కటే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసి నా స్థానాన్ని సంపాదించుకోవాలి’ అని జాన్వీ కపూర్ తెలిపారు. చదవండి: అడవిలో హీరోయిన్ జీవిత పాఠాలు
అంతే కాకుండా సమాజంలో ఉన్న లింగ వివక్షను ఎదిరించి సక్సేనా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారని, ఆమె ఎంతోమందికి ఆదర్శమని జాన్వీ కపూర్ అన్నారు. ఇక జాన్వీతో పాటు సక్సేనా కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, తాను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులను పంచుకున్నారు. ‘వాష్‌రూమ్స్, డ్రస్సింగ్ రూమ్స్ వంటివి లేకపోవడం ఒక సమస్య అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే మనుషుల ఆలోచనలను అధిగమించడం, నన్ను ఒక ప్రొఫెషనల్‌గా చూసేలా చూడటం. ఒక మహిళా అధికారిణిలా కాకుండా నన్ను ఒక అధికారిలా చూసేలా చేయడం అన్నింటి కంటే ముఖ్యం, అది చాలా కష్టమైన పని కూడా’ అని అన్నారు. ఇక ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఆగస్టు 12న విడుదల అవుతుంది. చదవండి: ఆ కథనంపై చలించిన సోనూసూద్
Comments
Please login to add a commentAdd a comment