తెలుగులోనూ విడుదలైన హిట్‌ సినిమా రీమేక్‌లో జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor To Play Key Role In Eeram Movie Remake In Bollywood, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

తెలుగులోనూ విడుదలైన హిట్‌ సినిమా రీమేక్‌లో జాన్వీ కపూర్‌

Nov 4 2024 6:57 AM | Updated on Nov 4 2024 10:36 AM

Eeram Movie Remake In Bollywood Will Be Key Role Play Janhvi Kapoor

 దివంగత అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్‌ అన్న విషయం తెలిసిందే. తిను ధడక్‌ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే బాగా పాపులర్‌ అయిన జాన్వి కపూర్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు ఉండడం విశేషం. అయితే సరైన హిట్స్‌ మాత్రం రాలేదని చెప్పాలి. అయితే జాన్వీ కపూర్‌ క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు అలా దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి పలు ఆఫర్స్‌ రావడం మొదలెట్టాయి. దక్షిణాదిలో నటించిన తొలి చిత్రం దేవర. జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటించిన ఈ తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను సాధించింది. 

తాజాగా తెలుగులో మరో స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా తెలుగులో మరో అవకాశం ఈమె కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే కోలీవుడ్‌ దృష్టి జాన్వీ కపూర్‌పై పడినట్టు తాజా సమాచారం. ఇక్కడ ఒక భారీ చిత్రంలో ఈమెను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'ఈరం' (తెలుగులో వైశాలి) చిత్రం హిందీ రీమేక్‌లో నటించే అవకాశం జాన్వీ కపూర్‌ను వరించినట్లు తాజా సమాచారం. తమిళంలో దర్శకుడు శంకర్‌ నిర్మించిన ఈ చిత్రానికి అరివళగన్‌ దర్శకత్వం వహించారు. 

2009లో విడుదలైన ఈ చిత్రం నటుడు ఆది పినిశెట్టి, నంద, సింధు మేనన్‌, శరణ్య మోహన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా 15 ఏళ్ల తర్వాత ఈ చిత్రం హిందీలో రీమేక్‌ కాబోతున్నట్లు అందులో నటి జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది ఈ చితం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్‌ పరమహంస దర్శకుడుగా పరిచయం కానున్నారు. కాగా ఈరం చిత్రాన్ని హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని చేర్పులు మార్పులు చేయగలరా? అని జాన్వీ కపూర్‌ కోరగా అందుకు దర్శక టీం ఓకే చెప్పినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement