ఏ ‘డీ’తో జోడీ | Janhvi Kapoor to play first woman IAF pilot Gunjan biopic | Sakshi
Sakshi News home page

ఏ ‘డీ’తో జోడీ

Published Tue, Dec 11 2018 3:41 AM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM

Janhvi Kapoor to play first woman IAF pilot Gunjan biopic - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌, జాన్వీ కపూర్‌ విజయ్‌ దేవరకొండ

‘ధడక్‌’తో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులతో మంచి మార్కులే వేయించుకున్నారు జాన్వీ కపూర్‌. ఆ సినిమాతో జాన్వీని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్, జాన్వీ రెండో చిత్రాన్నీ కూడా నిర్మిస్తున్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ ఫైలట్‌ గుంజన్‌ సక్సెన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో గుంజన్‌ సక్సెన్‌ పాత్రను పోషించనున్నారు జాన్వీ కపూర్‌. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు యాక్ట్‌ చేస్తారన్నది ఈ మధ్య బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌.

ఇందులో హీరోగా టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ లేదా మలయాళీ యువ హీరో దుల్కర్‌ సల్మాన్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ బాలీవుడ్‌లో ఎంట్రీæ(కార్వాన్‌) ఇచ్చి, సెకండ్‌ మూవీ (జోయా ఫ్యాక్టర్‌)లో నటిస్తున్నారు దుల్కర్‌. ఈ హీరోతో కరణ్‌ ప్రొడక్షన్‌ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ ఓ సినిమా చేయనున్నట్లు టాక్‌. మరోవైపు టాలీవుడ్‌ హీరోలలో విజయ్‌ నటనకు ఫ్యాన్‌ అయ్యానని కరణ్‌ జోహార్‌ షోలో పేర్కొన్నారు జాన్వీ. కరణ్‌ కూడా విజయ్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు బాలీవుడ్‌ టాక్‌. మరి దేవరకొండ, దుల్కర్‌ ఈ ఇద్దరిలో ఏ డీ (డి ఫర్‌ దేవరకొండ, దుల్కర్‌)తో జాన్వీ కపూర్‌ తన తదుపరి చిత్రంలో జోడీ కడతారో వేచి చూడాలి. వీళ్లిద్దరూ కాకుండా వేరే హీరో సీన్లోకి వస్తారేమో వెయిట్‌ అండ్‌ సీ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement