Know Reason Behind Why Boycott Liger Movie Trending On Twitter, Details Inside - Sakshi
Sakshi News home page

#Boycott Liger : విజయ్‌ 'లైగర్‌'కు బాయ్‌కాట్‌ సెగ..  ట్విట్టర్‌లో ట్రెండింగ్‌

Published Sat, Aug 20 2022 11:19 AM | Last Updated on Sat, Aug 20 2022 1:00 PM

Know Reason Behind Why Boycott Liger Movie Trending On Twitter, Details Inside - Sakshi

#బాయ్‌కాట్‌ బాలీవుడ్‌.. ఇండియలో ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌ ఇది. బీటౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఇప్పడు 'లైగర్‌' సినిమాను కూడా తాకింది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న ఈ సమయంలో లైగర్‌కు బాయ్‌కాట్‌ సెగ తగిలింది. దీనికి కరణ్‌జోహార్‌ ఒక కారణమైతే, విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌ మరో కారణంగా తెలుస్తుంది. పూరి కనెక్ట్స్‌తో కలిసి కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మించడంతో లైగర్‌ బాయ్‌కట్‌ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇక మరోవైపు ఓ ఇంటర్వ్యూలో లాల్‌సింగ్‌ చడ్డా బాయ్‌కాట్‌ చేయడంపై విజయ్‌ స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల చాలామంది కార్మికులు నష్టపోతారని కామెంట్స్‌ చేసి అమీర్‌ఖాన్‌కు మద్దతు తెలపడంతో ట్రోలింగ్‌ స్టార్ట్‌ అయ్యింది.

దీనికి తోడు ఓ ప్రెస్‌మీట్‌లో‌ విజయ్‌ దేవరకొండ టేబుల్ మీద కాళ్లు పెట్టి మీడియాకు ఆన్సర్‌ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణాలతో లైగర్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottLigerఅనే ‍హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement