
టాలీవుడ్ రూమర్డ్ కపుల్‌గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొడుతూ తరచూ మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. మధ్య ప్రేమాయణం ఉందని, వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చన్న వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. అయితే వీటిని రష్మక-విజయ్‌లు ఖండించినప్పటికీ రూమర్లకు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా ఈ పుకార్లలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేశాడు నిర్మాత కరణ్ జోహార్.
చదవండి: విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో విజయ్ కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్‌ని అలాగే విజయ్‌ని కూడా రష్మికతో డేటింగ్ రూమర్స్‌పై ఆరా తీయగా.. తను నా డార్లింగ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా కెరీర్ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశా. షూటింగ్‌లో మేం మంచి స్నేహితులమయ్యాం. మేమిద్దరం కెరీర్, జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో మాధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. నిజంగా రష్మిక నా నిజమైన డార్లింగ్. తనంటే నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పడం ఆసక్తిని సంతరించుకుంది.
చదవండి: రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment