కాఫీ విత్ కరణ్ షో ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో టీవీలో మాత్రమే ప్రసారమయ్యే ఈ షో ఇప్పుడు కేవలం ఓటీటీలోనే అందుబాటులో ఉంది. కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీలను తన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు కరణ్. అతడి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నటీనటుల బిక్కమొహం వేసుకుని కూర్చున్న సందర్భాలు కోకొల్లలు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో రౌడీ హీరో విజయ్ దేవరకొండను సైతం కొన్ని అభ్యంతరకర ప్రశ్నలు అడిగి అతడిని ఇబ్బంది పెట్టాడు. అంతేకాదు, అతడి లవ్ లైఫ్ కోసం కూడా ఆరా తీశాడు.
ఎవరితోనైనా లవ్‌లో ఉన్నావా? అన్న ప్రశ్నకు విజయ్ ఏమన్నాడంటే.. 'నేను పెళ్లి చేసుకుని, పిల్లాపాపలతో సంతోషంగా ఉన్న రోజు దీనికి సమాధానం గట్టిగా చెప్తాను. అప్పటివరకు నేను నోరు విప్పి ఎవరి మనోభావాలను కించపరచాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది నటుడిగా నన్ను ప్రేమిస్తారు. గోడలపై నా పోస్టర్లు అతికిస్తారు. ఫోన్ వాల్‌పేపర్ మీద కూడా నా ఫొటోనే ఉంటుంది. నన్ను అంతలా ప్రేమిస్తారు, ఆదరిస్తారు. అలాంటిది నా ప్రేమ గురించి చెప్పి వారి మనసు ముక్కలు చేయలేను' అని బదులిచ్చాడు. కాగా విజయ్, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! అటు రౌడీ హీరో, ఇటు రష్మిక ఇద్దరూ తాము మంచి స్నేహితులం మాత్రమేనని, తమ మధ్యలో ఏదీలేదని స్పష్టం చేసినప్పటికీ కొందరు మాత్రం ఇప్పటికీ వారు ప్రేమికులేనని బలంగా నమ్ముతుండటం గమనార్హం.
చదవండి: అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్
పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా
Comments
Please login to add a commentAdd a comment