నటుడితో జాన్వీ స్టెప్పులు.. అనిల్‌ కపూర్‌కు అంకితం | Janhvi Kapoor And Angad Bedi Danced To Anil Kapoor Song | Sakshi
Sakshi News home page

సహ నటుడితో జాన్వీ స్టెప్పులు.. అనిల్‌ కపూర్‌కు అంకితం

Published Mon, Sep 21 2020 6:00 PM | Last Updated on Mon, Sep 21 2020 6:30 PM

Janhvi Kapoor And Angad Bedi Danced To Anil Kapoor Song - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్ని అందిపుచ్చుకున్నారు. నటనతోపాటు జాన్వీ కపూర్‌ మంచి డాన్సర్‌ అన్న విషయం తెలిసిందే. పలుసార్లు ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియోలను సోషల్‌‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె నటించిన గుంజన్‌ సక్సేనా చిత్రంలో జాన్వీకి సోదరుడిగా నటించిన అంగద్‌ బేడీతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ వీడియోను అంగద్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం షేర్‌ చేశారు. ‘‘ఎవరూ చూడని డ్యాన్స్‌. అనిల్ కపూర్ సర్‌.. ఈ పాట మీకు అంకితం. మా చిత్రం గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ నుంచి రిహార్సల్ దృశ్యం’ అంటూ పోస్టు చేసిన  ఈ వీడియోలో వీరిద్దరూ అనిల్‌ కపూర్‌ సూపర్‌ హిట్‌ పాట 2మై నేమ్‌ ఈజ్‌ లఖన్‌’ అనే పాటకు డ్యాన్స్‌ చేశారు. (మా పిల్లలు ప్రతిభావంతులు)

కాగా ‘గుంజన్‌ సక్సేనా’ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. ప్రస్తుతం జాన్వీ ‘తఖ్త్‌’ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో విజయవంతమైన నిర్మాతగా పేరుపొందిన కరణ్‌ జోహర్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌, కరీనా కపూర్‌, అనిల్‌ కపూర్‌, భూమి పడ్నేకర్‌, జాన్వీ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2021 డిసెంబర్‌లో క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. మొగలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో  తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. (పర్‌ఫెక్ట్‌ స్టెప్పులతో ఇరగదీసిన జాన్వీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement