
సాక్షి, ముంబై: ప్రైవేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కొత్త సీఈఓగా శశిధర్ జగదీషన్ ఎంపికయ్యారు. ఈ మేరకు బ్యాంకు ప్రతిపాదనకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. త్వరలో ప్రస్తుత సీఈఓ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఈఓ ఎంపిక అనివార్యమైంది. ఈ నియామకాన్ని హెచ్‌డీఎఫ్‌సీ చైర్‌పర్సన్ శ్యామలా గోపీనాథ్ ధృవీకరించారు.
1996 సంవత్సరంలో ఫైనాన్స్ ఫంక్షన్ లో మేనేజర్‌గా బ్యాంకులో చేరిన శశిధర్ జగదీషన్ ప్రస్తుతం హెచ్‌ఆర్ అదనపు డైరెక్టర్, ఫైనాన్స్ హెడ్ గా ఉన్నారు. ఈ వార్తలతో మంగళవారం నాటి మార్కెట్ లో హెచ్‌డీఎఫ్‌సీ షేరు భారీ లాభాలతో దూసుకుపోతోంది. కాగా 1994లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును స్థాపించిన నాటి నుంచి బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉన్న ఆదిత్యపురి పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్ 20తో ముగియనుంది. మరోవైపు ఈ జూలై 21-24 తేదీల మధ్య 74.2లక్షల ఈక్విటీ షేర్లను ఆదిత్య విక్రయించారు. శశిధర్ జగ్‌దీషన్ తోపాటు కైజద్ బరుచా, సునీల్ గార్గ్ ఈ పదవి రేసులో ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment