Amazon Company To Grant New CEO Andy Jassy Over 214 Million Dollars Stock - Sakshi
Sakshi News home page

Amazon: ఆండీ జస్సీ జీతం ఎంతంటే?

Published Mon, Jul 5 2021 4:06 PM | Last Updated on Mon, Jul 5 2021 6:17 PM

Andy Jassy to receive USD 214 mn in stock grants - Sakshi

అమెజాన్‌ నూతన సీఈఓగా ఆండీ జస్సీ బాధ్యతలను చేపట్టిన సందర్భంగా ఆయన అందుకోబోతున్న స్టాక్‌గ్రాంట్లు, వేతన వివరాలను అమెజాన్‌ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇప్పటివరకూ సీఈవోగా జెఫ్ బెజోస్‌ సెంటిమెంట్‌ ప్రకారం  జూలై 5 న పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో బెజోస్‌ స్థానంలో జస్సీ బాధ్యతలను స్వీకరించారు. 

ఆండీ జస్సీకు 61 వేల షేర్లను మంజూరు చేస్తుందని అమెజాన్‌ ప్రకటించింది. దీని విలువ 214 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1600 కోట్లు) పదేళ్ల కాలానికి ఈ  షేర్లను అతనికి కేటాయించనుంది.  300 మిలియన్ల డాలర్లు విలువైన  షేర్లు ఇప్పటికే జాస్పీ సొంతం.  అమెజాన్‌ షేర్‌ అధారంగా ఈ  విలువ మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ చీఫ్‌గా ఆయన అందుకుంటున్న అవార్డుల కంటే ఇది చాలా పెద్దది. అలాగే ఆండీ జస్సీ బేసిక్‌ వేతనం 1,75,000 డాలర్లుగా ( సుమారు కోటి, 30 లక్షల రూపాయలు)  ఉండనుంది. ఇప్పటికే 45.3 మిలియన్లు షేర్లు అతని ఖాతాలోఉన్నాయి. 2020 నాటికి ఆయన పెట్టుబడుల విలువ 41.5 మిలియన్లు డాలర్లు.  అయితే  ఇతర టెక్నాలజీ పరిశ్రమలో ప్రత్యర్థి సీఈఓలతో పోలిస్తే  జస్సీ స్టాక్‌ గ్రాంట్‌ తక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

టెక్నాలజీ పరిశ్రమలో ప్రత్యర్థి సీఈఓలతో పోలిస్తే  జస్సా స్టాక్‌ గ్రాంట్‌ తక్కువ అట.  కొత్త సీఈఓల నియామకం సందర్భాల్లో  పెద్ద టెక్ కంపెనీలలో ఈ రకమైన స్టాక్ గ్రాంట్లు సాధారణం. ఆపిల్ టిమ్ కుక్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ,మైక్రోసాఫ్ట్  సీఈఓ గా సత్య నాదెళ్ల అత్యున్నత పదవులను చేపట్టినపుడు ఇలాంటి స్టాక్‌ అవార్డులను పొందారు. మైక్రోసాఫ్ట్  ఛైర్మన్‌గా నియమితుడైన సత్య నాదెళ్ళ 2020 జూన్ 30 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 215 మిలియన్ డాలర్ల  షేర్లను కలిగి ఉన్నారు. ఆయన మూల వేతనం 2.5 మిలియన్ డాలర్లు. కాగా 1994లో స్థాపించినప్పటి నుంచీ  అప్రతిహతంగా వృద్ధి చెందిన టెక్‌ దిగ్గజం అమెజాన్‌ వాల్యూ పరంగా 1.8 ట్రిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అయితే గత సంవత్సరం మెరుగైన ఫలితాలను సాధించినప్పటికీ,  అమెజాన్‌ స్టాక్‌ ఫ్లాట్‌గా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement