OpenAI CEO: 'చాట్‌జీపీటీ'(ChatGPT) సృష్టి కర్త 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓగా ఓపెన్‌ఏఐ తొలగించిన వెంటనే.. ఈ బాధ్యతలను తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 'మీరా మురాటి' (Mira Murati) స్వీకరించింది. ఓపెన్‌ఏఐ కొత్త సీఈఓ మీరా ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అల్బేనియాలో జన్మించిన మీరా మురాటి ఉన్నత చదువులు కోసం 16 ఏళ్ల వయసులోనే కెనడాకు వెళ్ళింది. డార్ట్‌మౌత్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడే హైబ్రిడ్ రేస్ కారును నిర్మించారు. మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసిన ఈమె టెస్లాలో స్టూడెంట్ ఇంటర్న్‌గా పనిచేసి మోడల్ ఎక్స్ వాహనం తయారు చేయడంలో కీలకపాత్ర పోషించింది.
ఆ తరువాత 2018లో ఓపెన్ఏఐలో చేరి సూపర్‌కంప్యూటింగ్‌పై పని చేయడం ప్రారంభించింది. అంతకంటే ముందు లీప్ మోషన్‌లో రెండేళ్లు పనిచేసింది. 2022లో ఆమె చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందింది.
టెక్నాలజీ మీద మంచి పట్టు, వ్యాపారంలో మెళకువలు కలిగిన 'మీరా మురాటి' కంపెనీ వృద్ధికి దోహదపడుతుందని విశ్వసించి తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే అధికారికంగా సీఈఓ ఎవరనేది సంస్థ వెల్లడిస్తుంది.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సృష్టికర్తనే తొలగించిన ఓపెన్‌ఏఐ.. కారణం ఇదే!
శామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించడానికి కారణం
బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్‌ఏఐకి నాయకత్వం వహించే విషయంలో అతడి సామర్థ్యంపై బోర్డుకు నమ్మకం లేకపోవడం వల్ల సీఈఓగా తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment