ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ ఐఫోన్ తయారీ సంస్థ 'యాపిల్' తన మొబైల్‌లో స్టార్టప్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఓపెన్ఏఐతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాబోయే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 18లో చాట్‌జీపీటీ ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఓపెన్ఏఐతో జత కట్టినట్లు సమాచారం. రెండు కంపెనీల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.
ఒప్పందం కుదిరిన తరువాత ఈ టెక్నాలజీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే యాపిల్ కంపెనీ జెమినీ చాట్‌బాట్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ చర్చలు ఇంకా పూర్తికాక ముందే.. యాపిల్ కంపెనీ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది.
యాపిల్ కంపెనీ జూన్‌లో నిర్వహించనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్పిరెన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. గత సంవత్సరం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా చాట్‌జీపీటీ వినియోగాన్ని గురించి ప్రస్తావించారు. ఇందులో అనేక సమస్యలను క్రమబద్ధీకరించవలసి అవసరం ఉందని, దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment