
రాధికరాజే గైక్వాడ్.. ఈ పేరు భారతీయులకు సుపరిచయమే. ఎందుకంటే.. రాజ వంశంలో పుట్టినప్పటికీ, సాధారణ ప్రజలలో కలిసిపోయే గుణం ఉన్న ఈమె ఎంతోమందికి ఆదర్శప్రాయం. తండ్రి మార్గాన్ని అనుసరించి, చదువుకునే రోజుల్లోనే ఉద్యోగం చేయడం మొదలు పెట్టింది.
ఎవరీ రాధికరాజే గైక్వాడ్?
గుజరాత్ రాష్ట్రంలోని వాంకనేర్ రాయల్ కుటుంబంలో పుట్టిన∙రాధికా రాజే.. కొన్నాళ్లు అక్కడే పెరిగినప్పటికీ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చడంతో తన సొంత ప్యాలెస్‌కు దూరమయ్యారు. ఢిల్లీలో స్కూలు విద్యను అభ్యసించిన రాధిక సాధారణ విద్యార్థినిలా ఆర్టీసీ బస్సునే స్కూలుకు వెళ్లేవారు. తోటి విద్యార్థులతో కలిసి మెలిసి ఉండేవారు. వేసవికాలం సెలవుల్లో వాంకనేర్‌కు వెళ్లేవారు.

డిగ్రీ పూర్తయ్యాక.. ఇరవై ఏళ్ళ వయసులో ఆమె ఓ పత్రికలో జర్నలిస్టుగా చేరారు. ఒకవైపు పత్రికలో పనిచేస్తూనే.. మరోవైపు పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. వీరి కుటుంబంలో ఒక మహిళ ఉద్యోగం చేయడం ఇదే తొలిసారి. 21 ఏళ్ళకే పెళ్లిచేసే కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం విశేషం.
రాధికరాజే చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే తల్లిదండ్రులు.. ఆమెకు బరోడా యువరాజు 'సమర్‌జిత్ సిన్హ్ గైక్వాడ్'తో వివాహం చేశారు. పెళ్లి అయ్యాక కూడా తన చదువుని కొనసాగిస్తానంటే ఆయన అందుకు సమ్మతించడమేగాక చదువుకునేందుకు ప్రోత్సహించారు కూడా. వివాహం తరవాత బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ రాధికకు స్థిర నివాసంగా మారింది.
లక్ష్మీ విలాస్ ప్యాలెస్
సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్.. బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉందని నివేదిలకు చెబుతున్నాయి. దీని నిర్మాణకి ఏకంగా 12 సంవత్సరాల సమయం పట్టినట్లు సమాచారం. 1890లో మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ నిర్మాణానికి అయిన ఖర్చు అప్పట్లో రూ. 27,00,000 అని చెబుతున్నారు. ఈ మహల్ విలువ ఇప్పుడు రూ. 25,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.

హోసింగ్.కామ్ ప్రకారం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విస్తీర్ణం 3,04,92,000 చదరపు అడుగులు, బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులు అని తెలుస్తోంది. ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తీర్ణం 48,780 చదరపు అడుగులు కావడం విశేషం.
ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్.. దానిపై అన్నీ అవే!
వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ప్యాలెస్ ఇప్పటికి కూడా అతి పెద్ద ప్రైవేట్ ప్యాలెస్‌గా కీర్తి పొందింది. దీని నిర్మాణ సమయంలో ఎలివేటర్లు వంటి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కట్టుదిట్టం చేశారు. అత్యంత అందమైన ఈ భవనం మేజర్ చార్లెస్ మాంట్ అనే వాస్తు శిల్పి సారథ్యంలో పురుడు పోసుకుంది. దీని లోపల భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్‌ను గుర్తు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment