
ఎన్‌సీఎల్‌టీకి నోనా లైఫ్‌స్టైల్ అభ్యర్ధన
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోపై గతంలో దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను పునరుద్ధరించమంటూ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)ని తాజాగా నోనా లైఫ్‌స్టైల్ ప్రయివేట్ లిమిటెడ్ అభ్యర్ధించింది.
జొమాటోకు ఆపరేషనల్ క్రెడిటర్ అయిన నోనా లైఫ్‌స్టైల్ 2024లో దివాలా చర్యలకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ఎన్‌సీఎల్‌టీ అనుమతించలేదు.
ఈ నేపథ్యంలో జోమాటోపై పిటిషన్‌ను పునరుద్ధరించవలసిందిగా దుస్తుల సరఫరాదారు నోనా లైఫ్‌స్టైల్ మరోసారి ఢిల్లీ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ను ఆశ్రయించింది. జొమాటోపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశించవలసిందిగా అభ్యరి్థంచింది. అయితే ఇద్దరు సభ్యుల ఎన్‌సీఎల్‌టీ బెంచ్ విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment