
భారతదేశం ప్రత్యేక వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక వంటల రుచులను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించేందుకు చాలామంది కృషి చేస్తున్నారు. ఈక్రమంలో తాము తయారు చేస్తున్న వంటకాలకు కొత్త రుచులను జోడిస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి భారతీయ సెలబ్రిటీ చెఫ్‌లు ప్రముఖ వ్యాపారులకు ధీటుగా రెస్టారెంట్లు, పుస్తకాలు రాస్తూ, టీవీ షోలు, వివిధ వ్యాపార వెంచర్లను ఏర్పాటు చేస్తూ ఆర్థికంగా దూసుకుపోతున్నారు. దేశంలోని టాప్ 10 సంపన్న సెలబ్రిటీ చెఫ్‌ల జాబితా, వారి సంపద నికర విలువ(సుమారుగా) కింద తెలియజేశాం.
సంజీవ్ కపూర్-రూ.1165 కోట్లు: సంజీవ్ కపూర్ రూ.1165 కోట్ల నికర విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక చెఫ్‌గా నిలిచారు. ఆయనకు అనేక రెస్టారెంట్లు, ఫుడ్ఫుడ్ అనే ప్రముఖ ఫుడ్ ఛానల్ ఉన్నాయి. ఆయన వార్షికాదాయం సుమారు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా.
వికాస్ ఖన్నా-రూ.80 కోట్లు నుంచి రూ.120 కోట్లు: వికాస్ ఖన్నా పలు టెలివిజన్ షోల్లో కనిపిస్తుంటారు. ఆయన ప్రస్తుతం సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ సీజన్ 1లో పాల్గొంటున్నారు. వంటలపై పుస్తకాలు కూడా రాశారు. న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ విలేజ్ పరిసరాల్లో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు.
రణ్ వీర్ బ్రార్-రూ.41 కోట్లు: టాలెంటెడ్ సెలబ్రిటీ చెఫ్ రణ్ వీర్ బ్రార్ కూడా రెస్టారెంట్ యజమానిగా, ప్రసిద్ధ టెలివిజన్ పర్సనాలిటీగా నిలిచారు. పలు ఫుడ్ షోల్లో నటించిన ఆయన ప్రస్తుతం సెలబ్రిటీ మాస్టర్ చెఫ్‌లో నిర్ణేతగా ఉన్నారు.
కునాల్ కపూర్-రూ.8.715 కోట్లు నుంచి రూ.43.575 కోట్లు: కునాల్ కపూర్ విస్తృతంగా చెఫ్, టెలివిజన్ షోల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రధానంగా తాను చేసే బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, యూట్యూబ్ నుంచి డబ్బు సమకూరుతుంది.
గరిమా అరోరా-రూ.40 కోట్లు: గరిమా అరోరా భారతీయ మాస్టర్ చెఫ్, చెఫ్ టీవీ షోలకు నిర్ణేతగా వ్యవహరిస్తుంటారు. ఈమె పలు రెస్టారెంట్లను స్థాపించారు.
హర్పాల్ సింగ్ సోఖీ-రూ.35 కోట్లు: ఈయన ఇటీవల లాఫ్టర్ చెఫ్ ఇండియా షోలో కనిపించి ఇంటర్‌నెట్‌లో సంచలనం సృష్టించారు. బెంగళూరులోని తన ప్రసిద్ధ రెస్టారెంట్ కరిగారి, కుకరీ షోల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు.
అతుల్ కొచ్చర్-రూ.34.86 కోట్లు: అతుల్ కొచ్చర్ చెఫ్‌తో పాటు రచయితగా ప్రసిద్ధి. అతను బెస్ట్ సెల్లింగ్ కుకింక్ బుక్స్ రాశారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. తన లండన్ రెస్టారెంట్ కోసం మిచెలిన్ స్టార్ రేటింగ్ పొందారు.
ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తీపికబురు!
వినీత్ భాటియా-రూ.18 కోట్లు నుంచి రూ.25 కోట్లు: ఈయనకు ప్రపంచవ్యాప్తంగా రెస్టారెంట్లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లోని ది ఫైనల్ టేబుల్‌షోలో నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
పంకజ్ భదౌరియా రూ.7 కోట్లు నుంచి రూ.35 కోట్లు: పంకజ్ భదౌరియా తొలి మాస్టర్ చెఫ్ ఇండియా విజేతగా నిలిచారు. ఆమె వంట పుస్తకాలను రచించారు. వంట ప్రదర్శనలను ఇస్తుంటారు.
అజయ్ చోప్రా-రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లు: అజయ్ చోప్రా సృజనాత్మక వంటకాలకు ప్రసిద్ధి.
Comments
Please login to add a commentAdd a comment