ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు | Banks Board Bureau recommends three names for MD and CEO | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు

Published Thu, Nov 14 2019 6:03 AM | Last Updated on Thu, Nov 14 2019 6:03 AM

Banks Board Bureau recommends three names for MD and CEO - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకు కొత్తగా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లను (ఎండీ–సీఈఓ) బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) బుధవారం సిఫారసు చేసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకూ వరుసగా సంజీవ్‌ చద్దా, ఎల్‌.వి.ప్రభాకర్, అతనూ కుమార్‌ దాస్‌ పేర్లను సూచించింది. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూల్లో వీరి పేర్లను ఖరారు చేశామని, ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందించామని వెల్లడించింది. చద్దా ప్రస్తుతం ఎస్‌బీఐ కాపిటల్‌ మార్కెట్స్‌ ఎండీ – సీఈఓగా ఉండగా.. ప్రభాకర్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌  ఈడీగా, దాస్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈడీగా ఉన్నారు. ఇక రిజర్వ్‌ జాబితాలో.. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు ఎండీ–సీఈఓగా ఎ.ఎస్‌.రాజీవ్, కరూర్‌ వైశ్య బ్యాంక్‌కు పీ ఆర్‌ శేషాద్రి పేర్లను ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement