Bank Board Bureau
-
ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను (ఎండీ–సీఈఓ) బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) బుధవారం సిఫారసు చేసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకూ వరుసగా సంజీవ్ చద్దా, ఎల్.వి.ప్రభాకర్, అతనూ కుమార్ దాస్ పేర్లను సూచించింది. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూల్లో వీరి పేర్లను ఖరారు చేశామని, ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందించామని వెల్లడించింది. చద్దా ప్రస్తుతం ఎస్బీఐ కాపిటల్ మార్కెట్స్ ఎండీ – సీఈఓగా ఉండగా.. ప్రభాకర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈడీగా, దాస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా ఉన్నారు. ఇక రిజర్వ్ జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఎండీ–సీఈఓగా ఎ.ఎస్.రాజీవ్, కరూర్ వైశ్య బ్యాంక్‌కు పీ ఆర్ శేషాద్రి పేర్లను ప్రకటించింది. -
మూడు బ్యాంకుల చీఫ్‌ల ఎంపికకు ఇంటర్వ్యూలు
ముంబై: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీ, సీఈఓల ఎంపికకు సోమవారం బ్యాంక్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) ఇక్కడ 10 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. ఆర్బీఐ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరిగాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు ఎండీ, సీఈఓ పోస్టులకు ఈ ఇంటర్వ్యూలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి హాజరయిన వారిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు ఉన్నారు. కాగ్ మాజీ చీఫ్ వినోద్‌రాయ్ నేతృత్వంలో కార్యకలాపాలు చేపట్టిన బీబీబీ- బ్యాంక్‌ల చీఫ్‌ల ఎంపికకు జరిపిన తొలి ఇంటర్వ్యూ ఇది.