
న్యూఢిల్లీ: బిలియనీర్ ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కొత్త సీఈవో అంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్క ఫోల్కి ఫోటోను పోస్ట్ చేసి 'న్యూ సీఈఓ ఆఫ్ ట్విటర్' అని పేర్కొన్నారు. అంతేకాదు ఇతర సీఈవోల కన్నా ఇదే బెటర్ , నెంబర్లలోనూ ఇదే బెటర్.. స్టయిల్ కూడా అదిరింది అంటూ పరోక్షంగా మాజీ సీఈవో అగర్వాల్‌ను అవమానించేలా వరుస ట్విట్లలో కమెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
స్టయిలిష్‌గా, బ్రాండెడ్ బ్లాక్ టీ-షర్ట్‌లో క్రేజీ లుక్స్‌తో ఉన్న ఫ్లోకి ముందు ఓ టేబుల్, దానిపైన ల్యాప్‌టాప్ ఉన్న ఫోటోను షేర్ చేయడంతో..కొత్త సీఈవో స్టైల్ అదిరిపోయిందని ఒకరు, చాలా ఇన్‌స్పైరింగ్.. పప్పీలా ఆ స్థాయికి ఎదగాలనుకుంటున్నా అంటూ కమెంట్ చేశాడు
కాగా అంతకుముందు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్‌లో అభ్యంతరకరమైన పోస్ట్ చేయడంతో మస్క్‌పై ట్విటర్ యూజర్లు మండిపడ్డారు. ఇక ఇదే ఆఖరు.. అధికారికంగా ట్విటర్ నుంచి నిష్క్రమిస్తున్నాను అని ఒకరు, ఈ పోస్ట్ ఇబ్బందికరమైన, స్త్రీద్వేషపూరిత చిత్రమని మరొకరు పేర్కొన్నారు ."మీరిలా చేస్తారని నమ్మలేక పోతున్నాను", మరొకరు, "మీ మీమ్స్ చాలా పేలవంగా ఉన్నాయని మరొక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది బ్లాక్‌మస్క్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు.
— Elon Musk (@elonmusk) February 14, 2023
Comments
Please login to add a commentAdd a comment