written test
-
కానిస్టేబుల్ పరీక్షకు 91.34% హాజరు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని 15644 సివిల్ కానిస్టేబుల్, అబ్కారీ శాఖలోని 614 పోస్టులు, రవాణా శాఖలోని 63 పోస్టులకు రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు 38 ప్రధాన పట్టణాల్లోని 1601 పరీక్ష కేంద్రాల్లో 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 6,6,1198 మంది అభ్యర్థుల్లో 91.34 శాతం మంది పరీక్ష రాసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు సహా ఫొటోలు కూడా నమోదు చేసినట్టు వెల్లడించారు. ప్రశ్నపత్రం కీ పేపర్‌ను త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, ఆ తేదీని కొద్దిరోజుల్లో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓఎంఆర్ షీట్‌పై అభ్యర్థులు ప్రశ్నపత్రం బుక్లెట్ కోడ్‌ను తప్పనిసరిగా సరైన విధానంలో వేయాలని, బుక్లెట్ కోడ్‌ను రాయకపోయినా, సరైన పద్ధతిలో నమోదు చేయకపోయినా మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు. -
సర్పంచ్ పదవికి ఎంట్రన్స్ టెస్ట్
రూర్కెలా: ఒడిషాలో పంచాయతీ ఎన్నికల సంరంభం ఆరంభమైంది. అయితే ఎవరిని పడితే వారిని ఎన్నుకోమని కుట్రగ్రామ్ పంచాయతీ పరిధిలోని మలుపదా గ్రామస్థులు తేల్చిచెబుతున్నారు. తమ ఓట్లు కావాలంటే తాము పెట్టే పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలని వింత షరతు పెట్టారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీపడుతున్నవారంతా పరీక్షకు తయారయ్యారు. ఆదివాసీలు అధికంగా ఉండే ఈ గ్రామంలో ఎన్నికలు ఈనెల 18న జరగనున్నాయి. 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. స్థానిక పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించిన రాత పరీక్షకు వీరిలో 8మంది హాజరయ్యారు. రాత్రి 8 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణాలు, సర్పంచ్కుండాల్సిన లక్ష్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన, గ్రామ పరిస్థితులపై సమాచారం తదితర అంశాలను పరీక్షలో అడిగారు. ఫలితాలు ఈ నెల 17న ప్రకటిస్తారు. చదవండి: (మీ పాలనలో రూ.5.35 లక్షల కోట్ల మోసాలు!) -
12న ఓయూ పార్ట్‌టైం అధ్యాపక రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈనెల 12న రాత పరీక్ష నిర్వహించనున్నారు. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీలకు పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 12న దూరవిద్య కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు జరిగే పరీక్షకు హాజరుకావాలని అధికారులు సోమవారం తెలిపారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14న ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని వెల్లడించారు. 190 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులకు మెడిసిన్ సీట్లు యూజీ నీట్–21 తొలివిడత కౌన్సెలింగ్‌లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కు చెందిన 190 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. మలి విడత కౌన్సెలింగ్‌లోనూ కొందరు సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు సొసైటీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులను ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. గత ఆరేళ్లలో 513 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించినట్లు సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ తెలిపారు. (క్లిక్: అంతా మా ఇష్టం.. పబ్లిక్ పరీక్షల ఫీజు పై సైతం బాదుడు) -
ఓయూ ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం, కాంట్రాక్టు, పర్మినెంట్ అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. గతంలో పర్మినెంట్ ఉద్యోగాలకు కూడా రాతపరీక్ష ఉండేది కాదు. ఈనేపథ్యంలో ఓయూలో కొత్తగా రాత పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పార్ట్‌టైం అధ్యాపక పోస్టుకు ఈనెల 23న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: మూడు వందల కాలేజీలకు ముప్పు) 13న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఈనెల 10న శుక్రవారం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈనెల 13న (సోమవారం) విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ జీబీ రెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షకు 836 మంది దరఖాస్తు చేయగా 677 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 15 వరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐసెట్–2021 అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. (చదవండి: మద్యం తాగాడు.. విద్యార్థులను బాదాడు) పీజీ రిపోర్టింగ్ గడువు 15 వరకు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): టీఎస్–సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్‌లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 15 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చని కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. రిపోర్టింగ్ గడువు 10వ తేదీతో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. కాగా, శుక్రవారం నాటికి పీజీ కోర్సుల్లో సీటు సాధించిన 15 వేల మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేసినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (చదవండి: బయోపిక్‌లు ‘భయో’ పిక్‌లు, కాకూడదు) -
20 నుంచి ఎస్ఐ రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు సబ్ఇన్స్పెక్టర్ రాత పరీక్షల షెడ్యూలు ఖరారైంది. ఈనెల 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 18 అర్ధరాత్రి వరకు అభ్యర్థులు http://www.tslprb.in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఎస్ఐ సివిల్, టెక్నికల్ రాత పరీక్షలకు సంబంధించిన షెడ్యూలు విడుదల చేసింది. ఇటీవల దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణులైన 1,05,061 మంది తుదిరాత పరీక్షకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరంతా 20 నుంచి జరగబోయే తుది పరీక్షలు రాయనున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలు, బయోమెట్రిక్ యంత్రాలు, హాల్‌టికెట్లను సిద్ధం చేశారు. హాల్‌టికెట్లు డౌన్లోడ్ కాకపోతే..: హాల్‌టికెట్లు డౌన్లోడ్ కాని అభ్యర్థులు support@tslprb.in ఈ–మెయిల్ చేయాలని లేదా 9393711110, 9391005006 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని నియామక బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. కాగా, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చేది లేదని బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు చేతి గడియారాలు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తీసుకురావొద్దని స్పష్టం చేసింది. చదువుకునే సమయమేదీ.. పోలీసు శాఖలో దాదాపు 3 వేల మంది కానిస్టేబుళ్లు ఎస్ఐ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 1,500 మందికిపైగా తుదిరాత పరీక్షకు అర్హత సాధించారు. తుది రాత పరీక్ష రాసేందుకు తగినంత సమయం లేదని మొదటినుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న వీరు.. షెడ్యూలులో మార్పు లేకపోవడంతో వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుళ్లు పోలింగ్, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లు, శ్రీరామనవమి వేడుకలకు బందోబస్తు కోసం డ్యూటీల్లో చేరారు. ఇక తమకు చదువుకునే సమయం ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సెలవులు పెట్టి చదువుకుంటున్న కానిస్టేబుళ్లకు డీజీపీ కార్యాలయం నోటీసులు పంపింది. ఎన్నికల నేపథ్యంలో ఎవరికీ సెలవులు లేవని, ఏప్రిల్ 1లోగా రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో వారంతా వచ్చి ఎన్నికల విధుల్లో చేరారు. కాగా, ఎస్ఐ రాత పరీక్షలకు సిద్ధమవుత్నున పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులకు శ్రీరామనవమి తర్వాత సెలవు ఇవ్వాలని పోలీసు శాఖ నిర్ణయించిందని విశ్వసనీయ సమాచారం. శ్రీరామనవమి అనంతరం తుది రాత పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు సెలవు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ మేరకు అనధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించడం లేదు. -
కానిస్టేబుల్ రాతపరీక్ష ‘కీ’ విడుదల
సాక్షి, హైదరాబాద్: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష ‘కీ’ని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు శుక్రవారం విడుదల చేశారు. రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ‘కీ’పై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 8లోపు వెబ్సైట్లో ఉన్న ప్రత్యేక ఫార్మాట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అయితే సబ్ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్ష కన్నా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను కఠినంగా ఇచ్చారని, అంతేకాకుండా పలు ప్రశ్నలపై అభ్యంతరాలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై బోర్డు అధికారులకు కానిస్టేబుల్ అభ్యర్థులు విజ్ఞప్తులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ రాత పరీక్షపై భారీ స్థాయిలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతాయని బోర్డు అధికారులు భావిస్తున్నారు. -
రంగంలోకి దిగిన దళారులు
ఉక్కునగరం(గాజువాక): స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ పోస్టుల రాత పరీక్షకు దళారులు దందా ప్రారంభించారు. ఉద్యోగాల పేరిట అమాయకులైన నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ జూనియర్ ట్రైనీ పోస్టులకు మే 5 నుంచి 14 వరకు వివిధ కేంద్రాల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సుమారు 43 వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం వస్తే ఆకర్షణీయమైన జీతంతో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని భావించి నిరుద్యోగులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది నిరుద్యోగులు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి ఇళ్లు, భూములు కుదువ పెట్టి వచ్చిన నగదును దళారుల చేతిలో పెడుతున్నారు. గతంలో ఆఫ్‌లైన్‌లో పరీక్ష జరిగిన సమయంలో కొంత మంది దళారులు పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై పేపర్ లీకేజ్‌కు పాల్పడటం, మరికొంత మంది ఇన్విజిలేటర్ల సాయంతో పరీక్ష రాయించడం తదితర ఘటనలు వెలుగు చూశాయి. దళారులు నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని డబ్బులు ముందుగా గుంజి తమ వద్ద ఉంచుకుంటారు. అదృష్టవశాత్తు అభ్యర్థులు పరీక్షలో పాసైతే.. వారు ఇచ్చిన డబ్బులు దళారులకు అప్పనంగా మిగిలిపోతాయి. పరీక్షలో పాసు కాకపోతే ప్రయత్నించాం.. అవ్వలేదంటూ ఓదార్చడం.. కొన్ని రోజులు అభ్యర్థులను తిప్పుకుని ఖర్చులకని డబ్బులు తీసుకుని మిగతాది తిరిగి ఇవ్వడం పరిపాటిగా మారింది. మరికొంత మంది నకిలీ నియామకపు పత్రాలు ఇచ్చి అభ్యర్థులను మోసగించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చేసిన వారిలో స్టీల్‌ప్లాంట్‌కు చెందిన కొంత మంది కార్మిక నాయకులు ఉండటం గమనార్హం. అభ్యర్థులు ఆ నియామక పత్రాలు తీసుకుని ప్లాంట్‌కు వెళ్లడం, అక్కడ అధికారులు తిప్పిపంపుతుండటంతో.. లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈసారి ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ నిరుద్యోగులను ప్రలోభ పెట్టేందుకు దళారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దళారుల చేతిలో నిరుద్యోగులు మోసపోవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా ప్రలోభ పెడితే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 8878ను సంప్రదించాలని కోరారు. -
27న ఎస్సై(కమ్యూనికేషన్, పీటీవో) రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఎస్సై (కమ్యూనికేషన్), ఎస్సై (పీటీవో) పోస్టుల భర్తీకి ఈ నెల 27న (ఆదివారం) తుది రాత పరీక్ష నిర్వహిస్తున్నామని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ పూర్ణచందర్రావు తెలిపారు. ఎస్సై కమ్యూనికేషన్ పోస్టులకు ఉదయం 10 నుంచి 1 గంట వరకు, ఎస్సై (పీటీవో) పోస్టులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు టెక్నికల్ పేపర్ పరీ క్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశా రు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని అన్నారు. -
ఎంసెట్-3 నోటిఫికేషన్ జారీ
* సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హాల్‌టికెట్లు * 11న రాత పరీక్ష.. వారం రోజుల్లో ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాత పరీక్ష నిర్వహించేందుకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 11 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. గతంలో ఎంసెట్-2 రాసేందుకు దరఖాస్తు చేసుకున్న 56,153 మంది అభ్యర్థులంతా ఎంసెట్-3 రాసేందుకు అర్హులేనని, వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం.. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యార్థులు సెప్టెంబర్ 3 నుంచి 9 వరకు tseamcet.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. పరీక్ష జరిగిన వారం రోజుల్లోగా (వీలైతే 16, 17 తేదీల్లో) ఫలితాలు, ర్యాంకులను విడుదల చేయనుంది. ఎంసెట్ స్కోర్‌కు 75 శాతం, ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. పరీక్ష నిర్వహణకు గతంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కేంద్రాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ఒక్కో రీజనల్ కేంద్రం పరిధిలోని పరీక్ష కేంద్రాలు మాత్రం మారుతాయని తెలిపింది. -
31న ట్రాన్స్పోర్ట్, కానిస్టేబుల్ పరీక్షలు
జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ సంగారెడ్డి జోన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 31వ తేదిన నిర్వహించనున్న ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ తెలిపారు. కలెక్టరెట్లో శుక్రవారం రాత పరీక్ష నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 31న ఉదయం 10 నుంచి 12.30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. సంగారెడ్డి, పటాన్చెరువు, రాంచంద్రపురంలో మొత్తం 34 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. మొత్తం 14,609 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, ఆ రోజు ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా, మంచినీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఏదైన గుర్తింపుకార్డును విధిగా తెచ్చుకోవాలన్నారు. ఎలక్ర్టానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సూచించారు. అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యేవారు షూష్, జువెల్లరీ, ష్రగ్స్ ధరించకూడదన్నారు. పోలీసు బందోబస్తుతో పాటు ఇప్పటికే ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టరెట్ పరిపాలనా అధికారి మహిపాల్‌రెడ్డి తదితరులున్నారు. -
నేడే కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలు
♦ జంట జిల్లాల నుంచి హాజరుకానున్న ♦ 94,477 మంది అభ్యర్థులు ♦ అక్రమాల నిరోధానికి తొలిసారిగా ♦ ‘బయోమెట్రిక్’ అమలు సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ర్ట పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించి కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలు ఆదివారం జరుగనున్నాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జంట జిల్లాలో జరిగే ఈ పరీక్షలకు 94,477 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్‌లో 74 పరీక్ష కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్‌తో సహా 124 పరీక్ష కేంద్రాల్లో సకలసౌకర్యాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స వైద్యసేవలు...తదితర వసతులు కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో 38,757 మంది, రంగారెడ్డి జిల్లాలో 55,720 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా. హైదరాబాద్‌లో మహిళలు 4,219 మంది, పురుషులు 30,528, మొత్తంగా 38,757 మంది, రంగారెడ్డి జిల్లాలో మహిళలు 9,460, పురుషులు 54,480 మంది మొత్తంగా 55,720 మంది హాజరుకానున్నారు. గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి... కానిస్టేబుల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఎగ్జామ్స్ నిర్వహించే సమయానికి గంట ముందే చేరుకోవాలి. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అధికారులు అమలుచేస్తున్నారు. అభ్యర్థుల ఫొటోలు, వేలిముద్రలు, సంతకాలు తీసుకోవడం ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థి పరీక్ష రాస్తున్నాడన్న విషయం అక్కడికక్కడే తెలిసిపోతుంది. అయితే నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు అనుమతించమని పోలీసులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. -
కానిస్టేబుల్ రాతపరీక్షకు సహకరిస్తాం
ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న జరగనున్న పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్షకు సహకరిస్తామని తెలంగాణ ప్రైవేటు పాఠశాలల, కళాశాలల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) స్పష్టం చేసింది. సచివాలయంలో గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో జేఏసీ నేతలు సమావేశమై కానిస్టేబుల్ రాత పరీక్షకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్తూ.. కాలేజీలపై పోలీసుల తనిఖీలు ఆపాలని కోరారు. దీనిపై మంత్రి నాయిని స్పందిస్తూ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుళ్ల రాతపరీక్షకు సహకరిస్తామన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జాక్ కన్వీనర్ జి.రమణారెడ్డి, తెలంగాణ డిగ్రీ కాలేజీల కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, జాక్ కో-కన్వీనర్ కె.సిద్దేశ్వర్ పాల్గొన్నారు. -
కస్టమ్స్ ఏజెంట్ రాత పరీక్షకు 22 మంది హాజరు
విజయవాడ బ్యూరో: విజయవాడ ఏపీ కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కస్టమ్స్ హౌస్ ఏజెంట్ రాత పరీక్షకు 22 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష రాసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి 25 మంది దరకాస్తు చేయగా ముగ్గురు అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కస్టమ్స్శాఖలో ఉద్యోగ విరమణ చేసిన అడిషనల్ కమిషనర్లు, సూపరింటెండెంట్ స్థాయి అధికారులతో పాటు సీఏ చదివిన అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరయ్యారు. ఏడాది కోసారి మాత్రమే జరిగే ఈ పరీక్ష దేశవ్యాప్తంగా ఒకే రోజు జరుగుతుంది. ఏపీ కస్టమ్స్ కమిషనర్ ఎస్కే రెహమాన్ పరీక్ష నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాత పరీక్షలో పాసైన వారు ఫిజికల్ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉందనీ, అక్కడ కూడా పాసైతే కస్టమ్స్ లెసైన్సు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ లెసైన్సు ఉన్న వారు మాత్రమే పోర్టులు, ఎయిర్కార్గోలు, ఇన్లాండ్ కంటైనర్ డిపోల్లోకి ప్రవేశించి ఎగుమతులు, దిగుమతులను పర్యవేక్షించే అధికారం ఉంటుందన్నారు. ఈ రాత పరీక్షను కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ శంకరన్ రాజు, సూపరింటెండెంట్లు కేఎస్వీడీ రాజు, విజయపాల్, మస్తాన్, గుమ్మడి సీతారామయ్యలు పర్యవేక్షించారు. -
వాటర్‌వర్క్స్ అసిస్టెంట్ పరీక్షకు 64.2 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్‌లో ఫైనాన్స్ అండ్ అకౌం ట్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 64.2 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్‌లలో ఏర్పాటు చేసిన 84 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించామన్నారు. హైదరాబాద్‌లోని 22 పరీక్ష కేంద్రాల్లో 76.74 శాతం, రంగారెడ్డి జిల్లాలోని 21 కేంద్రాల్లో 71 శాతం, కరీంనగర్‌లోని 17 కేంద్రాల్లో 51.2 శాతం, వరంగల్‌లోని 24 కేంద్రాల్లో 57.8 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజైరె నట్లు తెలిపారు. షేక్ బందగి స్వగ్రామం ఏది? టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పోటీ పరీక్ష మాదిరిగానే ఈసారీ తెలంగాణ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా చరిత్రకు సంబంధించి దాదాపు 30 ప్రశ్నలు అడగగా అందులో తెలంగాణకు సంబంధించినవి 22 వరకు ఉన్నాయి. భారత చరిత్రపై దాదాపు 8 ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ ఆధునిక చరిత్ర మీద ప్రశ్నలు వచ్చాయి. విస్నూర్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాడిన షేక్‌బందగి స్వగ్రామం ఏది? హైదరాబాద్‌లో సాలార్జంగ్ మ్యూజియాన్ని స్థాపించింది ఎవరు? కొమరవెల్లి వీరభద్రస్వామికి ప్రాచుర్యంలో ఉన్న మరో పేరు? మిలియన్ మార్చ్ దేనికి సంబంధించింది? తదితర ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నల క్లిష్టత స్థాయి కఠినంగా ఏమీ లేదనీ, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సులువుగానే గుర్తించే విధంగా ఉన్నాయనీ నిపుణులు చెబుతున్నారు. * పాలిటీ నుంచి సుమారు 20 ప్రశ్నలు వచ్చాయి. ఇవి అభ్యర్థుల కనీస పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఏ సవరణ ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ ఏర్పాటుకు అవకాశం కల్పించింది? ప్రస్తుత తెలంగాణ శాసనమండలి అధ్యక్షుడు ఎవరు? లాంటి ప్రశ్నలు అడిగారు. * భౌగోళిక శాస్త్రానికి సంబంధించి తెలంగాణ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదే శాలను వెలికితీసే విధంగా ప్రశ్నల రూపకల్పన ఉందని నిపుణులు అన్నారు. ముఖ్యంగా వంద స్తంభాల గుడి ఎక్కడ ఉందనే ప్రశ్నతో ఈ విషయం అర్థమవుతుందన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న జిల్లా? మున్నేరు నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? అమ్రాబాద్ పులుల రిజర్వు ఏ జిల్లాలో ఉంది? తదితర ప్రశ్నలు వచ్చాయి. 2013 ఉత్తరాఖండ్ వరదల సందర్భంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ చైర్మన్ ఎవరు? అనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లు సరైనవి కావు, ఎన్డీఎంఏకు ప్రధాని చైర్మన్‌గా ఉంటారు. కానీ ప్రధాని పేరు ఆప్షన్లో లేదు కానీ అప్పటి వైస్ చైర్మన్ ఎం.శశిధర్‌రెడ్డి పేరు ఇచ్చారు. అదే విధంగా పిల్లలమర్రి ఎక్కడ ఉందనే ప్రశ్నను తెలుగులో ఇవ్వలేదు. * ఇంగ్లిష్ మీద అడిగిన ప్రశ్నలు చాలా సులువుగా హైస్కూల్ స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. జాగ్రత్తగా గుర్తిస్తే అడిగిన 15 ప్రశ్నలకూ సమాధానాలు రాయవచ్చంటున్నారు. అదేవిధంగా వర్తమాన అంశాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. దినపత్రికలను క్రమం తప్పకుండా చదివేవారు సమాధానాలు గుర్తించే విధంగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. మ్యాథ్స్ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలు సులువుగానే ఉన్నాయని తెలిపారు. -
జేఈఈ మెయిన్‌లో అందరికీ 4 మార్కులు
హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ రాత పరీక్షలో సెట్-ఎ పేపర్లో 10వ ప్రశ్నకు(ఫిజిక్స్) ఇచ్చిన ఆప్షన్లన్నీ తప్పులేనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తించింది. దీంతో ఆ ప్రశ్నకు సంబంధించి 4 మార్కులను పరీక్ష రాసిన విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. సెట్-బి పేపర్లో 87వ ప్రశ్నకు, సెట్-సిలో 51వ ప్రశ్నకు, సెట్-డిలో 17వ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులందరికీ 4 మార్కులు ఇస్తామని పేర్కొంది. అలాగే సెట్-ఎ పేపర్లో 15వ ప్రశ్నకు 3, 4వ ఆప్షన్లు రెండూ సరైనవేనని స్పష్టం చేసింది. పరీక్ష తుది కీని వెబ్సైట్లో విడుదల చేస్తూ ఈ వివరాలు తెలిపింది. ఏప్రిల్ 10న జరిగిన ఆన్లైన్ పరీక్షలో 3, 9, 23వ ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానాలు లేవని, ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున విద్యార్థులందరికీ 12 మార్కులను ఇస్తామని పేర్కొంది. -
‘ఇంగ్లిష్’లోనూ డీఈఎల్ఈడీ
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో భారీ మార్పులు {పతి సబ్జెక్టులో 60 శాతం మార్కులకే రాత పరీక్ష ఇంటర్నల్స్‌కు మిగిలిన 40 శాతం మార్కులు నూతన పాఠ్యపుస్తకాలకు అనుగుణంగా బోధన పద్ధతులు త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ - ఓల్డ్ డీఎడ్) రెండేళ్ల కోర్సులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రాథమ్యాలు, అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్ మీడియంలోనూ డీఈఎల్ఈడీ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో ఉండగా, రెండేళ్ల పాత డీఎడ్ (ప్రస్తుత డీఈఎల్ఈడీ) కోర్సు ఇంగ్లిష్ మీడియంలో లేదు. అయితే ఇంగ్లిష్ మీడియంలో కేజీ టు పీజీ కేంద్రాలను 2016-17 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న నేపథ్యంలో డీఈఎల్ఈడీ కోర్సును ఇంగ్లిష్ మీడియంలో కూడా ప్రవేశపెట్టడం అవసరమని అధికారులు నిర్ణయించారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆమోదం తీసుకొని 2015-16 విద్యా సంవత్సరంలో ఈ మార్పులు అమల్లోకి తేవాలనుకుంటున్నారు. డీఈఎల్ఈడీ కోర్సు సిలబస్‌లో మార్పులపై ఇటీవలే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రొఫెసర్లు, అధ్యాపకులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సిలబస్‌లో మార్పులు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తీసుకురావాల్సిన మార్పులపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. వీటిని ఒకటి, రెండు రోజుల్లో ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన మార్పులివే... రాష్ట్రంలో మార్పు చేసిన నూతన పాఠ్య పుస్తకాలపై అవగాహన వచ్చేవిధంగా బోధన పద్ధతుల్లో మార్పులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో 60 మార్కులకే రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్నల్స్కే (ప్రాజెక్టులు, అసైన్మెంట్లు, టీచింగ్ ప్రాక్టీస్) 40 మార్కులు ఉంటాయి. రెండేళ్ల కోర్సులో మొత్తం 400 పనిదినాల్లో 120 రోజుల పాటు టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రథమ సంవత్సరంలో 11 పేపర్లు, ద్వితీయ సంవత్సరంలో 14 పేపర్లు ఉంటాయి. రెండు సంవత్సరాలకు గానూ మొత్తం 2,400 మార్కులు ఉంటాయి. ఇందులో 40 శాతం మార్కులు ఇంటర్నల్స్‌కు, 60 శాతం మార్కులు రాత పరీక్షలకు ఉంటాయి. ప్రథమ సంవత్సరంలో మొత్తం 950 మార్కులు ఉంటాయి. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 1,450 మార్కులు ఉంటాయి. అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్జెక్టులు ఈసారి కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా అండర్స్టాండింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్, పూర్వ ప్రాథమిక విద్యార్థులకు కూడా బోధించేలా ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, స్కూల్ కల్చర్ లీడర్షిప్ వంటి కొత్త పేపర్లు ఉంటాయి. ఒకటి, రెండు తరగతులకు పాఠ్యాంశాలు బోధించడంపై ప్రథమ సంవత్సరంలో మెథడాలజీ ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో 3, 4, 5 తరగతులకు పాఠ్యాంశాలు బోధించడంపై ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలోనే 6, 7, 8 తరగతులకు ఒక సబ్జెక్టు బోధించే విధానం ఆప్షనల్ సబె ్జక్టు కింద ఉంటుంది. -
ముగిసిన పోస్ట్‌మెన్ ఉద్యోగాల రాత పరీక్ష
సాక్షి, విజయవాడ బ్యూరో: తపాలాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్‌మెన్ ఖాళీల భర్తీ కోసం ఆది వారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాల, హైదరాబాద్‌లలో 130 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1.50 లక్షల మందికి గాను 1.10 లక్షల మంది పరీక్ష రాశారని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారులు తెలిపారు. గుంటూరు డివిజన్లో ఖాళీగా ఉన్న 14 పోస్టులకు ఒక్కో పోస్టుకు వెయ్యి మంది అభ్యర్థులు పోటీపడ్డారు. -
పంచాయతీ కార్యదర్శుల రాతపరీక్ష ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ప్రారంభం అయ్యింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై పరీక్ష నిర్వహిస్తారు. 2,406 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 8.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,677 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనం తరువాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను మార్చి 24వ తేదీన జిల్లా కలెక్టర్లకు ఏపీపీఎస్సీ పంపుతుంది. పోస్టుల భర్తీ రెవెన్యూ జిల్లా యూనిట్‌గా జరుగుతుంది. 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ పాయింట్ల ద్వారా ప్రతిభాక్రమాన్ని అనుసరించి పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎంపిక కమిటీ గానీ చేపడుతుంది. -
నేడు పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఈనెల 23వతేదీన రాత పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 2,406 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 8.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు కూడా అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై పరీక్ష నిర్వహిస్తారు. జ వాబు పత్రాల మూల్యాంకనం తరువాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను మార్చి 24వ తేదీన జిల్లా కలెక్టర్లకు ఏపీపీఎస్సీ పంపుతుంది. పోస్టుల భర్తీ రెవెన్యూ జిల్లా యూనిట్‌గా జరుగుతుంది. 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీచేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ పాయింట్ల ద్వారా ప్రతిభాక్రమాన్ని అనుసరించి పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎంపిక కమిటీ గానీ చేపడుతుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి: ఓఎంఆర్ జవాబు పత్రంలో బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే పరీక్ష రాయాలి. పెన్సిల్‌తో రాయకూడదు. వైట్నర్ను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించడానికి వీల్లేదు. ఉపయోగిస్తే మూల్యాంకనం చేయరు. పౌడర్, రబ్బరు, బ్లేడ్ వినియోగించినా మూల్యాంకనం చేయరు. ఓఎంఆర్ ఒరిజినల్ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. డూప్లికేట్ జవాబు పత్రాన్ని మాత్రమే అభ్యర్థి తీసుకెళ్లాలి. -
నేడే పంచాయతీ కార్యదర్శి పరీక్ష
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నిర్వహించను న్న ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 31,255 మంది అభ్యర్థులు హాజ రుకానున్నారు. అభ్యర్థుల ఇబ్బం దులు దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాగం సంగారెడ్డి, పటాన్చెరు, రామచంద్రాపురంలలో 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 182 పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఒక్కో పోస్టుకు 171 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులంతా పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలనీ, సమయం దాటాక ఎవరినీ అనుమతించమని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల్లోకి క్యాలిక్యులేటర్లు, మొబైల్ఫోన్లు ఇతరాత్ర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. రెండు విడతలుగా పరీక్ష పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష రెండు విడతలుగా ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి విడతగా పేపర్- 1 జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్- 2 రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే అంశంపై పరీక్ష ఉంటుంది. పకడ్బందీగా ఏర్పాట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చే శాం. సంగారెడ్డి, పటాన్చెరు, రామచంద్రాపురంలలో 82 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్ష నిర్వహణ కోసం సిబ్బంది నియమించటంతోపాటు రెం డు విడతలుగా వారికి శిక్షణ ఇచ్చాం. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించం -ఆశీర్వాదం, జడ్పీ సీఈఓ, పరీక్ష నిర్వహణ సమన్వయకర్త సమయం పేపర్ ఉదయం 10 నుంచి 12.30 పేపర్ 1- జనరల్ స్టడీస్ మధ్యాహ్నం 2 నుంచి 4.30 పేపర్ 2-రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ -
ఇక ‘పరీక్షే’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సోమవారం నాటితో ముగిసింది. మొత్తం 78,881 మంది అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్నారు. వీరిలో వీఆర్ఓ పోస్టులకు 73,353 మంది, వీఆర్ఏ పోస్టులకు 3148 మంది.. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు 2,380 పోటీ పడుతున్నారు. జిల్లాలో 105 వీఆర్ఓ పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఒక్కో పోస్టుకు 721 మంది మధ్య పోటీ నెలకొంది. మొత్తం దరఖాస్తుదారుల్లో వికలాంగులు 2,149 మంది ఉన్నారు. 2011లో 58 వీఆర్ఓ పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో 59వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు గడువు పూర్తి కావడంతో మంగళవారం పరిశీలన కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రధానంగా ఫొటోలు సంతకాలను పరిశీలిస్తారు. ఫొటో ఉండి సంతకం చేయనివి, సంతకం ఉండి ఫొటోలు లేని గుర్తిస్తారు. ఇలాంటి దరఖాస్తుదారులు రాత పరీక్షకు వచ్చే రోజు ఫొటోపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకురావాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. పరిశీలన కోసం 25 మంది రెవెన్యూ ఉద్యోగులను పండగ రోజు కూడా కలెక్టర్ కార్యాలయానికి పిలిపించారు. అనవసరమైనన్ని కంప్యూటర్లను కూడా సిద్ధం చేశారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడంతో అధికార యంత్రాంగం రాత పరీక్షకు అవసరమైన సెంటర్లను గుర్తించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రాథమికంగా సెంటర్లను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 254 సెంటర్లు ఏర్పాటు చేయతలపెట్టారు. అత్యధికంగా కర్నూలులో ఏడు సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా మిగిలిన వాటిని నంద్యాల, ఆదోని, నందికొట్కూరు, డోన్, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, బనగానపల్లె, గూడూరు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్ఓ అభ్యర్థులకు.. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. ఈనెల 19 నుంచి ఇంటర్నెట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. -
దరఖాస్తుల వెల్లువ
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ఒక్కపోస్టుకు సుమారుగా 200 మంది పోటీ.. ఇదేదో తహశీల్దార్.. ఆపై పోస్టులకు కాదు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు పోటీపడుతున్న జిల్లా అభ్యర్థుల సంఖ్య. దరఖాస్తు గడువుకు సోమవారమే చివరి రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు కలెక్టరేట్లో క్యూ కట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి జిల్లాలో 98 వీఆర్ఓ, 172 వీఆర్ఏ పోస్టులుండగా, సోమవారం సాయంత్రం 6 గంటలకు మొత్తం 59,342 దరఖాస్తులు అందాయి. వీఆర్ఓ పోస్టులకు అత్యధిక మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీఆర్ఓ పోస్టుల కోసం ఇంటర్మీడియట్ మొదలు పీజీ, బీటెక్, ఎంబీఏ చదివిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 98 వీఆర్ఓ పోస్టులకు 56,710 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక జిల్లాలో 172 వీఆర్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 1,631 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ రెండు పోస్టులకు జిల్లాలో 1,001 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు సోమవారం రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 2వ తేదీన రాతపరీక్ష నిర్వహిస్తారు. -
గ్రేడ్-4 కార్యదర్శి పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న 25 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాత పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరి 4 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్ధేశించిన రూ.100 ఫీజును జనవరి 20లోగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఫిబ్రవరి 23న ఏలూరులో రాత పరీక్ష నిర్వహిస్తారు. 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 23న కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నియామక ఉత్తర్వులను ఇస్తుంది. అభ్యర్థుల వయసు 2013 జూలై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఇచ్చారు. రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు : జిల్లాలో గ్రేడ్-4 కార్యదర్శి పోస్టులు 25 ఖాళీగా ఉన్నాయి. వీటిలో జనరల్‌కు 13, మహిళలకు 12 పోస్టులను కేటాయించారు. ఓసీ విభాగంలో జనరల్‌కు 6, మహిళలకు 4, బీసీ-ఏలో జనరల్‌కు 1, మహిళకు 1, బీసీ-బీలో జనరల్‌కు 1, మహిళకు 1, బీసీ-సీలో జనరల్‌కు 1, బీసీ-డీలో మహిళకు 1, బీసీ-ఈలో మహిళకు 1, ఎస్సీ కేటగిరీలో జనరల్‌కు 2, మహిళలకు 2, ఎస్టీ కేటగిరీలో జనరల్‌కు 1, మహిళకు 1, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలో మహిళకు 1 వికలాంగుల కేటగిరీలో మహిళకు1 చొప్పున పోస్టులు కేటాయించారు.