సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్‌లో ఫైనాన్స్ అండ్ అకౌం ట్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 64.2 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్‌లలో ఏర్పాటు చేసిన 84 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించామన్నారు. హైదరాబాద్‌లోని 22 పరీక్ష కేంద్రాల్లో 76.74 శాతం, రంగారెడ్డి జిల్లాలోని 21 కేంద్రాల్లో 71 శాతం, కరీంనగర్‌లోని 17 కేంద్రాల్లో 51.2 శాతం, వరంగల్‌లోని 24 కేంద్రాల్లో 57.8 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజైరె నట్లు తెలిపారు.
షేక్ బందగి స్వగ్రామం ఏది?
టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పోటీ పరీక్ష మాదిరిగానే ఈసారీ తెలంగాణ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా చరిత్రకు సంబంధించి దాదాపు 30 ప్రశ్నలు అడగగా అందులో తెలంగాణకు సంబంధించినవి 22 వరకు ఉన్నాయి. భారత చరిత్రపై దాదాపు 8 ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ ఆధునిక చరిత్ర మీద ప్రశ్నలు వచ్చాయి. విస్నూర్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాడిన షేక్‌బందగి స్వగ్రామం ఏది?
హైదరాబాద్‌లో సాలార్‌జంగ్ మ్యూజియాన్ని స్థాపించింది ఎవరు? కొమరవెల్లి వీరభద్రస్వామికి ప్రాచుర్యంలో ఉన్న మరో పేరు? మిలియన్ మార్చ్ దేనికి సంబంధించింది? తదితర ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నల క్లిష్టత స్థాయి కఠినంగా ఏమీ లేదనీ, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సులువుగానే గుర్తించే విధంగా ఉన్నాయనీ నిపుణులు చెబుతున్నారు.
* పాలిటీ నుంచి సుమారు 20 ప్రశ్నలు వచ్చాయి. ఇవి అభ్యర్థుల కనీస పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఏ సవరణ ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ ఏర్పాటుకు అవకాశం కల్పించింది? ప్రస్తుత తెలంగాణ శాసనమండలి అధ్యక్షుడు ఎవరు? లాంటి ప్రశ్నలు అడిగారు.
* భౌగోళిక శాస్త్రానికి సంబంధించి తెలంగాణ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదే శాలను వెలికితీసే విధంగా ప్రశ్నల రూపకల్పన ఉందని నిపుణులు అన్నారు. ముఖ్యంగా వంద స్తంభాల గుడి ఎక్కడ ఉందనే ప్రశ్నతో ఈ విషయం అర్థమవుతుందన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న జిల్లా? మున్నేరు నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? అమ్రాబాద్ పులుల రిజర్వు ఏ జిల్లాలో ఉంది? తదితర ప్రశ్నలు వచ్చాయి. 2013 ఉత్తరాఖండ్ వరదల సందర్భంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ చైర్మన్ ఎవరు? అనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లు సరైనవి కావు, ఎన్‌డీఎంఏకు ప్రధాని చైర్మన్‌గా ఉంటారు. కానీ ప్రధాని పేరు ఆప్షన్‌లో లేదు కానీ అప్పటి వైస్ చైర్మన్ ఎం.శశిధర్‌రెడ్డి పేరు ఇచ్చారు. అదే విధంగా పిల్లలమర్రి ఎక్కడ ఉందనే ప్రశ్నను తెలుగులో ఇవ్వలేదు.
* ఇంగ్లిష్ మీద అడిగిన ప్రశ్నలు చాలా సులువుగా హైస్కూల్ స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. జాగ్రత్తగా గుర్తిస్తే అడిగిన 15 ప్రశ్నలకూ సమాధానాలు రాయవచ్చంటున్నారు. అదేవిధంగా వర్తమాన అంశాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. దినపత్రికలను క్రమం తప్పకుండా చదివేవారు సమాధానాలు గుర్తించే విధంగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. మ్యాథ్స్ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలు సులువుగానే ఉన్నాయని తెలిపారు.
వాటర్‌వర్క్స్ అసిస్టెంట్ పరీక్షకు 64.2 శాతం హాజరు
Published Mon, Nov 30 2015 2:26 AM | Last Updated on Tue, Sep 4 2018 4:45 PM
Advertisement