రూర్కెలా: ఒడిషాలో పంచాయతీ ఎన్నికల సంరంభం ఆరంభమైంది. అయితే ఎవరిని పడితే వారిని ఎన్నుకోమని కుట్రగ్రామ్ పంచాయతీ పరిధిలోని మలుపదా గ్రామస్థులు తేల్చిచెబుతున్నారు. తమ ఓట్లు కావాలంటే తాము పెట్టే పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలని వింత షరతు పెట్టారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీపడుతున్నవారంతా పరీక్షకు తయారయ్యారు. ఆదివాసీలు అధికంగా ఉండే ఈ గ్రామంలో ఎన్నికలు ఈనెల 18న జరగనున్నాయి. 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
స్థానిక పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించిన రాత పరీక్షకు వీరిలో 8మంది హాజరయ్యారు. రాత్రి 8 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణాలు, సర్పంచ్‌కుండాల్సిన లక్ష్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన, గ్రామ పరిస్థితులపై సమాచారం తదితర అంశాలను పరీక్షలో అడిగారు. ఫలితాలు ఈ నెల 17న ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment