Panchayat polls
-
ఇక ‘పంచాయతీ’ సమరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిమగ్నమైంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ (పీఆర్) సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి ముందే, నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పీఆర్ సంస్థల టర్మ్ ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతో జనవరిలో లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల షెడ్యూల్‌తో సహా ప్రతిపాదనలు పంపించనున్నట్టు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ సాగనుంది. అయితే వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలుండటం, ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఈలోగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. కొత్త సర్కార్ కుదరదంటుందా? పంచాయతీ ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కావడంతో, వెంటనే మరో ఎన్నికల సమరానికి కొత్త ప్రభుత్వం మొగ్గు చూపక పోవచ్చుననే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని, ఆరు నెలల్లో దీనికి సంబంధించి బీసీ కమిషన్ నివేదిక తెప్పించుకున్నాక తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టొచ్చునని అంచనా వేస్తున్నారు. వరుసగా జీపీ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్ పోల్స్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలుత గ్రామ పంచాయతీ (జీపీ), ఆ తర్వాత కొన్ని నెలలకే మండల, జిల్లా ప్రజా పరిషత్ (ఎంపీపీ, జెడ్పీపీ), మరికొన్ని నెలల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. జీపీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది ఎంపిక, నియామకం అనేది కీలకమైన నేపథ్యంలో ఈ నెల 30 లోగా దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ ప్రక్రియకు సంబంధించి అనుసరించాల్సిన విధానంపై, ఈ ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సర్క్యులర్ పంపించారు. పోలింగ్ బూత్‌లలో 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారిని నియమించాలని సూచించారు. 201 నుంచి 400 ఓటర్ల దాకా ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులను, 401 నుంచి 650 వరకు ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలని తెలిపారు. ఏదైనా వార్డులో ఓటర్ల సంఖ్య 650 దాటితే రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ప్రతి జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తున్నందున, మొదటి దశలో ఎన్నికలు నిర్వహించిన రిటర్నింగ్, ప్రిసైడింగ్, పోలింగ్ ఆఫీసర్ల సేవలను మూడో దశ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోవాలని సూచించారు. -
పంచాయతీ ఎన్నికలు.. మధ్యాహ్న భోజనంలో చికెన్, పండ్లు
లక్నో: పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార టీఎంసీ ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కొత్తగా చికెన్, సీజనల్ పండ్లు అందజేయాలని నిర్ణయింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురానుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలలపాటు వీటిని స్కూల్ పిల్లలకు అందజేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మిల్లో భాగంగా బియ్యం, పప్పులు, కూరగాయలు, సోయాబీన్ ,గుడ్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మెనూలో అదనంగా పీఎం పోషన్ కింద పోషకాహారం కోసం వారానికి ఒకసారి చికెన్, సీజనల్ పండ్లను అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం మమతా బెనర్జీ సర్కార్ అదనంగా రూ. 371 కోట్లను మంజూరు చేసింది. జనవరి నుంచి అదనపు పౌష్టికాహార పథకం అమలులోకి వస్తోందని విద్యాశాఖ విభాగం అధికారి ఒకరు ధృవీకరించారు. అయితే ఏప్రిల్ తర్వాత దీనిని కొనసాగించాలా వద్దా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రతి విద్యార్థికి అదనపు పోషకాహారాన్ని అందించడానికి వారానికి రూ. 20 ఖర్చు అవుతుందన్నారు. ఈ ప్రక్రియ 16 వారాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్ర,ఎయిడెడ్ పాఠశాలల్లో 1.16 కోట్ల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్దిపొందుతున్నారు. దీని కోసం రాష్ట్ర, కేంద్రం 60:40 నిష్పత్తిలో ఖర్చును పంచుకుంటాయి. అయితే ఈ నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది, ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని బీజేపీ మండిపడింది.అయితే దీనిపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్.. ప్రతిపక్షాలు ప్రతిదానిలో చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించింది. మరోవైపు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన నిలుస్తారని టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ అన్నారు. చదవండి: నెల రోజుల్లో రెండో ఘటన.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మరో దారుణం .. -
సర్పంచ్ పదవికి ఎంట్రన్స్ టెస్ట్
రూర్కెలా: ఒడిషాలో పంచాయతీ ఎన్నికల సంరంభం ఆరంభమైంది. అయితే ఎవరిని పడితే వారిని ఎన్నుకోమని కుట్రగ్రామ్ పంచాయతీ పరిధిలోని మలుపదా గ్రామస్థులు తేల్చిచెబుతున్నారు. తమ ఓట్లు కావాలంటే తాము పెట్టే పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలని వింత షరతు పెట్టారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీపడుతున్నవారంతా పరీక్షకు తయారయ్యారు. ఆదివాసీలు అధికంగా ఉండే ఈ గ్రామంలో ఎన్నికలు ఈనెల 18న జరగనున్నాయి. 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. స్థానిక పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించిన రాత పరీక్షకు వీరిలో 8మంది హాజరయ్యారు. రాత్రి 8 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణాలు, సర్పంచ్కుండాల్సిన లక్ష్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన, గ్రామ పరిస్థితులపై సమాచారం తదితర అంశాలను పరీక్షలో అడిగారు. ఫలితాలు ఈ నెల 17న ప్రకటిస్తారు. చదవండి: (మీ పాలనలో రూ.5.35 లక్షల కోట్ల మోసాలు!) -
తుది విడత పంచాయతీ పోరులో 549 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో 549 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నాలుగు దశల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ల సంఖ్య 2,192కు చేరింది. తుది దశ ఎన్నికల కోసం ఈనెల 10న నోటిఫికేషన్ జారీచేసి 12వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 2,750 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఈ నెల 21న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు. వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించిన అనంతరం వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. -
పంచాయతీ ఎన్నికలకు ఆ ఊరు దూరం
అదో వసుధైక కుటుంబం. అర్ధ శతాబ్ద కాలంగా ఆపకుండా చైతన్య కాగడాలు వెలిగిస్తోంది. గ్రామ రాజకీయాలను నిప్పులతో కడుగుతూ స్వచ్ఛంగా ఉంచింది. రెండు వందల పైచిలుకు గడపలకు నాయకత్వాన్ని ఆస్తిగా పంచింది. పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఎన్నికలతో పని లేకుండా ప్రజాస్వామ్యాన్ని బతికిస్తోంది. తొమ్మిది వందల పైచిలుకు సభ్యులున్న ఆ ఉమ్మడి కుటుంబం పేరు వెంకయ్యపేట. పల్లె ఐకమత్యంగా ఉంటే ఏం సాధించగలదో చెప్పడానికి ఈ ఊరే ఉదాహరణ. సమస్యలుంటే అందరూ కలిసి గుడి వద్ద కూర్చుని పరిష్కరించుకుంటారు. డబ్బులొస్తే ఊరినెలా బాగు చేయాలా అని ఆలోచిస్తారు. ఇంత అందమైన మనుషులున్న ఆ ఊరి గురించి.. సాక్షి, జి.సిగడాం(శ్రీకాకుళం): మండలంలోని వెంకయ్య పేట పంచాయతీ ఎన్నికలకు ఎప్పటి నుంచో దూరంగా ఉంటోంది. ఇక్కడ ఎప్పుడూ ఏకగ్రీవమే. గ్రామంలో సుమారు 900 వరకు జనాభా ఉన్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులతో పాటు వివిధ రకాల పట్టభద్రులు ఈ గ్రామ కీర్తిని నలుదిశలా పెంచుతున్నారు. రాజకీయ రంగంలో మాత్రం ఈ గ్రామానిది ఓ ప్రత్యేక శైలి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ గ్రామంలో పంచాయతీ ఎన్నికలే జరగలేదు. పారీ్టలు ఏమైనా ఇక్కడ వర్గపోరు ఉండదు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేకుండా సంఘటితంగా ఉంటూ గ్రామ నేతను ఎన్నుకోవడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది. ఊరిలో ఏమైనా స్వల్ప వివాదాలు తలెత్తితే గ్రామ పెద్దల సమక్షంలోనే అవి పరిష్కారానికి నోచుకుంటాయి. పోలీసు స్టేషన్లో గానీ, కోర్టులలో గానీ ఈ గ్రామానికి సంబంధించిన కేసులు మచ్చుకైనా కనిపించవు. పంచాయతీ సర్పంచ్‌గా ఎవరు ఎన్నికైనా గ్రామాభివృద్ధికి పాటుపడుతూ గ్రామానికి సరికొత్త రూపును సింగారించుకునేలా కృషి చేస్తుంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ గ్రామం ఇందిరమ్మ ఆదర్శ పంచాయతీగా ఎంపికైంది. అప్పటి నుంచి ఆ గ్రామ స్వరూపం మారింది. 200 పక్కా గృహాలు, 210 పింఛన్లతో పాటుగా పలు సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయి. ఆవిర్భావం నుంచి నేటి వరకు.. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం నుంచి నేటి వరకు గ్రామ సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యే నాటి నుంచి ఆ రేళ్ల నారాయణప్పడు ఐదు సార్లు, బత్తుల లక్ష్మణరావు, శ్రవణం ఈశ్వరమ్మ, శ్రవణం పోలీసు, మావిడి శ్రీనివాసరావు, 2013లో మర్రిబందల లక్ష్మి (ఎస్సీ) ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా వరుసగా ఎన్నికయ్యారు. అందరి సహకారంతో.. పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు నుంచి మా గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతోంది. నేటి వరకు పంచాయతీ ఎన్నికలకు ఓటింగ్ తెలీదు. 2009లో జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను అందించింది. దీంతో ప్రతి వీధిలో సిమ్మెంటు రోడ్డు వేసుకున్నాం. – మావిడి శ్రీను, మాజీ సర్పంచ్ ఐకమత్యంతో ఎన్నుకుంటాం గ్రామంలో చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఒకే వేదికపై కలుసుకుని గ్రామ సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామంలోని రిజర్వేషన్ల ప్రకారమే వ్యక్తులను ఎంపిక చేసుకుంటాం. గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం. – డి.అమ్మారావు, రిటైర్డ్ ఉద్యోగి పెద్దలను గౌరవిస్తాం గ్రామంలో ఉన్న పెద్దలందరినీ గౌరవిస్తాం. ఎలాంటి వివాదాలకు వెళ్లం. ఏమైనా సమస్యలుంటే రామాలయం వద్దే పరిష్కరించుకుంటాం. రానున్న ఎన్నికల్లో ఏకగ్రీవంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. – ఎ.గొల్లాజీ, గ్రామస్తుడు -
ప్రజాస్వామ్యం పరువు తీసిన తృణమూల్
సాక్షి, న్యూఢిల్లీ : ఇదివరకటిలాగే ఈసారి కూడా పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య హింసాకాండ చెలరేగింది. సోమవారం జరిగిన ఎన్నికల సందర్భంగా ఉత్పన్నమైన హింసాకాండలో దాదాపు 18 మంది మరణించారు. రాష్ట్రంలో హింసాకాండ పెరగలేదని వాస్తవానికి తగ్గిందంటూ ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతోంది. 2003లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 61 మంది మరణించారు. ఆ విషయంతో పోలీస్తే హింసాకాండ తగ్గింది. అంతమాత్రాన ఎన్నికలు సవ్యంగా జరిగాయని, ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగ్గా పనిచేసినట్లు భావించలేం. తొలి ఓటు కూడా వేయకముందే 34 శాతం పంచాయతీలను ఎలాంటి పోటీ చేయకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడమే అందుకు కారణం. ఇతర రాజకీయ పార్టీలకు సంస్థాగత బలం లేకపోవడం వల్ల ఈ 34 శాతం పంచాయతీల్లో పోటీ చేయలేకపోయిందని, అందుకనే పోటీ లేకుండా తమ పార్టీ విజయం సాధించినదని పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటోంది. కానీ ఎవరిని పోటీ చేయకుండా బెదిరించడం వల్లనే పోటీ లేకుండా పాలకపక్షం గెలిచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రమంగా ఎదుగుతూ ఇప్పుడు ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించిన భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి తృణమూల్ కాంగ్రెస్‌లో అభద్రతా భావం ఏర్పడిందని, అందుకనే తృణమూల్ బీర్భమ్ జిల్లాలో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని వారంటున్నారు. ఈ జిల్లాలోనే ఎక్కువ పంచాయతీలను పోటీ లేకుండా తృణమూల్ కైవసం చేసుకుంది. 2019లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పంచాయతీలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే బీజేపీని అడ్డుకునేందుకు తృణమూల్ తీవ్రంగా కృషి చేసింది. ప్రజాస్వామ్యం బూడిదపై రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడం మంచిదికాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అనూహ్యం: బీజేపీతో కామ్రేడ్ దోస్తీ
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పంచాయితీ ఎన్నికల కోసం బీజేపీతో సీపీఎం దోస్తీ కడుతోంది. పంచాయితీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని ధృవీకరించినట్లు ప్రముఖ మీడియా ఏజెన్సీ పీటీఐ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) చేస్తున్న రౌడీ రాజకీయాల్ని కూకటి వేళ్లతోసహ పెకలించాలని నదియా జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. టీఎంసీని ఓడించటమే మా లక్ష్యం’ అని సీపీఎం ప్రతినిధి సుమిత్ దే వెల్లడించారు. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఇక మిగతా జిల్లాలో, ముఖ్యంగా టీఎంసీ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా సీపీఎం-బీజేపీలు ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. అధిష్ఠానం అనుమతి తర్వాతే తాము ఈ విషయంలో ముందుకెళ్తున్నామని దిలీప్ తెలిపారు. కాగా, విభజన రాజకీయాలకు బీజేపీ కేరాఫ్ అంటూ విమర్శలు గుప్పించే సీపీఎం.. ఇప్పుడు అదే పార్టీతో జత కట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీఎంసీ ఈ వ్యవహారాన్ని కుట్రపూరిత రాజకీయంగా అభివర్ణిస్తోంది. తమను దెబ్బకొట్టాలని యత్నిస్తున్న వారికి భంగపాటు తప్పదని టీఎంసీ కార్యదర్శి పార్థ ఛటర్జీ చెప్పారు. నదియా జిల్లా కరీంపూర్-రానాఘాట్‌లో కొన్నిరోజుల క్రితం హింస చెలరేగింది. దీనికి టీఎంసీనే కారణమంటూ బీజేపీ-సీపీఎంలు సంయుక్తంగా ర్యాలీలు చేపట్టాయి. తదనంతర పరిస్థితులతో ఇప్పుడు ఏకంగా కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి. ఖండించిన సీతారాం ఏచూరి.. ఇదిలా ఉంటే ఆ వార్తలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విటర్ వేదికగా ఖండించారు. ‘పొత్తులపై మీడియా కథనాల్లో వాస్తవం లేదని, నదియా జిల్లాలో సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తోందని తెలిపారు. టీఎంసీ, బీజేపీల విధానాలకు తాము వ్యతిరేకమని ప్రకటించారు. తప్పుడు వార్తలతో కార్యకర్తల్లో గందరగోళం సృష్టించాలని కొందరు యత్నిస్తున్నారంటూ’ ఆయన ట్వీట్ చేశారు. కాగా, మే 14న పశ్చిమ బెంగాల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల గెజిట్లు సిద్ధం
-
పంచాయతీ పిడుగు?
-
పంచాయతీ పిడుగు?
* జెడ్పీ, ఎంపీ చైర్పర్సన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లు నేడు ఖరారు! * పంచాయతీరాజ్ ఎన్నికలపై నేడు సుప్రీంలో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ * 2011 జూలై నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు * సుప్రీం ‘మున్సిపోల్స్ తీర్పు’ దృష్ట్యా ఈ ఎన్నికల నిర్వహణకు కసరత్తు షురూ * ఒకవైపు మున్సిపోల్స్, మరోవైపు సార్వత్రిక సమరంతో ఇప్పటికే పార్టీల్లో గందరగోళం * మున్సిపల్ ఫలితాల ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందనే భయం * తాజాగా ‘పంచాయతీరాజ్’ కదలికలపై నేతల్లో మరింత అయోమయం * ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారుల మల్లగుల్లాలు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు.. మరోవైపు సార్వత్రిక సమరం! తాజాగా పంచాయతీరాజ్ పోరు సూచనలు!! అంతా అయోమయం.. గందరగోళం. సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిపడిన మున్సిపల్ ఎన్నికలే రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వేర్వేరు వ్యూహాలు అవసరమైన ఈ రెండు ఎన్నికలను ఎదుర్కోవడమెలా అని పార్టీలు తర్జనభర్జనలు పడుతున్నాయి. మున్సిపల్ ఫలితాలు ఎగ్జిట్ పోల్‌లా మారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఇబ్బందులు సృష్టించే ప్రమాదముందంటూ ఎన్నికల కమిషన్‌కు మొరపెట్టుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మొదలైన పంచాయతీరాజ్ ఎన్నికల కసరత్తు నేతల్లో మరింత అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తోంది. మూడేళ్లుగా వాయిదాలు పడుతున్న పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో పడింది. శుక్రవారం జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల చైర్పర్సన్లతోపాటు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి, ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించడానికి రంగం సిద్ధమైంది. సుప్రీం విచారణ నేపథ్యంలోనే.. * 2011 జూలై నుంచి వివిధ కారణాలతో వాయిదా పడుతున్న ఈ ఎన్నికలు అకస్మాత్తుగా తెరపైకి రావటానికి.. ఈ ఎన్నికల అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుండటమే కారణం. * 2011లో జిల్లా పరిషత్, మండల పరిషత్ రిజర్వేషన్లను ఖరారు చేసినప్పుడు మొత్తం రిజర్వేషన్లు 60.5 శాతంగా ఉండడంతో... అది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ ఎన్నికలు ఆగిపోయాయి. * గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ముందుగా ఎన్నికలైతే నిర్వహించండి అంటూ సుప్రీం ఆదేశించడంతో 60.5% రిజర్వేషన్లతో గత జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు. * రాష్ట్రంలో 22 జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, 1,100 జెడ్పీటీసీలు, 1,100 మండల పరిషత్ చైర్పర్సన్లు, 16 వేలకు పైగా ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇదే అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. * మున్సిపల్ ఎన్నికల్ని సకాలంలో నిర్వహించక తప్పదని ఇటీవల హైకోర్టు తీర్పు ఇవ్వడం దాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు తరుముకొచ్చారుు. * ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని సుప్రీం తీర్పు ఇస్తుందేమోనని రాష్ట్ర అధికార యంత్రాంగం భావిస్తోంది. అందుకనే ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో పడింది. సర్వత్రా ఉత్కంఠ శుక్రవారం సుప్రీంకోర్టు పంచాయతీరాజ్ ఎన్నికలపై ఏం చెబుతుందోననే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికలు సైతం పార్టీ గుర్తులపైనే జరగనున్నారుు. ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశిస్తే మాత్రం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పూర్తి గందరగోళంగా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం మార్చి 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, ఏప్రిల్ రెండోతేదీన ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఈ ఫలితాలు ప్రకటించిన రోజే సాధారణ ఎన్నికల తొలి విడతకు నోటిఫికేషన్ జారీ కానుంది. అధికార యంత్రాంగమంతా ఆ ఎన్నికల హడావుడిలో మునిగిపోతుంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ ఏడో తేదీ వరకూ కొనసాగనుంది. ఆ రోజు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చైర్పర్సన్లను, మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ మున్సిపల్ ఎన్నికలతో పాటే పంచాయతీరాజ్ ఎన్నికలూ నిర్వహించాల్సి వస్తే... ఇంత త్వరగా కసరత్తు, ఏర్పాట్లు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ సాధారణ ఎన్నికల తర్వాత నిర్వహించాలనుకుంటే... మే 16 వరకూ ఈ ఎన్నికలు సాగుతాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన కసరత్తు చివరి దశలో ఉంటుంది. జూన్ 2 లోపు రెండు ప్రభుత్వాలు ఏర్పడి శాసనసభలు కొలువుతీరాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో అధికార యంత్రాంగం పంచాయతీరాజ్ ఎన్నికల్ని నిర్వహించగలగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం ఏం చెబుతుంది? ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది? అనే అంశాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. -
రిజర్వేషన్ అదే.. మళ్లీ పాత కథే!
నవాబుపేట, న్యూస్‌లైన్: అధికారుల తప్పిదం కారణంగా తాము నష్టపోయామంటూ రెండోసారీ మమ్మదాన్‌పల్లి గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. కొన్నేళ్లుగా గ్రామంలో అసలే లేని ఎస్సీ కులానికి ఏకంగా రిజర్వేషన్ ఖరారు చేయడంపై స్థాని కులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మండలంలోని మమ్మదాన్‌పల్లి పంచాయతీ పరిధిలో 648 మంది ఓట ర్లు ఉన్నారు. ఈ గ్రామంలో కేవలం బీసీలు మాత్రమే ఉన్నారు. ప్రతీ సర్పం చ్ ఎన్నికల్లో.. ఓసారి బీసీ మహిళకు.. మరోసారి బీసీ జనరల్‌కు రిజర్వేషన్ వస్తూంటుంది. ఇది మండల వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ఎన్నికల్లో మా త్రం అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. మోమిన్‌పేట నుంచి బతుకుదెరువు కోసం వచ్చి గ్రామంలో ఉంటున్న అనంతయ్య (బీసీ)ని ఎస్సీగా మార్చారు. దీంతో ప్రభుత్వం ఈ పంచాయతీలో రొటేషన్ పద్ధతిలో.. ఇంతవరకూ ఇక్కడ ఎస్సీకి రిజర్వేషన్ కల్పించలేదని గత ఏడాది జూన్‌లో ఆ వర్గానికి రిజర్వుడ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గ్రామస్తులు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. అయి నా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామస్తులు గత జూలై నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. రెండోసారీ ఇదే పరిస్థితి.. మొదటిసారి గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడంతో మమ్మదాన్‌పల్లిలో ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. ప్రభుత్వం మళ్లీ ఈ నెల 1న మమ్మదాన్‌పల్లి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా సర్పంచ్ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా అంతకుముందు వ్యక్తికే (ఎస్సీ) రిజర్వేషన్ ఖరారు చేశారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 3 నుంచి సోమవారం వరకు చేపట్టారు. కానీ గ్రామస్తులు... ఎస్సీగా మార్చిన వ్యక్తిగానీ మరెవరూ నామినేషన్లు వేయనివ్వలేదు. రిజర్వేషనలో మార్పు చేయకుండా నోటిఫికేషన్ జారీ చేసినందున తాము రెండోసారి కూడా పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మమ్మదాన్‌పల్లి గ్రామస్తులు చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకూ ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉంటామని వారు స్పష్టంచేస్తున్నారు. కాగా.. మండలంలోని ఎల్లకొండలోని 8 (జనరల్)వ వార్డుకు 4 నామినేషన్లు దాఖలైనట్టు సోమవారం ఎంపీడీవో ప్రవీణ తెలిపారు. -
మరో సంగ్రామం!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : జిల్లాలో మళ్లీ పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. గత ఏడాది జూలైలో పలు కారణాల వల్ల ఎన్నికలు జరగని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రె డ్డి బుధవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, ఎన్నికలు నిర్వహించాల్సిన తేదీలు, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనపై స్పష్టమైన మార్గదర్శకాలను వెల్లడించారు. జిల్లాలో మొత్తం 921 పంచాయతీలకు, 8,764 వార్డులకు గత సంవత్సరం జూలైలో ఎన్నికలు నిర్వహించినప్పటికీ పలు కారణాల వల్ల వేపాడ మండలం గుడివాడ, కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగరం మండలం జోగింపేట పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. సాలూరు నియోజకవర్గం పరిధిలోని పురోహితునివలస పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికైన జన్ని అప్పన్న డిసెంబర్ 9న మృతి చెందడంతో ఆ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగనుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో మొత్తం 75 వార్డు సభ్యుల స్థానాలకు ఇదే రోజున ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే రోజున ఎన్నికల నోటీసు జారీ చేయడంతో పాటు, గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు నిర్ణీత రోజుల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లను దాఖలు చేయాలి. పూర్తి చేసిన నామినేషన్లను ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలి. స్వీకరించిన నామినేషన్లను ఈ నెల 7న పరిశీలిస్తారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా నామినేషన్ల తిరస్కరణపై రెవెన్యూ డివిజన్ అధికారి సమక్షంలో అప్పీలు చేయాల్సి ఉంటుంది. 9న ఆర్డీఓలు వాటిని పరిష్కరిస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం 3గంటలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అనంతరం అదే రోజున పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి అదే రోజున విజేతలను ప్రకటిస్తారు. అంతేకాకుండా అదే రోజున ఉపసర్పంచ్ అభ్యర్థి ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంటుంది. అనివార్య కారణాల వల్ల ఉపసర్పంచ్ ఎన్నిక జరగకపోతే మరుసటి రోజున నిర్వహించాలి. సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఇవే.... వేపాడ మండలం గుడివాడ పంచాయతీని బీసీ జనరల్, కొత్తవలస మండలం వియ్యం పేట పంచాయతీని ఎస్టీ మహిళకు, సీతానగరం మండలం జోగింపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, సాలూరు మండలం పురోహితుని వలస సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఆ రెండు పంచాయతీలకు ఎన్నికలు లేనట్లే...! జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న పార్వతీపురం డివిజన్లోని నవిరి, కోటవానివలస పంచాయతీలకు సాధారణ ఎన్నికలు ఉండవని సమాచారం. ఈ రెండు పంచాయతీల్లో గతంలో నివసించే ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం అవి విలీన పంచాయతీలుగా ఉంటాయని, దీంతో ఆయా పంచాయతీల్లో ఎన్నికలు ఇకపై ఉండవని అధికారులు చెబుతున్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు... జిల్లాలో వివిధ పంచాయతీల్లో గత ఏడాది ఎన్నికలు జరగని వార్డులకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలిలా ఉన్నారుు.. గజపతినగరం నియోజకవర్గంలో... గంట్యాడ మండలం డికెపర్తి పంచాయతీలోని 7వ వార్డును ఎస్టీ జనరల్‌కు, బొండపల్లి మండలం బిల్లలవలస పంచాయతీలోని నాలుగో వార్డును జనరల్‌కు కేటాయించారు. చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాం మండలం సోమలింగాపురం పంచాయతీలో ఏడో వార్డు జనరల్‌కు కేటాయించగా అదే మండలంలో భీమవరం పంచాయతీలో ఒకటో వార్డుకు బీసీ జనరల్, మూడవ వార్డుకు బీసీ జనరల్, ఎనిమిదో వార్డు జనరల్, తొమ్మిదో వార్డు ఎస్సీ మహిళ, పదో వార్డుకు ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. గుర్ల మండలంలో లవిడాం పంచాయతీలో మూడో వార్డును బీసీ జనరల్‌కు, ఐదో వార్డును బీసీ మహిళ కు కేటాయించారు. కురుపాం నియోజకవర్గం కురుపాం మండలం పెదగొట్టిలి పంచాయతీ పరిధిలో మూడు, నాలుగు, పదో వార్డులు ఎస్టీ మహిళ, ఏడో వార్డుకు ఎస్సీ జనరల్, అదే మండలంలో తిత్తిరి పంచాయతీ పరిధిలో ఆరో వార్డు ఎస్టీ మహిళ, పదో వార్డు ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. జియ్యమ్మవలస మండలం అలమండ పంచాయతీలో మూడో వార్డును ఎస్టీ మహిళకు కేటాయించగా... అదే మండలంలో అర్నాడ పంచాయతీలో ఏడో వార్డును ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. గుమ్మలక్ష్మీపురం మండలం బలేసు పంచాయతీలోని రెండో వార్డును ఎస్టీ జనరల్‌కు, బీరుపాడు పంచాయతీలో ఒకటో వార్డును ఎస్సీ మహిళకు, ఏడో వార్డును ఎస్టీ మహిళకు కేటాయించారు. చినశిగడ పంచాయతీలోని ఒకటో వార్డును ఎస్టీ జనరల్‌కు, 8,9,10వ వార్డులను ఎస్టీ మహిళకు, జర్న పంచాయతీలోని ఏడో వార్డును ఎస్టీ మహిళకు, లంబేసు పంచాయతీలోని ఎనిమిదో వార్డును ఎస్టీ మహిళకు, నాండ్రుకొండ పంచాయతీలోని ఏడో వార్డును ఎస్టీ మహిళకు, వంగర పంచాయతీలోని 1,5 వ వార్డులను ఎస్టీ మహిళకు, ఆరో వార్డును ఎస్టీ జనరల్‌కు, నెల్లికెక్కువ పంచాయతీలో రెండో వార్డును ఎస్టీ మహిళకు కేటాయించారు. కొమరాడ మండలంలో మసిమండ పంచాయతీలోని రెండోవార్డుకు ఎస్టీ జనరల్, ఏడో వార్డుకు ఎస్టీ మహిళ కు కేటాయించారు. కుంటేసు పంచాయతీలోని ఎనిమిదో వార్డును ఎస్టీ జనరల్‌కు, నయా పంచాయతీలోని ఒకటి, నాలుగు వార్డులను ఎస్టీ మహిళలకు కేటాయించారు. దేవుకోన పంచాయతీలోని రెండో వార్డును ఎస్టీ మహిళకు, మూడో వార్డును బీసీ మహిళకు, నాలుగో వార్డును జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. పాలెం పంచాయతీలోని ఆరో వార్డును ఎస్టీ మహిళకు, ఎనిమిదో వార్డును బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలో ఒకటో వార్డు ఎస్టీ మహిళ. రెండో వార్డు ఎస్టీ జనరల్, 3,5,7,8 వార్డులను బీసీ జనరల్‌కు, 4,6,9వ వార్డులను బీసీ మహిళ, 10వ వార్డును ఎస్సీ మహిళకు కేటాయించారు. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం పెద్దవలస పంచాయతీ పరిధిలో ఐదో వార్డును ఎస్సీ మహిళకు కేటాయించారు. సాలూరు మండలంలో అన్నంరాజువలస పంచాయతీలోని ఐదవ వార్డును బీసీ మహిళకు, జిల్లేడువలస పంచాయతీలోని ఆరవ వార్డును ఎస్టీ మహిళకు, నెలిపర్తి పంచాయతీలోని తొమ్మిదవ వార్డును ఎస్టీ మహిళకు, గంజాయిభద్ర పంచాయతీలోని ఐదవ వార్డును ఎస్టీ జనరల్‌కు, ఆరవ వార్డును ఎస్టీ మహిళకు, ఎనిమిదవ వార్డును ఎస్టీ మహిళకు, తొమ్మిదవ వార్డును ఎస్టీ మహిళకు కేటాయించారు. బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలో డి.గదబవల పంచాయతీలో మొదటి వార్డును జనరల్ మహిళ, బాడంగి మండలం బాడంగి పంచాయతీలో ఏడవ వార్డును బీసీ జనరల్‌కు కేటాయించారు. ఎస్.కోట నియోజకవర్గం ఎస్.కోట మండలం వినాయకపల్లి పంచాయతీలోని ఒకటవ వార్డును జనరల్ అభ్యర్థికి, ఎల్కోట మండలం చందులూరు పంచాయతీలో ఐదవ వార్డును జనరల్ అభ్యర్థికి, వేపాడ మండలం గుడివా పంచాయతీ పరిధిలో మొదటి వార్డు బీసీ మహిళ, రెండవ వార్డు జనరల్మహిళ, మూడవ వార్డు ఎస్సీ జనరల్, నాల్గవ వార్డు జనరల్, ఐదవ వార్డు బీసీ జనరల్, ఆరవ వార్డు ఎస్సీ మహిళ, ఏడవ వార్డుకు బీసీ జనరల్, ఎనిమిదవ వార్డుకు బీసీ మహిళకు కేటాయించారు. కొత్తవలస మండలంలో కొండలావేరు పంచాయతీలో నాల్గవ వార్డు బీసీ మహిళ ,జామి మండలం తోండ్రంగి పంచాయతీ పరిధిలో ఆరవ వార్డును బీసీ మహిళకు కేటాయించారు. నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం కొప్పెర్ల పంచాయతీలోని ఆరవ వార్డును ఎస్సీ మహిళకు కేటాయించారు. -
తొమ్మిది జిల్లాలు వైఎస్సార్ సీపీ హవా
-
రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం
-
మహా భంగపాటు
-
చంద్రగిరిలో మంత్రి గల్లా అరుణకుమారి హల్చల్
-
కుట్రలు ఫలించలేదు... కుయక్తులు ఫారలేదు..
-
పంచాయితీ ఎన్నికలపై ఫోన్లో విజయమ్మ సమీక్ష