మరో సంగ్రామం!
Published Fri, Jan 3 2014 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : జిల్లాలో మళ్లీ పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. గత ఏడాది జూలైలో పలు కారణాల వల్ల ఎన్నికలు జరగని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రె డ్డి బుధవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, ఎన్నికలు నిర్వహించాల్సిన తేదీలు, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనపై స్పష్టమైన మార్గదర్శకాలను వెల్లడించారు. జిల్లాలో మొత్తం 921 పంచాయతీలకు, 8,764 వార్డులకు గత సంవత్సరం జూలైలో ఎన్నికలు నిర్వహించినప్పటికీ పలు కారణాల వల్ల వేపాడ మండలం గుడివాడ, కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగరం మండలం జోగింపేట పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. సాలూరు నియోజకవర్గం పరిధిలోని పురోహితునివలస పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికైన జన్ని అప్పన్న డిసెంబర్ 9న మృతి చెందడంతో ఆ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగనుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో మొత్తం 75 వార్డు సభ్యుల స్థానాలకు ఇదే రోజున ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే రోజున ఎన్నికల నోటీసు జారీ చేయడంతో పాటు, గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు నిర్ణీత రోజుల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లను దాఖలు చేయాలి. పూర్తి చేసిన నామినేషన్లను ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలి. స్వీకరించిన నామినేషన్లను ఈ నెల 7న పరిశీలిస్తారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా నామినేషన్ల తిరస్కరణపై రెవెన్యూ డివిజన్ అధికారి సమక్షంలో అప్పీలు చేయాల్సి ఉంటుంది. 9న ఆర్డీఓలు వాటిని పరిష్కరిస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం 3గంటలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అనంతరం అదే రోజున పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి అదే రోజున విజేతలను ప్రకటిస్తారు. అంతేకాకుండా అదే రోజున ఉపసర్పంచ్ అభ్యర్థి ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంటుంది. అనివార్య కారణాల వల్ల ఉపసర్పంచ్ ఎన్నిక జరగకపోతే మరుసటి రోజున నిర్వహించాలి.
సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఇవే....
వేపాడ మండలం గుడివాడ పంచాయతీని బీసీ జనరల్, కొత్తవలస మండలం వియ్యం పేట పంచాయతీని ఎస్టీ మహిళకు, సీతానగరం మండలం జోగింపేట సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, సాలూరు మండలం పురోహితుని వలస సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు.
ఆ రెండు పంచాయతీలకు ఎన్నికలు లేనట్లే...!
జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న పార్వతీపురం డివిజన్‌లోని నవిరి, కోటవానివలస పంచాయతీలకు సాధారణ ఎన్నికలు ఉండవని సమాచారం. ఈ రెండు పంచాయతీల్లో గతంలో నివసించే ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం అవి విలీన పంచాయతీలుగా ఉంటాయని, దీంతో ఆయా పంచాయతీల్లో ఎన్నికలు ఇకపై ఉండవని అధికారులు చెబుతున్నారు.
వార్డుల వారీగా రిజర్వేషన్లు...
జిల్లాలో వివిధ పంచాయతీల్లో గత ఏడాది ఎన్నికలు జరగని వార్డులకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలిలా ఉన్నారుు..
గజపతినగరం నియోజకవర్గంలో...
గంట్యాడ మండలం డికెపర్తి పంచాయతీలోని 7వ వార్డును ఎస్టీ జనరల్‌కు, బొండపల్లి మండలం బిల్లలవలస పంచాయతీలోని నాలుగో వార్డును జనరల్‌కు కేటాయించారు.
చీపురుపల్లి నియోజకవర్గం
మెరకముడిదాం మండలం సోమలింగాపురం పంచాయతీలో ఏడో వార్డు జనరల్‌కు కేటాయించగా అదే మండలంలో భీమవరం పంచాయతీలో ఒకటో వార్డుకు బీసీ జనరల్, మూడవ వార్డుకు బీసీ జనరల్, ఎనిమిదో వార్డు జనరల్, తొమ్మిదో వార్డు ఎస్సీ మహిళ, పదో వార్డుకు ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. గుర్ల మండలంలో లవిడాం పంచాయతీలో మూడో వార్డును బీసీ జనరల్‌కు, ఐదో వార్డును బీసీ మహిళ కు కేటాయించారు.
కురుపాం నియోజకవర్గం
కురుపాం మండలం పెదగొట్టిలి పంచాయతీ పరిధిలో మూడు, నాలుగు, పదో వార్డులు ఎస్టీ మహిళ, ఏడో వార్డుకు ఎస్సీ జనరల్, అదే మండలంలో తిత్తిరి పంచాయతీ పరిధిలో ఆరో వార్డు ఎస్టీ మహిళ, పదో వార్డు ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. జియ్యమ్మవలస మండలం అలమండ పంచాయతీలో మూడో వార్డును ఎస్టీ మహిళకు కేటాయించగా... అదే మండలంలో అర్నాడ పంచాయతీలో ఏడో వార్డును ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. గుమ్మలక్ష్మీపురం మండలం బలేసు పంచాయతీలోని రెండో వార్డును ఎస్టీ జనరల్‌కు, బీరుపాడు పంచాయతీలో ఒకటో వార్డును ఎస్సీ మహిళకు, ఏడో వార్డును ఎస్టీ మహిళకు కేటాయించారు. చినశిగడ పంచాయతీలోని ఒకటో వార్డును ఎస్టీ జనరల్‌కు, 8,9,10వ వార్డులను ఎస్టీ మహిళకు, జర్న పంచాయతీలోని ఏడో వార్డును ఎస్టీ మహిళకు,
లంబేసు పంచాయతీలోని ఎనిమిదో వార్డును ఎస్టీ మహిళకు, నాండ్రుకొండ పంచాయతీలోని ఏడో వార్డును ఎస్టీ మహిళకు, వంగర పంచాయతీలోని 1,5 వ వార్డులను ఎస్టీ మహిళకు, ఆరో వార్డును ఎస్టీ జనరల్‌కు, నెల్లికెక్కువ పంచాయతీలో రెండో వార్డును ఎస్టీ మహిళకు కేటాయించారు. కొమరాడ మండలంలో మసిమండ పంచాయతీలోని రెండోవార్డుకు ఎస్టీ జనరల్, ఏడో వార్డుకు ఎస్టీ మహిళ కు కేటాయించారు. కుంటేసు పంచాయతీలోని ఎనిమిదో వార్డును ఎస్టీ జనరల్‌కు, నయా పంచాయతీలోని ఒకటి, నాలుగు వార్డులను ఎస్టీ మహిళలకు కేటాయించారు. దేవుకోన పంచాయతీలోని రెండో వార్డును ఎస్టీ మహిళకు, మూడో వార్డును బీసీ మహిళకు, నాలుగో వార్డును జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. పాలెం పంచాయతీలోని ఆరో వార్డును ఎస్టీ మహిళకు, ఎనిమిదో వార్డును బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించారు.
పార్వతీపురం నియోజకవర్గం
సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలో ఒకటో వార్డు ఎస్టీ మహిళ. రెండో వార్డు ఎస్టీ జనరల్, 3,5,7,8 వార్డులను బీసీ జనరల్‌కు, 4,6,9వ వార్డులను బీసీ మహిళ, 10వ వార్డును ఎస్సీ మహిళకు కేటాయించారు.
సాలూరు నియోజకవర్గం
పాచిపెంట మండలం పెద్దవలస పంచాయతీ పరిధిలో ఐదో వార్డును ఎస్సీ మహిళకు కేటాయించారు. సాలూరు మండలంలో అన్నంరాజువలస పంచాయతీలోని ఐదవ వార్డును బీసీ మహిళకు, జిల్లేడువలస పంచాయతీలోని ఆరవ వార్డును ఎస్టీ మహిళకు, నెలిపర్తి పంచాయతీలోని తొమ్మిదవ వార్డును ఎస్టీ మహిళకు, గంజాయిభద్ర పంచాయతీలోని ఐదవ వార్డును ఎస్టీ జనరల్‌కు, ఆరవ వార్డును ఎస్టీ మహిళకు, ఎనిమిదవ వార్డును ఎస్టీ మహిళకు, తొమ్మిదవ వార్డును ఎస్టీ మహిళకు కేటాయించారు.
బొబ్బిలి నియోజకవర్గం
తెర్లాం మండలంలో డి.గదబవల పంచాయతీలో మొదటి వార్డును జనరల్ మహిళ, బాడంగి మండలం బాడంగి పంచాయతీలో ఏడవ వార్డును బీసీ జనరల్‌కు కేటాయించారు.
ఎస్.కోట నియోజకవర్గం
ఎస్.కోట మండలం వినాయకపల్లి పంచాయతీలోని ఒకటవ వార్డును జనరల్ అభ్యర్థికి, ఎల్‌కోట మండలం చందులూరు పంచాయతీలో ఐదవ వార్డును జనరల్ అభ్యర్థికి, వేపాడ మండలం గుడివా పంచాయతీ పరిధిలో మొదటి వార్డు బీసీ మహిళ, రెండవ వార్డు జనరల్‌మహిళ, మూడవ వార్డు ఎస్సీ జనరల్, నాల్గవ వార్డు జనరల్, ఐదవ వార్డు బీసీ జనరల్, ఆరవ వార్డు ఎస్సీ మహిళ, ఏడవ వార్డుకు బీసీ జనరల్, ఎనిమిదవ వార్డుకు బీసీ మహిళకు కేటాయించారు. కొత్తవలస మండలంలో కొండలావేరు పంచాయతీలో నాల్గవ వార్డు బీసీ మహిళ ,జామి మండలం తోండ్రంగి పంచాయతీ పరిధిలో ఆరవ వార్డును బీసీ మహిళకు కేటాయించారు.
నెల్లిమర్ల నియోజకవర్గం
పూసపాటిరేగ మండలం కొప్పెర్ల పంచాయతీలోని ఆరవ వార్డును ఎస్సీ మహిళకు కేటాయించారు.
Advertisement
Advertisement