చివరి రోజే కీలకం! | Deadline for Nominations April 19th | Sakshi
Sakshi News home page

చివరి రోజే కీలకం!

Published Tue, Apr 15 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

Deadline for Nominations April 19th

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:     లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 19వ తేదీతో నామినేషన్ల స్వీకరణకు గడువు పూర్తి కానుండడంతో ఆ రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలతో ముందుగానే సంప్రదించాలని, అభ్యర్థుల నామినేషన్లు సరైన ధ్రువీకరణ పత్రాలతో దాఖలు చేసేలా చూడాలన్నారు. నామినేషన్ల పరిశీలనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. పోస్టల్ బ్యాలెట్‌లు కూడా సరైన సమయంలో ముంద్రించి, పంపిణీ చేయాలన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ కూడా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిపించాలని ఆదేశించారు. పీఓలకు, ఏపీఓలకు ఈవీఎంలపై పూర్తిస్థారుులో అవగాహన కల్పిం చాలన్నారు.
 
 ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితం గా అమలు చేయాలన్నారు. తొమ్మిది పర్యవేక్షణ కమిటీలను నిర్థేశించిన స్థలాల్లో అందుబాటులో ఉంచాలని, ఉన్నతాధికారులకు త్వరగా సమాచారం అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈనెల 24 నుంచి 30వ తేదీలోపు ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. వచ్చేనెల 3వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్లకు తాగునీరు, నీడ కల్పించాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ  కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సూక్ష్మ పరిశీల కులు తప్పకుండా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జేసీ బి. రామారావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరాావు, డీఆర్‌ఓ బి. హేమసుందర్, ఆర్‌డీఓ జె. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement